‘సంచిక’ వెబ్ పత్రికలో మరో గళ్ళనుడికట్టుకు స్వాగతం.
సిహెచ్.వి. బృందావనరావు గారు ‘పద శారద’ అనే గళ్ళనుడికట్టు రెండు వారాలకి ఒకసారి నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
| 1) పుట్టిన ప్రదేశంలో గంగానది పేరు (5) |
| 5) ఒక వస్తువు నియంత్రించే కేంద్ర బిందువు, ఒక సిద్ధితో ప్రారంభం (5) |
| 9) పెల్లు, అధికము (3) |
| 10) పక్షి (3) |
| 12) రక్షించాలనే కోరిక (3) |
| 13) తగినంత (2) |
| 16) నాసిక (2) |
| 17) ఉంచుట, రచన (3) |
| 18) ఒక కూరగాయ, దొరకడు కు ముందు తలచుకోండి (3) |
| 19) ఇల్లు, పట్టణము, ఇతడు – అటునుంచి (2) |
| 22) కే, కే, కే, కే (2) |
| 23) దక్ష దుహిత (2) |
| 24) పదింట్లో రెండో అవతారం (3) |
| 25) సాయిపల్లవికి సాయిచంద్ తండ్రి ఈ సినిమాలోనే (2) |
| 26) ముసలితనం (2) |
| 29) తిరగబడిన మద్యం (2) |
| 31) కార్యసాధనా తత్పరుడు (3) |
| 32) ఒక ముని, చిత్రకూటంలో రామునితో అడ్డదిడ్డంగా వాదించినవాడు (3) |
| 33) వజ్రాయుధము (2) |
| 36) చివరి అక్షరం పోయిన పోపుగింజలు (2) |
| 37) నారింజ పండు (3) |
| 39) చదువుల తల్లి క్షేత్రం (3) |
| 41) వంట, వంటసాల (3) |
| 42) చాకలి వనిత (5) |
| 43) భీముడే (5) |
నిలువు:
| 1) ఆదితేయుడు, వేలుపు (5) |
| 2) పూవు (3) |
| 3) వికృతమైన కథ (2) |
| 4) అవస్థ (2) |
| 5) లోహ జన్మభూమి (2) |
| 6) తిరగబడ్డ తిక్క కు వత్తుపోయింది మరి (2) |
| 7) జలము (3) |
| 8) అడుక్కుతినే ఆడమనిషి (5) |
| 11) హిమాచల్ ప్రదేశ్ లోని ఒక పర్యాటక లోయ (2) |
| 14) అది ఏ మాత్రం న్యాయం కాదు (3) |
| 15) ఎక్కుడు ప్రేముడి (3) |
| 20) వెలితి, కొరత (3) |
| 21) అచ్చమైనది, శుభ్రమైనది (3) |
| 22) హిమాలయాలలోని శివక్షేత్రం (3) |
| 26) గోతాల తయారీకి ఇది అవసరం (5) |
| 27) యయాతిని రహస్యంగా పెళ్ళాడిన రాక్షస రాజు కూతురు, దేవయాని దాసి (3) |
| 28) అడుసు, బురద (3) |
| 30) పూల ఆమని (5) |
| 34) వైకుంఠం లోని నది (3) |
| 35) ఊపిరి (2) |
| 36) సొరకాయను కొన్ని చోట్ల ఇలా కూడా అంటారు (3) |
| 38) కవాతు, అడుగు – క్రింద నుంచి (2) |
| 39) పెద్ద కుండ, ఇలాంటి కడుపులూ ఉంటాయి (2) |
| 40) ఆనందము, రక్తి (2) |
| 41) పుట్టపర్తి ఐనా సరే, షిర్డీ ఐనా సరే (2) |
ఈ ప్రహేళికని పూరించి 2025 డిసెంబర్ 30వ తేదీ లోపు puzzlesanchika@gmail.com కు సమాధానాలను మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పద శారద-45 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసిన వారి పేర్లు 2026 జనవరి 04వ తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.
