
ప్రపంచ చరిత్ర గురించి ఏదైనా పుస్తకం దొరుకుతుందని Bookstore కి వెళ్లిన నాకు – ఒక పుస్తకం యొక్క cover page, ఆ పుస్తకం యొక్క Title నన్నెంతో ఆకర్షించింది. అది ‘కల్లోల భారతదేశం (క్రీ.శ 622 నుంచి 1947 వరకు)’.
ది 18 అక్టోబర్ 2025నాడు హైదరాబాద్ హోటల్ మారియట్‍లో జరిగిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ప్రసంగిస్తున్న కోవెల సంతోష్ కుమార్
భారతదేశం యొక్క సంస్కృతి, జీవన విధానం, చరిత్ర, ప్రతి ప్రజల జీవితాలు ఒక వెయ్యి సంవత్సరాలు ఒక మతం యొక్క పైశాచికత్వానికి ఎలా బలయ్యాయో చాలా పాలకుల యొక్క బాధ్యతా రాహిత్యం చాలా వివరంగా, వివరణాత్మకంగా రచయిత వివరించారు. ప్రతి ఒక్కరూ ఈ పుస్తకం చదివి చరిత్ర దాని తాలూకు సంఘటనలు పూర్తిగా అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది.
హోటల్ మారియట్ ప్రాంగణంలో కల్లోల భారతం పుస్తకం mock-up
ముస్లిం దండయాత్రలు, పర్యవసానాలు, వారి పాలకుల సహజ స్వభావాలు, వారి పాలన వల్ల భారత దేశం ప్రభావితం అయిన తీరు చాలా అద్భుతంగా రచయిత వివరించారు. నాకు ముస్లిం పాలకుల పరిపాలనా కాలం గురించి ఉన్న చాలా సందేహాలకు సమాధానం ఈ పుస్తకం ద్వారా దొరికింది. చిరిగిన చొక్కా అయినా తొడుక్కో కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో అనే వీరేశలింగం గారి మాటలు అక్షరాల సత్యం అనేది ఇలాంటి పుస్తకాలు చదవడం ద్వారా అర్థమవుతుంది.
ఈ ఈ పుస్తకం చదివిన వెంటనే రచయిత కోవెల సంతోష్ కుమార్ గారికి ఫోన్ చేసి నాకు కలిగిన అనుభూతిని వారితో పంచుకొన్నాను. వారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
***
రచన: కోవెల సంతోష్ కుమార్
ప్రచురణ: సాహితీ ప్రచురణలు, విజయవాడ
పేజీలు: 368
వెల: ₹ 275/-
ప్రతులకు:
నవోదయ బుక్ హౌస్, కాచీగుడా, హైదరాబాద్. ఫోన్ 9000413413
అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు
రచయిత: 9052116463, 7396116463
ఆన్‍లైన్‌లో:
https://www.amazon.in/dp/B0FRXNJ63V
