‘సంచిక’ వెబ్ పత్రికలో మరో గళ్ళనుడికట్టుకు స్వాగతం.
సిహెచ్.వి. బృందావనరావు గారు ‘పద శారద’ అనే గళ్ళనుడికట్టు రెండు వారాలకి ఒకసారి నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
| 1) గ్రామ సరిహద్దు (4) |
| 3) వికృతమైన విజ్ఞాపనం (3) |
| 5) చంద్రుడు (4) |
| 7) కురూపి నామ సంవత్సరం (3) |
| 9) చీర చెంగు (3) |
| 11) రక్షణ, కావలి (3) |
| 15) ప్రత్యయం కోల్పోయిన ఆమని (3) |
| 17) పరదా, తెర (4) |
| 19) ఆడ గుర్రము (3) |
| 20) కుండలాకారము (4) |
| 21) అతి నెమ్మది నడక, ఆఖరక్షరం లేకున్నా అర్థం మారదు (4) |
| 22) రాముని రెండు సార్లు రారమ్మని పిలవండి (4) |
| 23) వక్క చెట్టు (4) |
| 26) గుర్రములు (4) |
| 28) సూర్యుడు (3) |
| 29) తమిళనాట బాణాసంచా తయారు చేసే ఊరు (4) |
| 33) మయసభలో ధర్మజుడు చేసిన యాగం (4) |
| 36) విరిదండ ఆ వైపు నుంచి వేయండి (4) |
| 38) చెదరిన మేఘము (4) |
| 39) హర్మ్యములు (4) |
| 40) తోక (3) |
| 41) పిల్లా జల్లా (4) |
| 43) తగరం తడబడింది (3) |
| 46) జంతిక చెదిరింది (3) |
| 47) రెప్పపాటు సేపు మాత్రమే ఉండునది (3) |
| 49) చెలిమి! తెలంగాణా పలుకుబడి (3) |
| 51) ఒక అచ్చర లేమ (4) |
| 52) ఆధారకుడ్యం. మూల బంధము (3) |
| 53) తుమ్మెద (4) |
నిలువు:
| 1) పటోలిక (4) |
| 2) 28 అడ్డమే (2) |
| 3) ఆవిరిలో పూవు (2) |
| 4) ధోవతి (2) |
| 5) బదరి (2) |
| 6) హల్లులను అచ్చులతో కలిపి చెప్పుట (4) |
| 8) కలకత్తా దేవత (2) |
| 10) కాపు; తావీదు (2) |
| 12) గాలి (4) |
| 13) తెల్లని వెంట్రుకలు, గొరిజ, తోక గల గుర్రము – తడబడినది (4) |
| 14) అప్పడం తోడిది (5) |
| 15) ఆఖరక్షరం పోయిన మన్మథుడు (4) |
| 16) హింసాదులను విరమించి, ఓరిమితో నుండుట ( 4) |
| 18) చూడము (3) |
| 20) సింహచలంలో – – – నరసింహుడు (3) |
| 23) రక్కసుడు. పలలాశి గదా (3) |
| 24) అప్పిచ్చు వాడితో, ఇతడు కూడా ఊళ్లో ఉండాలట (3) |
| 25) వెలయాలు (3) |
| 27) మహిషం (3) |
| 30) జాలంతో మొదలయ్యే మన్మథ వ్యథ (4) |
| 31) తొందరగా కోరిక తీర్చుకుందామనుకొనుట (4) |
| 32) పాషాణాలు (3) |
| 33) రజోగుణ స్వభావము (3) |
| 34) సరిగ (4) |
| 35) సంహరించుట (4) |
| 37) ఆంధ్ర శాకం (3) |
| 39) ఉత్తర రామాయణ కృతి కర్త(4) |
| 42) అరవిరి మొగ్గ (4) |
| 44) కైశికము, జడ (2) |
| 45) కిష్కింధ దగ్గరి సరోవరం (2) |
| 47) ఓరిమి, ఇది కవచం లాంటిది అన్నాడు ఏనుగు లక్ష్మణ కవి (2) |
| 48) దుర్వాసన (2) |
| 49) గంప, కర్రతో ఇండ్ల వద్దకు వచ్చి గ్రామీణ స్త్రీ చెప్పే భవిష్యవాణి (2) |
| 50) నూరు యోజనాల నిడివిగల చేప (2) |
ఈ ప్రహేళికని పూరించి 2025 మార్చ్ 11వ తేదీ లోపు puzzlesanchika@gmail.com కు సమాధానాలను మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్లో ‘పద శారద-24 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసిన వారి పేర్లు 2025 మార్చ్ 16 తేదీన వెలువడతాయి.
