[శ్రీ రేడియమ్ రచించిన ‘పాపం శాపం’ అనే కవితని అందిస్తున్నాము.]
వాన పాయరా
ఎల్ నినో రాకాసి రా
మబ్బులను మింగెరా
సాగు ఎట్లరా
పల్లెల్లో కరువు
నీడలురా..
చెట్లు నరికినావు
గట్లు తవ్వినావు
కర్బనం నింపినావు
నీళ్లు మురికి చేసావు
నీ ధ్వంస రచన
నీ కల్తీ తంతు రచన..
నేచర్‌ను పురుగులా చూసావు
బతుకు వనరులను చితుకు చేసావు
నీలో మార్పు ఓర్పు వస్తుశీలత
ప్రకృతి ఇస్తుంది రుతుధర్మత
గ్రహించు పరమార్థపు క్రియాశీలత
