‘సంచిక’ వెబ్ పత్రికలో మరో గళ్ళనుడికట్టుకు స్వాగతం.
సిహెచ్.వి. బృందావనరావు గారు ‘పద శారద’ అనే గళ్ళనుడికట్టు రెండు వారాలకి ఒకసారి నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
| 1) కాకతీయ చక్రవర్తి గణపతి దేవుని ప్రధానమంత్రి (5) |
| 5) ఒప్పంద పత్రము (5) |
| 9) వైశ్య సోదరుల కులదేవత (3) |
| 10) ధనము (3) |
| 12) పెండ్లిలో వధూవరులకిచ్చెడి వస్త్రము. 2వ అక్షరం లోపించింది (3) |
| 13) చిన్నయ సూరి వ్రాసిన చంద్రిక (2) |
| 16) వెనుదిరిగిన శ్యేనము (2) |
| 17) సముద్భవము (3) |
| 18) కోశాగారము(2) |
| 19) నూవులు ఏకవచనం (2) |
| 22) కొండసాగు (2) |
| 23) గొడ్రాలు (2) |
| 24) అచ్చొత్తించుట (3) |
| 25) నమ్మి (2) |
| 26) కావి రంగు; పద్యమునకు గాని పాటను గాని తీయు ఆలాపన (2) |
| 29) అటు నుంచి గ్రామము యొక్క (2) |
| 31) నీచము, ఏవ (3) |
| 32) ఏడవ స్వరం (3) |
| 33) పూర్వకాలపు నాణెం అట్నుంచి. ఇవి రూపాయకు పదహారు (2) |
| 36) ఇలాంటి ‘నాచి’ లుంటారు (2) |
| 37) ప్రత్యయం లేని బుద్ధదేవుడు (3) |
| 39) హిమాలయం(3) |
| 41) కృష్ణుడు గోపికలతో చేసినది (3) |
| 42) కైలాసం; వెండి కొండ (5) |
| 43) కర్ణాటకలో వీరశైవ ప్రవక్త, ప్రత్యయం లోపించింది (5) |
నిలువు:
| 1) పార్వతీనాధుడైన రుద్రుడే (5) |
| 2) ఉండుటకు వీలైన చోటు (3) |
| 3) దేవుడు కాడు (2) |
| 4) కింది నుంచి వస్తే మాత్రం దీనికి మీసాలుండవా (1) |
| 5) ఆకాశం (2) |
| 6) వాలి మరదలు, అంగదుని పినతల్లి (2) |
| 7) నా శత్రుత్వం (3) |
| 8) ఈ బాల ముని కుమారుని కోసం యముడిని శిక్షించాడు ఈశ్వరుడు (5) |
| 11) తలక్రిందులైన రిక్క (2) |
| 14) నర్తన, నర్తకి (3) |
| 15) నది (3) |
| 20) తాంబూలంలోకి ఏలకకాయతో పాటు ఇదీ ఉంటే బాగుంటుంది (3) |
| 21) పయోధి (3) |
| 22) మహేష్ బాబు బ్లాక్ బస్టర్ సినిమా (3) |
| 26) లంకేశ్వర (5) |
| 27) కళ్ళకు కనిపించే ఈ చరాచర ప్రపంచం వికృతి కాదు గదా (3) |
| 28) పారా కాసే వాడి స్లోగన్ (3) |
| 30) ఒక భాస నాటకం, అక్షరాలు తారుమారు (5) |
| 34) పార్వతీదేవి (3) |
| 35) జమాఖర్చుల లెక్క రాత (2) |
| 36) గాలి క్రింద నుంచి వీస్తున్నది (3) |
| 38) పైకెక్కుతున్న పితామహుడు (2) |
| 39) స్త్రీలకైనా, పురుషులకైనా ఉండాల్సిన సుస్వభావము (2) |
| 40) హిమాలయాల్లోని నారాయణ క్షేత్రం, తలక్రిందులయింది (2) |
| 41) రాగమయీ _ _ పాట కొనసాగింపు, మల్లాది వారి అమర గీతం (2) |
ఈ ప్రహేళికని పూరించి 2025 డిసెంబర్ 16వ తేదీ లోపు puzzlesanchika@gmail.com కు సమాధానాలను మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్లో ‘పద శారద-44 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసిన వారి పేర్లు 2025 డిసెంబర్ 21వ తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.
