[డా. అయినాపురపు రామలింగేశ్వర రావు గారు రచించిన ‘ఒకటి + ఒకటి = ఒకటి’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము. సంచిక – బెహరా వెంకట సుబ్బారావు ద్వితీయ జాతీయ స్మారక కథల పోటీ 2026లో సాధారణ ప్రచురణకి ఎంపికైన కథ.]
“బ్రేక్‌ఫాస్ట్ రడీ సర్. డైనింగు టేబుల్‌పై రడీ చేసాను. వేడినీళ్ళు రడీ. మాసిన బట్టలు రాజు లాండ్రీకి తీసుకు వెళ్ళాడు. ఇల్లు క్లీనింగ్ అయ్యింది.” ..తన బ్యాగ్ చేతిలో తీసుకుని రడీ అవుతున్న సర్దార్ ను చూసి నాకు అర్థమైంది నేను పర్మిషన్ ఇస్తే వెళ్ళడానికి సర్దార్ రడీగా ఉన్నాడని.
“ఒకే సర్దార్, మరల మధ్యాహ్నం రా. సాయంత్రం ఈ రోజు డిన్నర్ ప్రిపేరు చేయనక్కర లేదు. నాకు మీటింగు ఉంది”.
“ఒకే సార్. మరి మీరు సెలవు ఇస్తే”.. వంగి నమస్కారం చేస్తు నాకేసి చూసాడు సర్దార్.
“నువ్వు వెళ్ళు. కేశవ్, గాలిబ్ ఇక్కడే ఉంటారుగా?”. బెడ్ మీదనుంచి లేచి కూర్చుని నేను సర్దార్‌ను అడిగాను.
“యస్ ఆర్. వాళ్ళు ఇక్కడే ఉంటారు. అన్నీ యరేంజి చేసాను.” సర్దార్ బయటకు వెళ్ళాడు.
నేను టైమ్ చూసాను. ఉదయం 8.45 నిమిషాలు దాటింది. తొమ్మిది కావస్తోంది. ఈరోజు ఆదివారం. శెలవు అవడం మూలాన కొంచం ఆలశ్యంగా లేచాను. లేదంటే ఈపాటికి ఆఫీసుకు రడీ అవ్వవలసి వచ్చేది. పక్క మీద నుంచి లేవగానే కేశవ్ వచ్చి పక్కబట్టలు సర్ధేసాడు. గాలిబ్ నా సేవకు రడీగా ఉన్నాడు. స్నానం చేసానో లేదో ఈలోగానే కేశవ్ బ్రేక్‌ఫాస్ట్ డైనింగ్ టేబుల్‌పై రడీ చేసేసాడు. ప్లేటులో ఉప్మా, పెసరట్టు పెట్టి ప్రక్కకు తప్పుకున్నాడు.
“పల్లీల చట్నీ బాగుంటుందని చేసాను సార్.” చట్నీ వడ్డించాడు.
నాకు ఎదురుగా టిఫిన్ రడీగా ఉన్నా ఏదో ఆలోచనలతో, ఎందుకో తినాలని అనిపించుటలేదు.
“అల్లం చెట్నీ వేయమంటారా?”. ఇంకా టిఫిన్ తినకుండా ఆగిన తనని చూసి అడిగాడు కేశవ్.
“అలా ఉంచు నేను వేసుకుంటా.” ..గ్లాసులో నీళ్ళు పోసి ప్రక్కకు వెళ్ళి నిల్చున్నాడు కేశవ్.
మనసులోని ఆలోచనలు పరుగులు పెడుతుంటే నాకు తెలియకుండానే అరగంట దాటిపోయింది.
“సార్ పెసరట్టు చల్లారినట్లు ఉంది వేడిది తీసుకురమ్మంటారా?”..కేశవ్ మాటలతో ఒక్కసారిగా ఈ లోకంలోకి వచ్చాను.
“యస్ చల్లారింది. వేడిది పట్టుకురా.” నిమిషంలోనే నా ప్లేటులో వేడి వేడి పెసరట్టు వడ్డించాడు కేశవ్.
