Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నూతన పదసంచిక-1

‘నూతన పదసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీ తాతిరాజు జగం గారు ‘నూతన పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. అవసరాల ప్రకాశం గారు తనలో ఉన్నది‌ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నారు. (4)
4. ఆస్కార్ వాళ్ళిచ్చేది (4)
7. భావి వసుదేవుడు కాదు ఆదిత్యుడే (5)
8. తెలంగాణ నమస్కారం (2)
10. కొర కలిపినా అసంపూర్ణమే(2)
11. ఇంటి ముందు తిన్నెలు ముందే అరిగి పోయాయి. (3)
13. ఈ శూర్పణఖకి ముక్కూచెవులు కాదు నడుం కోసేసారు (3)
14. పొడుగుది కాదు పొట్టిది (3)
15. అటు నుంచి ‘తండ్రీ’ అంటూ పిలువు (3)
16. మతాభిమానము చివరంటా లేదు (3)
18. హిందీ పెళ్ళి.చివర పొట్టి(2)
21. రెండు చివరలు చెక్కేసిన బంగాళదుంప (2)
22. తెలుగు వాడికి ఇదెక్కువట! చివరెందుకని వదిలేసాడు(5)
24. చెరువు తిరగబడింది (4)
25. ఒళ్ళున్న తెలంగాణ తండా ప్రజలు(4)

నిలువు:

1. గంజి వార్చని అన్నం.(4)
2. పొడిగా కాశీనాధుని విశ్వనాథ్ గారు (2)
3. మరాఠా వీరుడు (3)
4. దరిద్రం కాదు హరిద్రం. అయినా తిన్నగా తేలేదు (3)
5. గుర్రమెక్కేవాడే! ఇతని తోక  తెగిందెందుకో? (2)
6. అడ్డం 4 ని ఇలా తిప్పికొట్టాలా? (4)
9. శ్రీకాకుళం జిల్లా లోని ‘నాగావళి’ ఇంకో పేరు (5)
10. పెళ్ళి తంతులో చివరి ఘట్టం. (5)
12. ఒక రాగం అనుకునేరు. కాదు ఒక ధాతువు (3)
15. ఒగరు కాదు కొంచెం మార్చండి. ఒక రంగు వస్త్రం కనిపిస్తుంది (4)
17. కొట్లాటలు కావు. పెళ్ళిళ్ళలో ఇచ్చేవి.(4)
19. ఏదో ఇంత దీపం వెలిగించండి. ఎంతో వెలుగిస్తుంది. (3)
20. ముక్కంటి ముమ్మొనవాలు(3)
22. పిల్లలకి ఇదీ పాటా ఉండాలంటారు.(2)
23. ఆద్యంతాలు లేని ఒక రాగ విశేషం. రాజుగారి కొలువా?

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2022 మార్చి 15 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో నూతన పదసంచిక 1 పూరణ‘ అని వ్రాయాలి.  గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2022 మార్చి 20 తేదీన వెలువడతాయి.

కొత్త పదసంచిక-30 జవాబులు:

అడ్డం:   

1.పోతరాజు 4. గోపరాజు 7. కలుపుమొక్క 8. కోట 10. పాపా 11. లుక్కులు 13. నకలు 14. పాపలు 15. సౌమాశ్రీ 16. వస్త్రము 18. దారం 21. ముని 22. రోతబేరము 24. నినదము 25. వీపుసాపు

నిలువు:

1.పోసుకోలు 2. రాక 3. జులుము 4. గోమొడు 5. పక్క 6.జులపాలు 9. టక్కుటమారం 10. పాక శాస్త్రము 12. చేపలు  15. సౌదామిని 17. మునిమాపు 19. చూతము 20. పైరవీ 22. రోద 23. ముపు

కొత్త పదసంచిక-30 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

 

Exit mobile version