Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పద శారద-48

‘సంచిక’ వెబ్ పత్రికలో మరో గళ్ళనుడికట్టుకు స్వాగతం.

సిహెచ్.వి. బృందావనరావు గారు ‘పద శారద’ అనే గళ్ళనుడికట్టు రెండు వారాలకి ఒకసారి నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1) భార్య తమ్ముడు (5)
5) గవాక్షము (5)
9) పెద్ద అల, మధ్య అక్షరానికి గుడి (3)
10) బండి (3)
12) వేడి (3)
13) విరాళము, నెలవారీ కట్టు డబ్బు (2)
16) అన్న౦ తినే పాత్రలకు బహువచనం, చివరి అక్షరం పోయింది (2)
17) గంబూరము (3)
18) ముట్టుకుంటే షాకు (3)
19) తిరగబడ్డ సప్త సంఖ్య (2)
22) అర్ధ భాగము (2)
23) చిన్న కొడవలి (2)
24) తమ్మపడిగము (3)
25) పశుకూన (2)
26) ఇది లేని వాడు పోకకు కొరగాడంటారు (2)
29) ఝండా ఊంచా – – హమారా (2)
31) అదృష్టము, సంపద, సమయము (3)
32) ఇది శుద్ధ దండుగ (3)
33) పలుకా (2)
36) అతి సన్నని ముక్కలుగా చితక్కొట్టబడిన మాంసము (2)
37) సుమంగళి (3)
39) కోరిక (3)
41) తినుటకు లేనప్పుడు కడుపులో కలిగెడు బాధ (3)
42) మాయలు చేయడం (5)
43) వేశ్య (5)

నిలువు:

1) పల్నాటి యుద్ధపు యువ వీరుడు (5)
2) ఒకనాటి అందాల హిందీ తార (3)
3) కాకేమి (2)
4) ఆశ (2)
5) అనుకూలమైనది (2)
4) యాగకర్త (2)
7) ఉదాహరణకు రౌరవం (3)
8) మేఘం (5)
11) పినతల్లి (2)
14) వేగముగా, వెంటనే (3)
15) మొదటివాడు (3)
20) పాలించువాడు (3)
21) గ్రామం కన్నా పెద్దది, నగరం కన్నా చిన్నది (3)
22) సున్నా లేని సముద్రం (3)
26) నశింప జేయుట, చంపుట (5)
27) ఎనిమిదో తిథి (3)
28) పుణ్యనది (3)
30) నిన్నటి కలలబాల, డ్రీమ్ గర్ల్ (5)
34) బలానికిచ్చే ద్రవౌషధం, అన్యదేశ్యం (3)
35) భ్రాంతి (2)
36) రావణుని తల్లి (3)
38) ఆడువారు (2)
39) ఫలించు, రక్షించు (2)
40) ఆకాశం (2)
41) ఆశ్చర్యార్థకం (2)

ఈ ప్రహేళికని పూరించి 2026 ఫిబ్రవరి 10వ తేదీ లోపు puzzlesanchika@gmail.com కు సమాధానాలను మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పద శారద-48 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసిన వారి పేర్లు 2026 ఫిబ్రవరి 15వ తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.

పద శారద-47 జవాబులు

అడ్డం:

1) మనుచరిత్ర 5) జక్కవకవ 9) దరువు 10) పచనం 12) పలాసు 13) నగు 16) పంచ 17) కైరవి 18) భాసుడు 19) రిరి 22) యాత్ర 23) వాతం 24) బిరాన 25) ఏవ 26) నంజు 29) త్తుఎ 31) మాతలి 32) రేచన 33) తిరి 36) క్షిప్ర 37) మ్మవరా 39) నీలిమ 41) రాతిగ 42) నటకిరీటి 43) జాతీయ జండ

నిలువు:

1) మదనవైరి 2) నురుగు 3) చవు 4) త్రప 5) జనం 6) వప 7) కలాపం 8) వసుచరిత్ర 11) చల్ల 14) భారవి 15) వ్యాసుడు 20) రివాజు 21) మురారి 22) యావత్తు 26) నంది తిమ్మన 27) పోతన 28) నాచన 30) ఎర్రాప్రగడ 34) రివట 35) వాలి 36) క్షితిజం 38) రాకి 39) నీటి 40) మజా 41) రాయ

పద శారద47 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

గమనిక:

  1. ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
  2. ఈ పద ప్రహేళికలో అడ్డం, నిలువు ఆధారాలతో ఏవైనా సందేహాలు కలిగితే నిర్వాహకులు సిహెచ్.వి. బృందావనరావు గారిని 9963399189 నెంబరులో, chvbraossp@gmail.com లో గాని సంప్రదించగలరు.
  3. గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
Exit mobile version