ఈ రోజు ఎందుకో ఉప్మా పెసరట్టు నాకు ఇష్టమైన బ్రేక్‌ఫాస్ట్ అయినా నేను తృప్తిగా తినలేకోపోయాను. కేశవ్ గమనించాడు.
“సార్ బ్రెడ్ రోస్టు చేయమంటారా?”.
“నాట్ రిక్వైర్డు.”.. ప్లేటులో చేతులు కడిగి బాల్కనీలోకి వెళ్ళాను. అక్కడ గాలిబ్ న్యూస్ పేపర్లు మరియు టీతో రడీగా ఉన్నాడు. కుర్చీలో కూర్చోగానే టీ సర్వచేసి ఎదురుగా న్యూస్ పేపర్లు ఉంచాడు. టీ త్రాగుతూ న్యూస్ పేపర్లు తిరగేసాను. ఎందుకో న్యూస్ పేపర్లలో న్యూస్ వైపు నా ధ్యాస వెళ్ళలేదు. చూస్తుండగానే కప్ లో టీ అయిపోవడంతో టీ గ్లాసు ప్రక్కన పెట్టి లాన్స్ వైపు నడిచాను.
కేశవ్ నాకు నా సెల్ తీసుకువచ్చి అందజేసాడు. సెల్ ఓపెన్ చేసి చూసాను. “గుడ్ మార్నింగ్”.. కావ్య రోజు పెట్టే మెసేజి ఈ రోజు వచ్చింది. ఎందుకో కావ్యకు “గుడ్ మార్నింగ్ హ్యాపిడే”.. అంటు రేజు పంపే మెసేజి ఈరోజు పంపాలని అనిపించలేదు.
రాత్రి మిత్రుడు రాకేష్ ఇంటికి వెళ్ళి వచ్చిన దగ్గరనుంచి నాలో ఏదో తెలియని మానసిక ఆందోళన. ఏదో న్యూనతా భావం, ఏదో వెలితి వెంటాడుతోంది. రాత్రి కూడా సరిగా నిద్రపట్టలేదు. కావ్యకు ఫోను చేసాను. అర్జంటు మీటింగ్‌లో ఉన్నాను. మీటింగ్ అయ్యాకా ఫోను చేస్తానని మేసేజి పెట్టింది. కావ్య ఫోను గురించి చాలా సేపు వెయిట్ చేసాను. ఫోను రాలేదు. కావ్య ఫోను చేద్దామని అనుకున్నా. అక్కడ ఉన్న బిజీ, పని వత్తిడి వల్ల ఫోను చేయలేక పోయి ఉంటుంది. మనసులో అనుకున్నా. ఒక్కో సారి అర్ధరాత్రి టైమ్ దొరికినా నన్ను డిస్ట్రబ్ చేయడం ఎందుకని ఫోను చేయకుండా ఉన్న సందర్భాలు చాలా ఉన్నాయి. అందుకే మౌనంగా ఉండిపోయాను. నిద్రపోవడానికి ట్రై చేసాను.
“ఏమిటి జీవితం?. జీవితం అంతా ఇంతేనా?..,అన్నీ ఉన్నా ఏదో లోటు, సమస్యకు పరిష్కారం?”.. ఆకస్మికంగా వచ్చిన మానసిక ఆందోళన, అలజడి రాత్రి అంతా నిద్ర పట్టనివ్వలేదు. తెల్లవారు ఝామున తెలియకుండానే నెమ్మదిగా నిద్రలో జారుకున్నా.
తెల్లవారు ఝామున కావ్యకు ఫోను చేసాను. రింగ్ అవుతోంది. కాని ఫోను ఎత్తలేదు.
ఆదివారం కదా తను రెస్టు తీసుకుంటూ ఉండి ఉంటుంది. కొంత సేపు సమర్దించుకున్నాను.
రాకేష్‌తో నిన్నగడిపిన క్షణాలు నాకు పదే పదే గుర్తుకు వస్తున్నాయి. మనసులో అలజడిని లేపుతున్నాయి. నాకు తెలియకుండానే అక్కడే లాన్స్ లో బెంచిపై కూర్చుండి పోయాను.
