‘సంచిక’ వెబ్ పత్రికలో మరో గళ్ళనుడికట్టుకు స్వాగతం.
సిహెచ్.వి. బృందావనరావు గారు ‘పద శారద’ అనే గళ్ళనుడికట్టు రెండు వారాలకి ఒకసారి నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
| 1) కుబేరుని వనము (5) |
| 5) వాడుకలో దేవాలయ ముఖగోపురం (5) |
| 9) రుద్రుని కార్యము (3) |
| 10) మాట (3) |
| 12) అట్నుంచి చూస్తే గుర్తులు కన్పిస్తాయి. (3) |
| 13) ఇంటి మధ్య లోపం (2) |
| 16) ఆకాశం, ఆఖరి అక్షరం కోల్పోయిన కాంతి (2) |
| 17) సీతమ్మవారు, భూపుత్రి గదా (3) |
| 18) కొండెంగ (3) |
| 19) అట్నుంచి కొండ సేద్యం (2) |
| 22) రొయ్యకు మాత్రం ఉండదా ఏం? (2) |
| 23) స్వాతంత్య్ర పోరాటంలో ప్రముఖ పాత్ర వహించిన నేత పరికరం (2) |
| 24) పార్వతీ దేవి (3) |
| 25) మహమ్మదీయుల పూజారి (2) |
| 26) వాలు, వీలు (2) |
| 29) సమానం (2) |
| 31) అనుమానం, కొంతమేను (3) |
| 32) 17 అడ్డమే (3) |
| 33) కొయ్య ముక్క (2) |
| 36) పాతకాలపు కొలమానం (2) |
| 37) అడ్డదిడ్డంగా పోతున్న గుర్రము (3) |
| 39) మద్యము (3) |
| 41) వెనక్కొస్తున్న పిపీలికాలు (3) |
| 42) వృద్ధ పితామహుడు (5) |
| 43) ఉదా. త్రిష, రశ్మిక, మొ॥ (5) |
నిలువు:
| 1) చాకలివాడు (5) |
| 2) మూటి సముదాయము (3) |
| 3) సీమ మద్యం చివర తేలిపోయింది (2) |
| 4) ఇంతకు ముందు (2) |
| 5) బలి (2) |
| 6) లక్ష్యం (అన్యదేశ్యం) (2) |
| 7) 17 అడ్డం జనయిత్రి (3) |
| 8) ముస్లింల ఉపవాసపు నెల (5) |
| 11) రాలిపడు (2) |
| 14) క్షాంతి, సహనము (3) |
| 15) ఈమె 7 నిలువు కూతురు (3) |
| 20) ఆరాటం లాంటి తగాదా (3) |
| 21) మిష, వంక (3) |
| 22) కర్మ బ్రహ్మ ప్రతి కర్మబ్రహ్మ ప్రతిపాదక శాస్త్రం (3) |
| 26) ఒక యాగ విశేషము (5) |
| 27) 32 అడ్డమే (3) |
| 28) ప్రఖ్యాతి (3) |
| 30) ప్రిస్క్రిప్షన్ కాగితం (5) |
| 34) సమానుడే, పాపం తలక్రిందైనాడు (3) |
| 35) 39 అడ్డం దొరకు చోటు (2) |
| 36) ఉత్తర హరివంశ కర్త (3) |
| 38) బలరాముడు (2) |
| 39) కర్రు కాల్చి పెట్టేది (2) |
| 40) ఈ ధాతువుకు అర్థం చుంబనం (2) |
| 41) అన్ని వస్తువులూ దొరికే చోటు, తిరగబడింది (2) |
ఈ ప్రహేళికని పూరించి 2025 ఆగస్టు 12వ తేదీ లోపు puzzlesanchika@gmail.com కు సమాధానాలను మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పద శారద–35 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసిన వారి పేర్లు 2025 ఆగస్టు 17 తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.
