[నిక్ పియర్స్ వ్రాసిన ఆంగ్ల కవితకి ‘ఒక సచేతనా స్రవంతి’ పేరిట స్వేచ్ఛానువాదం అందిస్తున్నారు శ్రీ నాగరాజు రామస్వామి.]
అర్థానికి అందని
అవగాహనకు లొంగని
వర్ణించ అలవి కాని దుష్ట ఆలోచన కాటేసిన నిత్య నిశిత వేదన
నా అంతఃచేతనను గుచ్చుకుంటున్నది;
లొంగి పొమ్మంటూ వెంటాడుతున్న
ఊపిరాడ నీయని వాళ్ళ ఆటపట్టించే అవహేళన
నన్ను మగత నిద్రలోకి నెట్టేస్తున్నది.
ఏ తల్లీ సహించ లేని
నీచమైన వాళ్ళ తుంటరి దురాలోచన;
వాళ్ళ తప్పిదాలను నా తలితండ్రులకు అంటగట్టమని ప్రేరణ!
వాళ్ళ పాపపు కోరిక వాళ్ళకే ముబారక్;
సరికొత్త వేకువ ఉదయించు గాక.
నాలో
లొంగని వంగని
నిశ్చయ సంకల్పం నిటారుగా నిలుచు గాక.
ఆ దుష్ట సహవాస ఒత్తిడి లో బతకడం కన్నా
నా తలలో తైతక్కలాడే సైతానులతో ఒంటరిగా బతకడమే నయం.
ఆంగ్ల మూలం: నిక్ పియర్స్.
స్వేచ్ఛానువాదం: నాగరాజు రామస్వామి