కేశవ్, గాలిబ్‌లు నేను అక్కడ కూర్చుండడం చూసి బంగ్లా లోపలికి వెళ్ళారు. నేను లాన్ నుంచి వచ్చేసరికి బంగ్లాలో నాకోసం చేసే ఏర్పాటుల కోసం వాళ్ళు వెళ్తున్నారని నాకు తెలుసు.
“రఘు యు ఆర్ ఫెరఫెక్ట్, వై డు యు వర్రీ”.. నా అంతరాత్మ నాకు పాజిటివ్ కాషన్ ఇస్తోంది. మూడ్ అవుట్ అయినపుడు నా అంతరాత్మ ఇచ్చే ఇలాంటి సెల్ఫ్ మోటివేషన్లు నాకు చాలా మానసిక బలాన్ని ఇస్తాయి. టైము 9 గంటలు దాటి 30 నిమిషాలు కావస్తోంది. అందుకే మరింత ఆలస్యం చేయకుండా బంగ్లావైపుకు నడిచాను. బంగ్లా బయట నేమ్ బోర్డు చూసాను. “రఘు. ఎమ్, డిప్టీ కలక్టర్. యు ఆర్ డిప్టీ కలక్టర్. మిస్టర్ రఘు. యు ఎఛీవ్డ్.” ..నా అంతరాత్మ నాలోని బలహీనతను పోగొట్టడానికి పాజిటివ్ సజెషన్లును ఇస్తుండడం గమనించాను. “యస్ ఐ ఎచీవ్డ్”. మనసుకు కొంత ఉపశమనం వచ్చినా నిన్న రాకేష్ తో జరిపిన ఆ కలయిక గుర్తుకు వచ్చి నా మనసును చంచలం చేస్తోంది.
నేను బంగ్లా లో ప్రవేశించడంతోనే అక్కడ ఉన్నకేశవ్ గాలీబ్లు లోపలకి వెళ్ళారు.
—000—
రఘు గ్రూఫ్ వన్ సర్వీసులకు సెలక్టు అయ్యి ఆర్.డీ.ఒ గా రిక్రూట్ అయ్యాడు. చాలా సిన్సియర్ మరియు తెలివైనవాడు. జేరిన తక్కువకాలంలోనే మంచి ఆఫీసరుగా పేరు తెచ్చుకున్నాడు. తన కుటుంబంలో గ్రూఫ్ వన్ సర్వీసులో జేరిన మొదటి వ్యక్తి తానే కావడంతో కుటుంబమంతా ఆనందంతో పరవశం చెందింది. అందంతో పాటు మంచి హోదా ఉన్న ఉద్యోగం ఉండడంతో ఎంతో డబ్బు పలుకుబడి ఉన్న సంబంధాలు లైనులు కట్టాయి. కట్నకానుకలతో పాటు కోరినవన్నీ ఇవ్వడానికి సిద్దమైన వాళ్ళు చాలా మందే తమ అల్లుడుగా రఘును స్వీకరించడానికి ముందుకు వచ్చారు. ఆదర్శభావాలు గల రఘు తన పెళ్ళి విషయంలో ఆచీ తూచి అడుగు వేయాలని నిర్ణయించుకున్నాడు. రఘుతో ట్రైనింగ్మేట్సే చాలా మంది తమకు లభించిన హోదాను క్యాష్ చేసుకుని సంఘంలో మంచి పలుకుబడి ఉన్న పెద్దలకు అల్లుళ్ళుగా మారి ఇటు హోదాతో పాటు, పలుకుబడి పొందుతూ తమ పదవులలో పైపైకి సునాయాసంగా ఎదగడం జరిగిపోయింది. రఘు మాత్రం తన పెళ్ళి విషయంలో చాలా దృఢమైన నిర్ణయమే తీసుకున్నాడు. తన బ్యాచ్‌మేట్, బ్యాచ్‌లోనే టాపర్ కావ్యను తన శ్రీమతిగా స్వీకరించాలని నిర్ణయించుకున్నాడు. రఘు లోని ఖచ్చితత్వం, మృదు స్వభావం, ఓపెన్ మైండెడ్నెస్ రఘు ప్రపోసల్కు కావ్య నో చెప్పలేక పోయింది. కావ్యకూడా రఘ లాగే తెలివైన, సిన్సియర్ ఆఫీసరుగా పేరు తెచ్చుకుంది. దానితో తక్కువ టైములోనే ఇద్దరికి ప్రమోషన్లు వరించాయి. రషు డిస్ట్రిక్టు ఆఫీసరు అయితే, కావ్య స్టేట్ ఆఫీసరుగా పదవులను అలంకరించి అందరి మన్ననలను పొందగలిగారు రఘు, కావ్య దంపతులు.