పద శారద-44 జవాబులు
అడ్డం:
1) శివదేవయ్య 4) ఖరారునామా 9) వాసవి 10)రొక్కము 12) మపర్కం 13) నీతి 16) గ డే 17) పుట్టుక 18) బొక్కసం 19) తిల 22) పోడు 23) వంధ్య 24) ముద్రణ 25) కేకి 26) రాగం 29) రిఊ 31) నికృష్టం 32) నిషాదం 33) ణాఅ 36) నంగ 37) సుగత 39) శీతాద్రి 41) రాసము 42) రజతాచలం 43) బసవేశ్వరు
నిలువు:
1) శివానీపతి 2) వసతి 3) దేవి 4) య్యరొ 5) ఖము 6) రుమ 7) నా పగ 8) మార్కండేయుడు 11) క్కచు 14) నట్టువ 15) శక్కరి 20) లవంగం 21) సంద్రము 22) పోకిరి 26) రావణాసుర 27) ప్రకృతి 28) హుషారు 30) ఊభంగమురు 34) అగజ 35) ఖాతా 36) నంసశ్వ 38) తతా 39) శీలం 40) ద్రిబ 41) రావే
పద శారద–44 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- భద్రిరాజు ఇందుశేఖర్, హైదరాబాద్
- భాగవతుల కృష్ణారావు, సికింద్రాబాద్
- ద్రోణంరాజు వెంకట మోహన రావు, హైదరాబాద్
- ద్రోణంరాజు వెంకట నరసింహా రావు
- కంభం చంద్రశేఖర్, హైదరాబాద్
- కర్రి ఝాన్సీ, హైదరాబాద్
- కాళీపట్నపు శారద, హైదరాబాద్
- మధుసూదనరావు తల్లాప్రగడ, బెంగుళూరు
- మంజులదత్త కె, ఆదోని
- పి. వి. రాజు, హైదరాబాదు
- రంగావజ్ఝల శారద, హైదరాబాద్
- రామకూరు నాగేశ్వరరావు, శ్రీకాకుళం
- రామలింగయ్య టి, తెనాలి
- రామవరపు గిరిజాశంకర రావు, పూణె
- శంభర వెంకట రామ జోగారావు, బెంగుళురు/ముంబయి/టెక్సాస్
- శిష్ట్లా అనిత, బెంగుళురు
- శ్రీనివాసరావు సొంసాళె, ఎమ్మిగనూరు
వీరికి అభినందనలు.
గమనిక:
- ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
- ఈ పద ప్రహేళికలో అడ్డం, నిలువు ఆధారాలతో ఏవైనా సందేహాలు కలిగితే నిర్వాహకులు సిహెచ్.వి. బృందావనరావు గారిని 9963399189 నెంబరులో, chvbraossp@gmail.com లో గాని సంప్రదించగలరు.
- గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
శ్రీ సిహెచ్.వి. బృందావనరావు తపాలా శాఖలో సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టాఫీసెస్గా పని చేసి పదవీ విరమణ చేశారు. వీరి ప్రస్తుత నివాసం నెల్లూరు.
వీరికి సాహిత్యం మీద ఎంతో అభిరుచి ఉంది. రెండు కథా సంపుటాలు, రెండు కవితా సంపుటాలూ, ఒక ఖండకావ్యమూ, ఒక నానీల కవితాసంపుటీ వెలువరించారు. ఇటీవలే వాల్మీకి రామాయణం లోని సుందరకాండకు 1500 పద్యాల – మూల విధేయ మైన అనువాదాన్ని ప్రచురించారు. గడినుడి పూరణలంటే ఉన్న అభిరుచి కారణం దాదాపు అరవై ఏళ్ళ నించే వివిధ పత్రికల్లోని గడినుడులను పూరణ చేస్తూనే ఉన్నారు.
సంచిక వారు సంకలించి, ప్రచురించిన ‘రామకథాసుధ’ సంకలనంలో వీరి కథ ‘కౌగిలి’ కూడా ఉన్నది. వీరిని 9963399189 అనే నెంబరులో సంప్రదించవచ్చు.

