Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పద శారద-50

‘సంచిక’ వెబ్ పత్రికలో మరో గళ్ళనుడికట్టుకు స్వాగతం.

సిహెచ్.వి. బృందావనరావు గారు ‘పద శారద’ అనే గళ్ళనుడికట్టు రెండు వారాలకి ఒకసారి నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1) రవీంద్రనాథ్ ఠాగూర్ నవల నౌకాడుబీ ఆధారంగా 1956లో తెలుగులో తీసిన చిత్రం (5)
2) కలహము, ద్వేషము (5)
9) సుగ్రీవుణ్ణో, కర్ణుణ్నో పిలవండి (3)
10) బాహుబలి చిత్ర నాయకుడు (3)
12) దండయాత్ర (3)
13) గందరగోళం, తొట్రుపాటులో రెండో సగం (2)
16) అట్నుంచి చప్పుడొస్తున్నది (2)
17) దొరకునది (3)
18) క్షౌర కార్మికుడు (3)
19) మూడిటి సమూహము (2)
22) చాకు కాదండీ, పెద్దదే (2)
23) చేయి (2)
24) తరువాత చేర్చబడినది (3)
25) కర్కటి (2)
26) దుడ్డు (2)
29) అట్నుంచి ఇక్కడ రండి (2)
31) వ్యవసాయము (3)
32) గుడ్లగూబ (3)
33) చివర చిరిగిన గుడ్డ (2)
36) అయ్యో! ఉన్నావనుకున్నానే (2)
37) విరటుని గోవులను మళ్ళింప వచ్చిన సుశర్మ ఈ దేశాధీశుడు – అటు నుంచి (3)
39) రోట్లో తలపెడితే దీని పోటు ఉండదా (3)
41) శిరోవేష్టనములు (3)
42) కొత్త ఆలాపన (5)
43) వివాహాహ్వానం (5)

నిలువు:

1) శ్రీశ్రీ కథల సంపుటి (5)
2) స్త్రీ కంచుకం (3)
3) చతురురాలు, క్రింది నుంచి (2)
4) ఆఖరి అక్షరం లేని ప్రఖ్యాతి, కింది నుంచి (2)
5) పేకాటలో పెద్ద ముక్క (2)
6) తినగ తినగ ఇది కూడా తియ్యగా ఉంటుందట (2)
7) నింద్యము, ఉపద్రవము, కోపము (3)
8) దేనికైనా ప్రాథమిక సామాను (5)
11) అభిప్రాయం తెలుపుకునే మాధ్యమం (2)
14) సరిగా ప్రవర్తించవలసిన తీరు, నాగరకత (3)
15) బుద్ధిహీనుడు, అవివేకి (3)
20) నీటి బొట్టు, మురుగు (3)
21) వివరంగా కాదు, సంగ్రహంగా (3)
22) ఆసరా (3)
26) 1954లో వచ్చిన జనతా ప్రొడక్షన్ వారి చిత్రం. ANR, NTR ఇద్దరూ ఉన్నారు. (5)
27) చూడటం (3)
28) రక్తం పీల్చే నీటి పురుగు, పట్టుకుంటే వదుల్చుకోడం కష్టం (3)
30) చల్లని రాజా ఓ చందమామా పాట ఈ సినిమాలోది (5)
34) క్రింద నుంచి, దిగుళ్ళు, మాయావేషాలు (3)
35) గింజ, సారము లేని పొట్టు, కొంతమంది ఉపన్యాసం, దీని దంపుడు లాగుంటుంది (2)
36) పశు కూనలు, ఆదూడలు (3)
38) పైకెక్కుతున్న నిశీధి (3)
39) ఈ పట్టణం తగలబడుతుంటే నీరో ఫిడేలు వాయించుకుంటున్నాడట (2)
40) పోతు గాదు. కింది నించి వస్తున్నది (2)
41) పాపము చేసినవాడు (2)

ఈ ప్రహేళికని పూరించి 2026 మార్చ్ 10వ తేదీ లోపు puzzlesanchika@gmail.com కు సమాధానాలను మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పద శారద-50 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసిన వారి పేర్లు 2026 మార్చ్ 15వ తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.

పద శారద-49 జవాబులు

అడ్డం:

1) ఆజవంజవం 5) పీఠికాపురం 9) తలపు 10) కమఠం 12) గుట్టుగ 13) పగ 16) కవ 17) శిల్పము 18) ఉదయం 19) ముష్టి 22) పేక 23) మిత్తి 24) సైరంధ్రి 25) కూలి 26) గస 29) కరా 31) కరుణ 32) నారాచం 33) డఅ 36) సమ 37) ధ్వనము 39) మేలము 41) కొమరు 42) జంఘాల శాస్త్రి 43) షడాననుడు

నిలువు:

1) ఆతపత్రము 2) జలగ 3) వంపు 4) వంక 5) పీఠం 6) కాగు 7) పుట్టుక 8) రంగవల్లిక 11) మడి 14) కల్పము 15) ఛందస్సు 20) ష్టిమిస 21) నీరంధ్రం 22) పేలిక 26) గరుడధ్వజం 27) నిరుక్తం 28) వారాహి 30) రాకొమరుడు 34) అనఘా 35) ఇల 36) సమను 38) ముల 39) మేస్త్రి 40) ముష 41) కొన

పద శారద–49 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

గమనిక:

  1. ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
  2. ఈ పద ప్రహేళికలో అడ్డం, నిలువు ఆధారాలతో ఏవైనా సందేహాలు కలిగితే నిర్వాహకులు సిహెచ్.వి. బృందావనరావు గారిని 9963399189 నెంబరులో, chvbraossp@gmail.com లో గాని సంప్రదించగలరు.
  3. గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
Exit mobile version