Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఓ చెలీ..

[వాణి వేమవరపు గారు రచించిన ‘ఓ చెలీ..’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]

ఓ చెలీ,
నా పిలుపు నీకు అందిందా,
నా మది కబురు నీకు తెలిపిందా,
తెలుప లేని సొదలెన్నో హృదిలో,
నీ దరిన తలుపు తట్టి అవి నిలిచాయా.

అణువణువునా నీవై,
ఘడియ ఘడియకు నీ ధ్యాసై,
కనులకు కునుకన్నది కరువై,
అలసిన నా మది మాట నీకు అందిందా.

నా జీవన బాటకు సహచరి నీవని,
ప్రతి మజిలీ లోనూ తోడుంటావని,
మధురమైన ప్రేమకై నా ఎదురు చూపులు,
ఆర్తిగా పలికిన నా పిలుపు నీకు అందిందా.

ఏ దరిన నీవు నిలిచావో,
నా జతవు నీవని ఎపుడు పలికేవో,
మరుజన్మకైనా ఈ వరముకై సమ్మతి తెలుపవో,
మరి మారు పలకక నేను మౌనమై పోతాను.
ఓ చెలీ, నా పిలుపు ఇప్పుడైనా నీకు అందిందా.

Exit mobile version