పద శారద-23 జవాబులు
అడ్డం:
1) మినువాక 3) తాటాకు 5) జాతిపిత 7) లఘువు 9) క్షిప్రము 11) యమహా 15) రోజువా 17) ముసలాడు 19) కందుకం 20) మేజువాణి 21) కహలము 22) ఒనకూడు 23) కములంక 26) కలియుగం 28) నిలయం 29) రిషభము 33) బుధవారం 36) డాయంజని 38) ఠుడుర్మక 39) కనకన 40) పాతఱ 41) తజులురా 43) వానరం 46) రాజాజీ 47) గాడుపు 49) గాలిబు 51) పులిపంజా 52) రిపువు 53) సరంజామా
నిలువు:
1) మిరియము 2) కల 3) తావు 4) కుక్షి 5) జాము 6) తరవాణి 8) ఘుటం 10) ప్రభ 12) మసకము 13) హాలాహలం 14) నందుడు 15) రోజుకూలి 16) జువాడుయు 18) డులక 20) మేనక 23) కస్తూరి 24) మనిలా 25) నియంత 27) గండీరం 30) షడానన 31) భయంకరం 32) ముజన 33) బుడుత 34) ధర్మజురా 35) వాకలుజా 37) మాతలి 39) కవాటపు 42) రాజీనామా 44) జోడు 45) వాలి 47) గాజా 48) పురి 49) గావు 50) బుస
పద శారద–23 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అనూరాధసాయి జొన్నలగడ్డ, హైదరాబాద్
- భద్రిరాజు ఇందుశేఖర్, హైదరాబాద్
- ద్రోణంరాజు వెంకట మోహన రావు
- ద్రోణంరాజు వెంకట నరసింహా రావు
- కర్రి ఝాన్సీ, హైదరాబాదు
- మధుసూదనరావు తల్లాప్రగడ, బెంగుళూరు
- మంజులదత్త కె, ఆదోని
- పి. వి. రాజు, హైదరాబాదు
- రంగావఝల శారద, హైదరాబాద్
- రామకూరు నాగేశ్వరరావు, శ్రీకాకుళం
- రామలింగయ్య టి, తెనాలి
- రామవరపు గిరిజాశంకర రావు, బెంగుళూరు
- రాయపెద్ది అప్పా శేష శాస్త్రి, ఆదోని
- శంభర వెంకట రామ జోగారావు, బెంగుళూరు/ముంబయి/టెక్సాస్
- శిష్ట్లా అనిత, బెంగుళూరు
- శ్రీనివాసరావు సొంసాళె, ఎమ్మిగనూరు
- ఉషారాణి జి
వీరికి అభినందనలు. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.
గమనిక:
- ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
- ఈ పద ప్రహేళికలో అడ్డం, నిలువు ఆధారాలతో ఏవైనా సందేహాలు కలిగితే నిర్వాహకులు సిహెచ్.వి. బృందావనరావు గారిని 9963399189 నెంబరులో, chvbraossp@gmail.com లో గాని సంప్రదించగలరు.
- గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
శ్రీ సిహెచ్.వి. బృందావనరావు తపాలా శాఖలో సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టాఫీసెస్గా పని చేసి పదవీ విరమణ చేశారు. వీరి ప్రస్తుత నివాసం నెల్లూరు.
వీరికి సాహిత్యం మీద ఎంతో అభిరుచి ఉంది. రెండు కథా సంపుటాలు, రెండు కవితా సంపుటాలూ, ఒక ఖండకావ్యమూ, ఒక నానీల కవితాసంపుటీ వెలువరించారు. ఇటీవలే వాల్మీకి రామాయణం లోని సుందరకాండకు 1500 పద్యాల – మూల విధేయ మైన అనువాదాన్ని ప్రచురించారు. గడినుడి పూరణలంటే ఉన్న అభిరుచి కారణం దాదాపు అరవై ఏళ్ళ నించే వివిధ పత్రికల్లోని గడినుడులను పూరణ చేస్తూనే ఉన్నారు.
సంచిక వారు సంకలించి, ప్రచురించిన ‘రామకథాసుధ’ సంకలనంలో వీరి కథ ‘కౌగిలి’ కూడా ఉన్నది. వీరిని 9963399189 అనే నెంబరులో సంప్రదించవచ్చు.

