Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఒక్కడిగా..

[శ్రీ చందలూరి నారాయణరావు రచించిన ‘ఒక్కడిగా..’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

ఒక్కడిగా
ఉన్నపుడే కలిగే ఆకలికి
ఓ బస్తా మాటలవసరం

ఒక్కడినే
పోరాడే వేళల్లో
నీ ఊరట గొప్ప ఆయుధం

ఒక్కడిగా
మిగిలి చేసే ప్రయాణంలో
నీతో మౌనం సందడి

ఒక్కడిగా
పోట్లాడే ఒత్తిడిలో
నీ జ్ఞాపకం ఉపశమనం

ఒక్కడిగా
తప్పిపోయిన బాధలో
ఎదురైన నీ ఊహ అభయం.

ఒక్కడిగా
చనిపోయే క్షణంలో
నీ చిరునవ్వే ఊపిరి.

Exit mobile version