సమాజం దృష్టిలో రఘు కావ్య లది హాఫీ ఫ్యామిలీ. లవ్ లీ ఫ్యామిలి. బ్లెస్డ్ ఫ్యామిలీ.. వాట్ నాట్,
కాని..
అంతరంగంలో ఎక్కడో కొంత వెలితి. ఆ కొంత వెలితి తన మనసును కకలావికలం చేస్తోంది. ఆ వెలితే రఘుకు అప్పుడప్పుడు నిద్ర రానివ్వకుండా చేస్తోంది. రాకేష్‌తో కలసిన నిన్న రాత్రి ఆ వెలితి మరోసారి మనఃశాంతిని రఘుకు దూరం చేసింది.
రాకేష్ చెప్పిన ఆమాటలు రఘు బుర్రలో పదే పదే గుర్తుకు వచ్చి నిద్రలేకుండా చేసాయి.
—000—
రాకేష్ తను ఒకే బ్యాచ్‌కు చెందిన గ్రూప్ వన్ ఆఫీసర్లు. ఇద్దరు ట్రైనింగ్‌లో చాలా సరదాగా ఉండేవారు. ఇద్దరు ఆలోచనలు టేస్టులు ఇంచుమించు ఒకే విధంగా ఉండడంతో వారిద్దరి మద్య తెలియని బంధం ఏర్పడింది. గ్రూప్ వన్ ఆఫీసరుగా సెలక్టు అయిన వెంటనే ఆ ఊరు ఎమ్.ఎల్.ఏ గారి ఒక్కగానొక్క కూతురు శ్రావ్యతో పెళ్ళి అంగరంగ వైభవంగా జరిగిపోయింది. రాకేష్ మావగారికి ప్రభుత్వంలో మంచి పలుకుబడి ఉండడంతో రాకేష్‌కు తనకు నచ్చిన ప్రభుత్వ పోస్టులు సాధించి ఇటు ఉద్యోగంలోను, ముద్దులొలికే ఇద్దరు పిల్లలును కని ఇటు ప్యామిలీ పరంగాను చక్కగా సెటిల్ అయిపోయాడు. రాకేషే కాదు, తన బ్యాచ్‌మేట్స్ చాలా మంది తమ కెరీర్‌ను తమ కుటుంబాన్ని బ్యాలన్స్ చేసుకుని హ్యాపీగా ఉన్నారన్న నిజం ఇటీ వలనే రఘుకు అవగతమైంది.
తాను కావ్య పెళ్ళి అయ్యి సుమరు ఎనిమిది సంవత్సరాలు అయినా క్యారీర్ పరంగా ఎదిగిన, కుటుంబపరంగా ఎదగలేక పోయామన్న వెలితి రఘును బాధ పెడుతోంది. రఘు కావ్య జీవితాలు ఎప్పటికి కలవని, కలవలేని రైలు పట్టాలులాగా సమాంతరంగా గడిచి పోవడం రఘుకు మానసిక ఆందోళనకు కారణం అవుతోంది. మరి పరిష్కారం.
అది అంతుచిక్కని ప్రశ్న.
