Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

న్యాయం ఎవరి పక్షాన

[శ్రీ మరింగంటి శ్రీకాంత్ రచించిన ‘న్యాయం ఎవరి పక్షాన’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

అలసి సొలసిన దేహాలు ఆదమరచి నిద్రిస్తున్నాయి
మెలకువకు ఎంత సమయం పడుతుందో

ఏ రోజుకారోజు ఏకాకిగానైనా, సమూహంగానైనా,
చరించాల్సిందే, చరిత్ర చదవాల్సిందే
నిత్యనూతనత్వానికి ఊపిరులూదాల్సిందే

నేడు నేర్చుకున్న పాఠం, రేపటి గుణపాఠం
తరుగుతున్న విలువల్లో తీరని వేదన
కాలగమనంలో కనుమరుగవుతున్న ఓ తరం

మౌనం మంచిదే కానీ, ప్రశ్న ఎక్కడ ఆగుతుందో
మాటలు రాకపోతే నిజాలు నిజంగానే
అణచబడతాయి
తిరగబడితే తలరాతలు మారతాయేమో
న్యాయం ఎవరి పక్షాన నిలబడుతుందో!

Exit mobile version