పద శారద-43 జవాబులు
అడ్డం:
1) అస్మదీయులు 5) సరీసృపము 9) నరవ 10) లిఖితం 12) ష్టిమిస 13) వణ 16) టలి 17) అదృష్టం 18) వైద్యము 19) తంతు 22) పేడు 23) రంకు 24) ఓర్వమి 25) సారె 26) రోగం 29) మువి 31) నిశాని 32) సంరంభం 33) వెద 36) మ వి 37) లశవు 39) సామెత 41) శారిక 42) దినముఖము 43) తస్మదీయులు
నిలువు:
1) అనవరతం 2) స్మరణ 3) దీవ 4) లులి 5) సతం 6) సృష్టి 7) పమిట 8) ముసలివాడు 11) ఖిల్లా 14) దిదృక్ష 15) సేద్యము 20) తురంగం 21) ఊర్వశి 22) పేరెము 26) రోయి వెలది 27) విశాఖ 28) రిరంస 30) వికవికలు 34 దిశన 35) బూమె 36) మరియు 38) వుము 39) సాము 40) తత 41) శాదీ
పద శారద–43 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- బయన కన్యాకుమారి, విజయవాడ
- భాగవతుల కృష్ణారావు, సికింద్రాబాద్
- ద్రోణంరాజు వెంకట మోహన రావు, హైదరాబాద్
- ద్రోణంరాజు వెంకట నరసింహా రావు
- మధుసూదనరావు తల్లాప్రగడ, బెంగుళూరు
- మంజులదత్త కె, ఆదోని
- పి. వి. రాజు, హైదరాబాదు
- రంగావజ్ఝల శారద, హైదరాబాద్
- రామకూరు నాగేశ్వరరావు, శ్రీకాకుళం
- రామలింగయ్య టి, తెనాలి
- రామవరపు గిరిజాశంకర రావు, పూణె
- శంభర వెంకట రామ జోగారావు, బెంగుళురు/ముంబయి/టెక్సాస్
- శిష్ట్లా అనిత, బెంగుళురు
- శ్రీనివాసరావు సొంసాళె, ఎమ్మిగనూరు
- ఉషారాణి జి, తిరుపతి
వీరికి అభినందనలు.
గమనిక:
- ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
- ఈ పద ప్రహేళికలో అడ్డం, నిలువు ఆధారాలతో ఏవైనా సందేహాలు కలిగితే నిర్వాహకులు సిహెచ్.వి. బృందావనరావు గారిని 9963399189 నెంబరులో, chvbraossp@gmail.com లో గాని సంప్రదించగలరు.
- గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
శ్రీ సిహెచ్.వి. బృందావనరావు తపాలా శాఖలో సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టాఫీసెస్గా పని చేసి పదవీ విరమణ చేశారు. వీరి ప్రస్తుత నివాసం నెల్లూరు.
వీరికి సాహిత్యం మీద ఎంతో అభిరుచి ఉంది. రెండు కథా సంపుటాలు, రెండు కవితా సంపుటాలూ, ఒక ఖండకావ్యమూ, ఒక నానీల కవితాసంపుటీ వెలువరించారు. ఇటీవలే వాల్మీకి రామాయణం లోని సుందరకాండకు 1500 పద్యాల – మూల విధేయ మైన అనువాదాన్ని ప్రచురించారు. గడినుడి పూరణలంటే ఉన్న అభిరుచి కారణం దాదాపు అరవై ఏళ్ళ నించే వివిధ పత్రికల్లోని గడినుడులను పూరణ చేస్తూనే ఉన్నారు.
సంచిక వారు సంకలించి, ప్రచురించిన ‘రామకథాసుధ’ సంకలనంలో వీరి కథ ‘కౌగిలి’ కూడా ఉన్నది. వీరిని 9963399189 అనే నెంబరులో సంప్రదించవచ్చు.

