Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నూతన పదసంచిక-33

‘నూతన పదసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీ తాతిరాజు జగం గారు ‘నూతన పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. ఒక వారంలో వారం తీసేసి బ్రహ్మని కలపండి. చంద్రుడుదయిస్తాడు‌. (4)
4. అటునుంచి వినిపించిన మారుమ్రోత (4)
7. తామర మధ్య మాత్ర. ధ్వని నిచ్చేది (5)
8. తిరగబడిన దోషి (2)
10. తెలంగాణ నగిషీ (2)
11. చుట్టు తిరిగిన తరుగు (3)
13.  స్వభావం (3)
14.  నీచము (3)
15. ఇంగ్లీష్ వాడి బొప్పాయి (3)
16.  సిందూరము‌(3)
18.  తెలంగాణా కష్టం (2)
21. అటునుంచి చూడు. శత్రువు వస్తున్నాడు (2)
22. ఇది లేదు కానీ మెడకో డోలట‌ (5)
24. ఓమము అనగా వాము. ఇది కూడా అదే. అటుఇటూ అయింది. (4)
25. తీతువు పిట్ట (4)

నిలువు:

1. ఇది పడమటింటి కాపురం చెయ్యనన్నది (4)
2. కిందనుంచి — మనమంచికే (2)
3. ఎక్కువ పొలమున్న శ్రీకాకుళం రైతు తడబడ్డాడు (3)
4. మూడొంతులు ఉన్న నైట్రోజెన్ తిరగబడింది (3)
5. రాజకీయ పార్టీలు ప్రత్యర్ధి పార్టీ  మీద నిత్యం ఎత్తేది(2)
6.  ఎదురుచూచుట (4)
9.  —– పడిగే రాగం. చిన్నప్పుడు పాడేవాళ్ళం(5)
10. వెంటపడే వాడిని వీడితో పోలుస్తారు (5)
12. పుణ్యజీవి (3)
15. ఎట్టి లోటుపాట్లకు అవకాశం లేకుండా కట్టుదిట్టముగ నుండుట (4)
17. చిఱుసెనగలు (4)
19. చిన్నపెట్టె (3)
20. ఈ పాపరాజు ఒక ఆంధ్రకవి. (3)
22. తమరు (2)
23. వల (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2022 అక్టోబరు 25 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో నూతన పదసంచిక 33 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2022 అక్టోబరు 30 తేదీన వెలువడతాయి.

నూతన పదసంచిక 31 జవాబులు:

అడ్డం:   

1.సనాతని‌ 4. తంగరాదు‌ 7. మహాత్మాగాంధీ 8. స్వన‌ 10. తిష్ట‌ 11. తివలా‌ 13. విలోమి‌ 14. శారద‌ 15. పౌత్రుడు‌ 16. ళికాక‌ 18. రాలు‌ 21. లురా 22. మహిషాసుర 24. కపాలిని‌ 25. మనస్తోక

నిలువు:

1.సరస్వతి 2. తమ‌ 3. నిహాక‌ 4. తంగాంయు 5. గధీ‌ 6. దుర్గాష్టమి 9. నవరాత్రులు ‌10. తిలోదకాలు 12.  సురస‌ 15.  పౌరాణిక‌ 17.  కరాళిక‌  19.  దేహిని‌ 20. కుసుమ 22. మలి 23. రన‌‌‌

‌‌నూతన పదసంచిక 31 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

Exit mobile version