రాకేష్ ఇంటికి రఘు నిన్న రాకేష్ చిన్న కొడుకు రుత్విక్ పుట్టిన రోజు ఫంక్షన్‌కు ఆహ్వానిస్తే వెళ్ళాడు. చాలా గ్రాండ్‌గా ఫంక్షన్ జరిగింది. తన కేడర్‌కు చెందిన తన జూనియర్స్ చాలా మంది ఫ్యామిలీలతో వచ్చి ఎంజాయి చేసారు. కాని తాను మాత్రం ఒంటరిగా ఫంక్షన్లో గడపడం మరియు అక్కడ ఉన్న వాళ్ళు తన ఫ్యామిలీ గురించి, తనకు లేని పిల్లలు గురించి పదే పదే అడగడం, “ఒంటరిగా ఉన్నారా?”.. అంటూ సానుభూతి చూపించడం తనలో భావోద్వేగాలను పెంచింది. “ఎన్ని ఉన్నా ఫ్యామిలీ హ్యాపీనెస్‌కు మించినది లేదు”.. అంటూ అక్కడ మాట్లాడిన వారి మాటలు రఘులో ఏనాటి నుంచో దాగివున్న మానసిక ఆందోళనలను పెల్లుబికేలా చేసాయి. కేడరును ఉపయోగించుకుని అక్కడ ఉన్న తన స్నేహితులు అందరు నౌకర్లు చాకర్లు సర్వీసులతో హ్యాపీగా తమ జీవితాలను ఎంజాయ్ చేయడం తనలోని లేమిని మరొకసారి గుర్తుకు తెచ్చింది. గతంలో తాను, కావ్య ప్రొఫెషనల్‌గా ఎదగాలని పట్టుదలతో పనిచేసి ఎదగగలిగాము. కాని కుటుంబపరంగా?.. అది మిలియన్ల డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోయింది.
తను జిల్లా అధికారిగా ప్రమోషన్ పొందితే, కావ్య స్టేట్ అధికారిణిగా ప్రమోషన్ పొంది వేరే రాష్ట్రానిక పోస్టింగు వచ్చి దూరమవడం,, ఇద్దరు తమ తమ వృత్తిలో బిజీగా ఉండడం, తమ గురించి తమ పెర్సనల్ లైఫ్ గురించి ఆలోచించే సమయం లేకుండానే ఐదు ఆరు సంవత్సరాలు గడిచిపోయాయి.
పెళ్ళి అయ్యింది, కాని కుటుంబంకు కావలసిన ఆనందం పొందడంలో తను, కావ్య చాలా కోల్పోయామన్న నిజం మా ఇద్దరికి అవగతమైంది. కాని పరిష్యారం దొరికే అవకాశమే లేదు.., అని అనేక సందర్భాలలో మాకు అవగతమైంది.
ఆ రోజు.. రఘుకు తన రెండు సంవత్సరాలు క్రితం జరిగిన సంఘటన గుర్తుకు వచ్చింది.
ఆరోజు నాకు సడన్‌గా కడుపులో భరించరాని నొప్పి వచ్చింది. హాస్పటల్లో డాక్టర్ ఎపండిస్సైటిస్ ఆపరేషన్ అర్జంటుగా చేయాలని చెప్పారు. కావ్యకు ఫోను చేసాను. తాను సాయంత్రానికి బయలుదేరుతానని చెప్పింది. ఆ రోజు అపరేషన్ అయ్యిపోయింది. మర్నాడు కావ్యకోసం ఎదురు చూసాను. రాలేదు. ఉదయం పదకొండు గంటలకు కావ్య నుంచి ఫోను వచ్చింది. మినిష్టర్ల మీటింగ్ ఉండడంతో రాలేక పోయాను. ప్లీజ్ అండర్ స్టాండ్ అని చెప్పి ఫోను పెట్టేసింది. బంగ్లాలో ఉన్న నౌకర్లు, స్నేహితులు సహాయంతో గండం నుంచి బయటపడ్డాను. కావ్య దగ్గర ఉంటే చాలా ధైర్యం వచ్చేది అని చాలా సార్లు అనుకున్నా. కాని కావ్య రావాలని అనుకున్నా రాలేని పరిస్ధితి. కావ్యను అర్థం చేసుకున్నా. ఆ తరువాత వచ్చి ఒకరోజు వచ్చి చూసి వెళ్ళి పోయింది. మరల నా ఒంటరి జీవితం నాదే.
