Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఆన్‌లైన్ ఆర్డర్

[శిరీష పద్మ యర్రంశెట్టి గారు రచించిన ‘ఆన్‌లైన్ ఆర్డర్’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]

ఆన్‌లైన్ ఆర్డర్
పొట్ట నింపుతుందా
లేదా
ఓర్పు పెంచుతుందా..?

డెలివరీ బాయ్
మ్యాప్‌లో దగ్గరే
పొట్టలో
ఆకలి మాత్రం దూరం

‘పది నిమిషాలు’
అన్న నోటిఫికేషన్
గంటలు గడిచినా
కాలం కదలదు

ఆన్‌లైన్ భోజనం
రుచిగా ఉంటుంది
కానీ
వేచి ఉండటం నరకం

హోటల్ దూరం
రెండు కిలోమీటర్లు
డెలివరీ టైం
రెండు యుగాలు

డిస్కౌంట్ చూసి
ఆర్డర్ పెట్టా
బిల్ వచ్చేసరికి
బుద్ధి వచ్చింది

ఆకలి ఎక్కువ
యాప్ స్లోగా
దేవుడికన్నా
డెలివరీ దేవుడే పెద్ద

‘Out for delivery’
అని మెసేజ్
మన ఆశలే
హోమ్ డెలివరీ

రేటింగ్ అడుగుతాడు
డెలివరీ అయిపోగానే
ఆకలి అడిగింది
ఇంతసేపు ఎక్కడ?

చేతిలో ఫోన్
పొట్టలో ఆకలి
మధ్యలో
ఆన్‌లైన్ డెలివరీ

Exit mobile version