[శ్రీ ఎం. వెంకటేశ్వరరావు రచించిన ‘నిశ్శబ్దంలోనూ..’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
ఒంటి చెయ్యి
చప్పుడు చెయ్యదు..
ప్రేమ కూడా
ఒంటరిగా పుట్టదు..
తగరం ముక్కల్లా
ఆ రెండు హృదయాలు
ముట్టుకుంటేనే
శబ్దం చేస్తాయి..
ముట్టకుంటే
నిశ్శబ్దంగా ఉంటాయి.
కానీ..
ఆ నిశ్శబ్దంలోనూ
ప్రేమ మాత్రం
ఎన్నాళ్లయినా..
ఎన్నేళ్లయినా..
మాట్లాడుతూనే.. ఉంటుంది
ఎం. వెంకటేశ్వర రావు చక్కని కథా రచయిత. మంచి నవలా రచయిత. “అదివో… అల్లదివో!” వీరి కథా సంపుటి. ఇటీవలి కాలంలో “విజయ విలాసం” పేరిట వ్యక్తిత్వ వికాసం సంబంధిత వ్యాసాలు కూడా రాస్తున్నారు.