అలా అనేక సందర్భాలు మేము చాలా ముఖ్యమైన ఫంక్షన్లు మిస్ అవడం జరిగిపోయింది. చాలా సార్లు ఇద్దరు ఒకరిపై ఒకరు కోప్పడిన సందర్బాలు చాలా ఉన్నాయి. కాని పరిష్యారం ఆలోచించిన, సమాధానం అందుబాటులోకి రాలేదు.
కొన్ని సందర్బాలలో నేను గాని, కావ్యగాని జాబ్‌కు రిజైన్ చేద్దామని ప్రపోజల్ పెడదామని మనసులో వచ్చింది. కాని కావ్య గురించి తెలిసి మనసులోనే ఆ ఆలోచనను పాతి పెట్టి ఉంచేసా. రోజులు గడుస్తున్న కొలది ఈ మద్య ఒంటరితనం నాకు బాధను కలుగజేస్తోంది. కావ్యతో చర్చించి ఈ విషయంలో తన అభిప్రాయాన్ని తెలుసుకుందామని చాలా సార్లు ప్రయత్నించా. కాని సఫలీకృతం కాలేకపోయాను. తన ఉద్యోగం, తన పని ఉన్న సిన్సియారిటి పెర్సనల్ లైఫ్‌పై లేకపోవడం నాలోని బాధను పెంచడానికి కారణమయ్యింది. తనని నేను పూర్తిగా అర్థం చేసుకున్నానో లేదో, నాకే అర్థం కాని పరిస్ధితిలోకి నేను గెంటబడిపోయాను.
ఎందుకో ఈ మద్య నా ఒంటరితనం, నా జీవన శైలి నాలో తరచు ఆందోళనలను రేకిస్తున్నాయి. “ఇంతేనా జీవితం. నా జీవితంలో ఆనందం ఎండమావేనా?.. ఇలా ఎన్ని రోజులు?”.. ఇలా పిచ్చి పిచ్చి ఆలోచనలు నాకు రాత్రి నిద్రలేకుండా చేస్తున్నాయి. ఉద్యోగంలో బిజీగా ఉన్నా అఫ్పుడప్పడు మనసులో వస్తున్న ఈ అలోచనలు నా మనసును ఆందోళనకు గురిచేస్తున్నాయి.
నిన్న రాకేష్ ఇంటిలో జరిగిన ఫంక్షన్ నాలో గూడు కట్టిన బాధను ఒక్క సారిగా మేల్కొలిపింది. అర్జంటుగా మాట్లాడాలి అని కావ్యకు ఫోను చేసాను. కావ్య వెంటనే ఫోను చేసింది. లక్కీ గా నేను ఫోను చేసినప్పుడు కొంత లీజర్‌గా ఉంది కావ్యకు.
కావ్యతో మనసు విప్పి మాట్లాడాను.
కావ్య చెప్పిన మాటలు విని నాకు ఆశ్చర్యమేసింది.
“రఘు! నేను ఈమదధ్య ఒంటరితనాన్ని ఫీలవుతున్నా. ఇద్దరు మనం అనుకున్నట్లుగా మన ఫ్రొఫెషన్లులో కావలసిన లక్ష్యాలును చేరుకున్నాం. కాని మన పెర్సనల్ లైఫ్‌లో సాధించవలసినది చాలా ఉంది. నా దృష్టిలో సాధించినది చాలా తక్కువే. ఆవిషయం నీతో కూలంకషంగా చర్చించాలని నేనే ఫోను చేద్దామనుకున్నా. నువ్వే చేసావు. రియల్లీ సర్ ప్రయిజింగ్.”
కావ్య మాటలు రఘులో ఆనందాన్ని రెట్చింపు చేసాయి. తనకు ఇష్టమైన విషయమే కావ్య మట్లాడుతోంది.
కావ్య చెబుతున్నది చాలా ఆతృతగా వింటున్నాడు రఘు.