పద శారద-34 జవాబులు
అడ్డం:
1) పరిపాలన 5) ఏలికసాని 9) రవళి 10) లిఖితం 12) రిమగ 13) వట 16) ముని 17) వప్రము 18) సన్నాయి 19) ముపా 22)పేలు 23) దుడ్డు 24) నిశాంతం 25) శూలి 26) మేక 29) కపి 31) చక్రము 32) గ్రాహ్యము 33) నార 36) పారా 37) దవయా 39) సోయగం 41) అతివ 42) ముడిసరుకు 43) డమరుకము
నిలువు:
1) పరవశము 2) రివట 3) పాళి 4) నలి 5) ఏతం 6) కరి 7) సామము 8) నిగనిగలు 11) ఖిల్జీ 14) కప్రము 15) విన్నాణం 20) పాదుక 21) ప్రశాంతి 22) పేలిక 26) మేఘనాదము 27) వక్రము 28) లేహ్యము 30) పికరావము 34) రవడి 35) చాయ 36) పాతిక 38) యాస 39) సోకు 40) గండ 41) అరు
పద శారద-34 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అరుణరేఖ ముదిగొండ, హైదరాబాద్
- భద్రిరాజు ఇందుశేఖర్, హైదరాబాద్
- భాగవతుల కృష్ణారావు, సికింద్రాబాద్
- ద్రోణంరాజు వెంకట మోహన రావు, హైదరాబాద్
- ద్రోణంరాజు వెంకట నరసింహా రావు
- కంభం చంద్ర శేఖర్, హైదరాబాద్
- కాళీపట్నపు శారద, హైదరాబాద్
- మధుసూదనరావు తల్లాప్రగడ, బెంగుళూరు
- మంజులదత్తా కె., ఆదోని
- పి. వి. రాజు, హైదరాబాదు
- రంగావజ్ఝల శారద, హైదరాబాద్
- రామకూరు నాగేశ్వరరావు, శ్రీకాకుళం
- రామలింగయ్య టి, తెనాలి
- రామవరపు గిరిజాశంకర రావు, పూణె
- రాయపెద్ది అప్పా శేష శాస్త్రి, ఆదోని
- శంభర వెంకట రామ జోగారావు, బెంగుళురు/ముంబయి/టెక్సాస్
- శిష్ట్లా అనిత, బెంగుళూరు
- శ్రీనివాసరావు సొంసాళె, ఎమ్మిగనూరు
- ఉషారాణి జి. తిరుపతి
- వర్ధని మాదిరాజు, హైదరాబాద్
వీరికి అభినందనలు.
గమనిక:
- ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
- ఈ పద ప్రహేళికలో అడ్డం, నిలువు ఆధారాలతో ఏవైనా సందేహాలు కలిగితే నిర్వాహకులు సిహెచ్.వి. బృందావనరావు గారిని 9963399189 నెంబరులో, chvbraossp@gmail.com లో గాని సంప్రదించగలరు.
- గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
శ్రీ సిహెచ్.వి. బృందావనరావు తపాలా శాఖలో సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టాఫీసెస్గా పని చేసి పదవీ విరమణ చేశారు. వీరి ప్రస్తుత నివాసం నెల్లూరు.
వీరికి సాహిత్యం మీద ఎంతో అభిరుచి ఉంది. రెండు కథా సంపుటాలు, రెండు కవితా సంపుటాలూ, ఒక ఖండకావ్యమూ, ఒక నానీల కవితాసంపుటీ వెలువరించారు. ఇటీవలే వాల్మీకి రామాయణం లోని సుందరకాండకు 1500 పద్యాల – మూల విధేయ మైన అనువాదాన్ని ప్రచురించారు. గడినుడి పూరణలంటే ఉన్న అభిరుచి కారణం దాదాపు అరవై ఏళ్ళ నించే వివిధ పత్రికల్లోని గడినుడులను పూరణ చేస్తూనే ఉన్నారు.
సంచిక వారు సంకలించి, ప్రచురించిన ‘రామకథాసుధ’ సంకలనంలో వీరి కథ ‘కౌగిలి’ కూడా ఉన్నది. వీరిని 9963399189 అనే నెంబరులో సంప్రదించవచ్చు.

