‘సంచిక’ వెబ్ పత్రికలో మరో గళ్ళనుడికట్టుకు స్వాగతం.
సిహెచ్.వి. బృందావనరావు గారు ‘పద శారద’ అనే గళ్ళనుడికట్టు రెండు వారాలకి ఒకసారి నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
| 1) మోసం, పేచీ (5) |
| 5) వెదురుబద్దలు అల్లే పని (5) |
| 9) జీవంలేని కళేబరం (3) |
| 10) అవాకు తో పాటిది, కమ్మ (3) |
| 12) సన్నని రెమ్మ (3) |
| 13) వెనుదిరిగి చూస్తున్న చిత్రకం (2) |
| 16) ఆర్జేడీ అధినేత పొట్టి పేరు అట్నుంచి (2) |
| 17) జాతా శౌచము (3) |
| 18) ఎడతెగనిది, నిరంతరమూను (3) |
| 19) హైదరాబాదు నది. తొలి అక్షరం పొట్టిదై౦ది (2) |
| 22) బాధ, ఘోష (2) |
| 23) ఒకటి సంఖ్య, ముఖ్యము (2) |
| 24) ధీవిశేషము (3) |
| 25) సత్తిరాజు లక్ష్మీనారాయణ (2) |
| 26) పిల్లలకు 2 నిముషాల్లో చేసి పెట్టే నూడుల్స్ లాంటి టిఫిన్ (2) |
| 29) _ _ భలే రాంచిలుకా, ఓ సినిమ పాట; మజా (2) |
| 31) బేసరి (3) |
| 32) 28 నిలువును ఖండించినది (3) |
| 33) వేము వృక్షం, రెండో అక్షరానికి అదనంగా వత్తు వచ్చింది (2) |
| 36) బారి కలిస్తే యతి (2) |
| 37) ఖరీదు కట్టే _ _ _ లేడోయ్, శ్రీశ్రీ (3) |
| 39) పెసూనాంబకు ముందు, బుడుగు నడగండి (3) |
| 41) పురాతనమైనది, చివర ‘ము’ చేరిస్తే ఇవి పద్దెనిమిది (3) |
| 42) తల వెనుక మెడ మీద ఉండే గుంత (5) |
| 43) శ్రీకృష్ణుని వంశం (5) |
నిలువు:
| 1) చీమ (5) |
| 2) తృప్తి (3) |
| 3) వలె, చెడ్డీ (2) |
| 4) పొలం చుట్టూ రక్షణకై నాటే కంప మొక్కలు (2) |
| 5) చీల (2) |
| 6) ఆరకూటము (2) |
| 7) రాత్రి కానిది (3) |
| 8) నుదుటి కంటి దేవర (5) |
| 11) ఋక్ష రజసుని పెద్దకొడుకు (2) |
| 14) తన భార్యను పాము కరిచిందని అన్ని పాములనూ చంపడం మొదలు పెట్టిన మునికుమారుడు (3) |
| 15) బడలిక తీర్చుకొనుట; విరామం (3) |
| 20) తరక్షువు (3) |
| 21) కలువలను వికసింపజేయునది, వెన్నెల (3) |
| 22) ఆలయమునకు ముందుండు ఎత్తైన కట్టడము, ముందు గాలి కూడా ఉండొచ్చు (3) |
| 26) అసలు రూపము మరుగుపరచు ఆకారము (5) |
| 27) బకము (3) |
| 28) గజమును పట్టి విష్ణువుచే చంపబడిన నీరాటము (3) |
| 30) ఆజానేయము (5) |
| 34) పూర్వమెప్పుడో వంట ఇండ్లలో ఈ రాతి పాత్రలుండేవి, తడబడింది (3) |
| 35) లోక్‌సభలో ప్రతిపక్ష నేత, పొట్టిగా (2) |
| 36) ఆశ లేక పోవడం (3) |
| 38) అతి చిన్న (2) |
| 39) ఆంధ్రజ్యోతిలో ఇల్లాలి ముచ్చట్లు వ్రాసినాయన కలం పేరు. ఇంటిపేరొద్దు (2) |
| 40) గారము ఉంటే మనోహరం, విలాసం (2) |
| 41) వంకర, తలక్రిందుగా (2) |
ఈ ప్రహేళికని పూరించి 2026 మార్చ్ 24వ తేదీ లోపు puzzlesanchika@gmail.com కు సమాధానాలను మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పద శారద-51 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసిన వారి పేర్లు 2026 మార్చ్ 29వ తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.