“మనం రిలాక్స్ అవడానికి మనాలిలో టూర్ ప్లాన్ చేసాను. పది రోజులు మన ఫ్రొఫెషన్ల నుంచి దూరంగా ప్రశాంతంగా గడుపుదాం. మన భవిష్యత్‌ను గురించి చక్కటి ప్లాను చేసుకుందాం. మనం ఇద్దరం పెళ్ళి చేసుకున్నది ఒకటి కావడానికి, ఐ నో. బట్. మన ఉద్యోగం, కర్తవ్యాన్ని మనం నెరవేర్చాలికదా. యస్ వుయ్ హావ్ డన్ హన్డ్రెడ్ పర్సంటు జస్టిస్ టు అవర్ జాబ్. ఇప్పుడు మన భవిష్యత్ జీవితాన్ని చక్కగా ప్లాన్ చేసుకుందాం. ఉయి ఆర్ మీటింగ్ నెక్స్ట్ సండే ఎట్ మనాలి. సీయు రఘు.” కావ్య నోటినుంచి వచ్చిన ఆ మాటలు మూటలు రఘును తబ్బిబ్బు చేసాయి.
“యస్ కావ్య ఈజ్ కావ్య.” కావ్య తియ్యటి మాటలుతో రఘు రాత్రి తనకు తెలియకుండానే నిద్రలోకి జారుకున్నాడు.
—000—
మనాలి లోని స్టార్ హుటల్లో కావ్య రఘు కలసి మధురమైన క్షణాలు గడిపారు. పదవరోజు వచ్చింది. ఇద్దరు కలయిక జీవిత పరమార్థాన్ని వారికి తెలియజేసింది. వారిద్దరు చర్చించి తమ భవిష్యత్ గురించి పటిష్టమైన రోడ్ మ్యాప్ ఏర్పాటు చేసుకున్నారు. ఇద్దరిలోను ఏదో తెలియని ఆనందం. ఏదో తెలియని అనుభూతి. మంచి నిర్ణయం తీసుకున్నామన్న తృప్తి.
ఇద్దరు కలసి సంవత్సరమంతా ఎంత బిజీగా ఉన్న సంవత్సరంలో నాలుగు సార్లు అయినా అవుటుంగ్ కు వెళ్ళాలి, కనీసం రెండు ఫ్యామిలీ ఫంక్షన్లుకైనా టైం ఇవ్వాలి., ఇద్దరికి అనువుగ ఉండే ప్లేసులో మంచి సౌకర్యాలుతో కూడిన స్వంత ఇల్లు ప్లాను చేసుకోవాలి, ప్యామిలీ గ్రోత్ కై తీసుకోవలసిన నిర్ణయాలు.1,2,3.. ఇలా చాలా విషయాలుపై అవగాహనలు, నిర్ణయాలు ఆ పదిరోజులలో జరిగిపోయాయి.
వాళ్ళు మనాలి వీడే రోజు రానే వచ్చింది.
కాని వాళ్ళ మధ్య ఇప్పుడు నూతన ఉత్సాహం, పటిష్ఠమైన బంధం, ఆనందంతో పాటు తెలియని అనుబంధం తొంగి చూస్తోంది.
‘ఒకటి + ఒకటి = ఒకటి’.. అర్థం వాళ్ళకు అవగతమైంది.
జీవితంలో ఎదురయ్యే సమస్యలు సమాజంలో అందరికి ఒకటే అయినా.., చదువుకున్న, సంస్కారం ఉన్న వాళ్ళు, పోజిటివ్ మైండ్ తో ఆలోచించేవాళ్ళు.., మంచి పెద్ద పొజిషన్లో ఉండి తమ భాధ్యతలను, విధులను చక్కగా నిర్వర్తించేవాళ్ళు, వాళ్ళు తీసుకునే నిర్ణయాలు, సమాధానాలు కచ్చితంగా వారి హుందాను, వాళ్ళ విశాలమైన దృక్పథాన్ని తెలియజేస్తాయి. ఆ నిర్ణయాలు అందరికి ఆదర్శమవుతాయి.
“ప్రకృతి కూడా వాళ్ళ నిర్ణయాలకు ఆశీర్వాదం ఇస్తాయా?”.. అన్నట్టుగా.., మనాలి లోని చల్లాటి వాతావరణం, వీస్తున్న గాలులు ఆనందంతో వాళ్ళకు సెండాఫ్ ఇచ్చాయి.