పద శారద-50 జవాబులు
అడ్డం:
1) చరణదాసి 5) ఆరివేరము 9) రవిజా 10) ప్రభాసు 12) ముట్టడి 13) మక 16) డిస 17) లభ్యము 18) మంగలి 19) త్రికం 22) బాకు 23) కయి 24) ప్రక్షిప్తం 25) దోస 26) పణం 28) టఇ 31) కర్శనం 32) ఉలూకం 33) వలు 36) లేవే 37) ర్తగత్రి 39) రోకటి 41) పాగలు 42) నవరాగము 43) పెండ్లి పిలుపు
నిలువు:
1) చరమరాత్రి 2) రవిక 3) ణజా 4) సిప్ర 5) ఆసు 6) వేము 7) రట్టడి 8) ముడిసరుకు 11) భాష 14) సభ్యత 15) వెంగలి 20) కంకణం 21) సంక్షిప్తం 22) బాసట 26) పరివర్తన 27) దర్శనం 28) జలూకం 30) ఇలవేలుపు 34) లుగవ 35) ఊక 36) లేగలు 38) త్రిరా 39) రోము 40) టిపెం 41) పాపి
పద శారద-50 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అరుణరేఖ ముదిగొండ, హైదరాబాద్
- బయన కన్యాకుమారి, విజయవాడ
- భద్రిరాజు ఇందుశేఖర్, హైదరాబాద్
- ద్రోణంరాజు వెంకట మోహన రావు, హైదరాబాద్
- ద్రోణంరాజు వెంకట నరసింహ రావు
- కంభం చంద్రశేఖర్, హైదరాబాద్
- కాళీపట్నపు శారద, హైదరాబాద్
- మధుసూదనరావు తల్లాప్రగడ, బెంగుళూరు
- మంజులదత్త కె, ఆదోని
- పి. వి. రాజు, హైదరాబాదు
- రంగావజ్ఝల శారద, హైదరాబాద్
- రామకూరు నాగేశ్వరరావు, శ్రీకాకుళం
- రామలింగయ్య టి, తెనాలి
- రామవరపు గిరిజాశంకర రావు, బెంగుళూరు
- శంభర వెంకట రామ జోగారావు, బెంగుళూరు/ముంబయి/టెక్సాస్
- శిష్ట్లా అనిత, బెంగుళూరు
- శ్రీనివాసరావు సొంసాళె, ఎమ్మిగనూరు
- ఉషారాణి జి, తిరుపతి
- వర్ధని మాదిరాజు, హైదరాబాద్
- జాకిర్ హుస్సేన్ ఎమ్.ఎమ్.డి., ఆదోని
వీరికి అభినందనలు.
గమనిక:
- ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
- ఈ పద ప్రహేళికలో అడ్డం, నిలువు ఆధారాలతో ఏవైనా సందేహాలు కలిగితే నిర్వాహకులు సిహెచ్.వి. బృందావనరావు గారిని 9963399189 నెంబరులో, chvbraossp@gmail.com లో గాని సంప్రదించగలరు.
- గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
శ్రీ సిహెచ్.వి. బృందావనరావు తపాలా శాఖలో సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టాఫీసెస్గా పని చేసి పదవీ విరమణ చేశారు. వీరి ప్రస్తుత నివాసం నెల్లూరు.
వీరికి సాహిత్యం మీద ఎంతో అభిరుచి ఉంది. రెండు కథా సంపుటాలు, రెండు కవితా సంపుటాలూ, ఒక ఖండకావ్యమూ, ఒక నానీల కవితాసంపుటీ వెలువరించారు. ఇటీవలే వాల్మీకి రామాయణం లోని సుందరకాండకు 1500 పద్యాల – మూల విధేయ మైన అనువాదాన్ని ప్రచురించారు. గడినుడి పూరణలంటే ఉన్న అభిరుచి కారణం దాదాపు అరవై ఏళ్ళ నించే వివిధ పత్రికల్లోని గడినుడులను పూరణ చేస్తూనే ఉన్నారు.
సంచిక వారు సంకలించి, ప్రచురించిన ‘రామకథాసుధ’ సంకలనంలో వీరి కథ ‘కౌగిలి’ కూడా ఉన్నది. వీరిని 9963399189 అనే నెంబరులో సంప్రదించవచ్చు.

