‘సంచిక’ వెబ్ పత్రికలో మరో గళ్ళనుడికట్టుకు స్వాగతం.
సిహెచ్.వి. బృందావనరావు గారు ‘పద శారద’ అనే గళ్ళనుడికట్టు రెండు వారాలకి ఒకసారి నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
| 1) సూర్యుడు, తీవ్రమైన కిరణాలు గలవాడు గదా (5) |
| 2) నునులేత మామిడాకు (5) |
| 9) సున్నిపిండి(3) |
| 10) నటి జయచిత్ర తల్లి – దైవబలం – చిత్రంలో నాయికగా నటించింది – తడబడింది (3) |
| 12) వెనుదిరిగిన నీచుడు. తెంపరి (3) |
| 13) రత్నం (2) |
| 16) అట్నుంచి ఆకారం, తొలి అక్షరం హ్రస్వమైంది (2) |
| 17) కొండ కొమ్ము (3) |
| 18) బంధములను వదలుకొనుట (3) |
| 19) ఈ రోజే అట్నుంచి (2) |
| 22) మొక్క కుదురుగానుండుటకు చేయు ఆలవాలము (2) |
| 23) సరేలెండి (2) |
| 24) గుహ, గహ్వరము (3) |
| 25) తెప్ప, రక్ష (2) |
| 26) దండు, ఆకు (2) |
| 29) లోగుట్టు తెలిసి నాయన సగం మాయమై వెనుతిరిగాడు (2) |
| 31) గ్రుడ్డితనము (3) |
| 32) ఒక సగం, ఆ సగంలో ఇంకో సగం – మొత్తం (3) |
| 33) దప్పిక, తిరగబడిన ఒక ఆయుధం (2) |
| 36) సేద్యము (2) |
| 37) పొడి చేయుట (3) |
| 39) అంచు (3) |
| 41) కృష్ణదేవరాయల వంశము (3) |
| 42) సరస్వతి, లక్ష్మి, పార్వతి (5) |
| 43) మెదువడ కాదు (5) |
నిలువు:
| 1) చంద్రుడు (5) |
| 2) ముద్దులగుమ్మ(3) |
| 3) తీవ్రమైన కోపం (2) |
| 4) ఎగవేత (2) |
| 5) భూతపూర్వ-హిందీ అమ్మగారు(2) |
| 6) చీటి తొలి అక్షరం పొట్టిదెంది (2) |
| 7) గడ్డపార (3) |
| 8) కోపం ఒళ్ళెరుగదు, నిద్ర సుఖమెరుగదు, ఆకలి _ _ _ _ _ (5) |
| 11) ఇతరం (2) |
| 14) సంకెల (3) |
| 15) ఉనుచుట, రచన (3) |
| 20) మణిహారము (3) |
| 21) కవ్వపు కొండ (3) |
| 22) నిరుపేద ఐనవాడు – అన్యదేశ్యం (3) |
| 26) పెరుగన్నం (5) |
| 27) అగస్త్యుడు గర్వభంగం చేసిన పర్వతం (3) |
| 28) తిమ్మరుసును రాయలు ఇలా పిలుస్తాడట (3) |
| 30) ఆవడ (5) |
| 34) చెంప, కపోలము (3) |
| 35) భరత మాత (2) |
| 36) కృష్ణరాయల వంశాని కన్నాముందు విజయనగం ఏలిన వంశం (3) |
| 38) మౌర్య చంద్రగుప్తుని తల్లి (2) |
| 39) పరిపాలించు (2) |
| 40) వందనం (2) |
| 41) ఒక రాశి (2) |
ఈ ప్రహేళికని పూరించి 2026 ఏప్రిల్ 07వ తేదీ లోపు puzzlesanchika@gmail.com కు సమాధానాలను మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పద శారద-52 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసిన వారి పేర్లు 2026 ఏప్రిల్ 12వ తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.
పద శారద-51 జవాబులు
అడ్డం:
1) పితలాటకం 5) మేదరి పని 9) పీనుగు 10) చెవాకు 12) రివట 13) లిపు 16) లులా 17) పురుడు 18) అశ్రాంతం 19) ముసి 22) గోడు 23) వంచ 24) శేముషి 25) బాపు 26) మాగి 29) రంజు 31) ముక్కెర 32) చక్రము 33) వేప్ప 36) నిరా 37) షరాబు 39) సీగాన 41) పురాణ 42) ముచ్చిలిగుంత 43) యదువంశము
నిలువు:
1) పిపీలికము 2) తనుపు 3) లాగు 4) కంచె 5) మేకు 6) రిరి 7) పవలు 8) నిటలాక్షుడు 11) వాలి 14) రురుడు 15) విశ్రాంతి 20) సివంగి 21) కౌముది 22) గోపురం 26) మారు వేషము 27) కొక్కెర 28) నక్రము 30) జుహురాణము 35) ప్పరాచ్చి 35) రాగా 36) నిరాశ 38 ) బులి 39) సీత 40) నయ 41) పువం
పద శారద-51 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- బయన కన్యాకుమారి, విజయవాడ
- భద్రిరాజు ఇందుశేఖర్, హైదరాబాద్
- భాగవతుల కృష్ణారావు, సికింద్రాబాద్
- ద్రోణంరాజు వెంకట మోహన రావు, హైదరాబాద్
- ద్రోణంరాజు వెంకట నరసింహ రావు
- కంభం చంద్రశేఖర్, హైదరాబాద్
- కాళీపట్నపు శారద, హైదరాబాద్
- మధుసూదనరావు తల్లాప్రగడ, బెంగుళూరు
- మంజులదత్త కె, ఆదోని
- పి. వి. రాజు, హైదరాబాదు
- రంగావజ్ఝల శారద, హైదరాబాద్
- రామకూరు నాగేశ్వరరావు, శ్రీకాకుళం
- రామలింగయ్య టి, తెనాలి
- రామవరపు గిరిజాశంకర రావు, బెంగుళూరు
- శంభర వెంకట రామ జోగారావు, బెంగుళూరు/ముంబయి/టెక్సాస్
- శిష్ట్లా అనిత, బెంగుళూరు
- శ్రీనివాసరావు సొంసాళె, ఎమ్మిగనూరు
- ఉషారాణి జి, తిరుపతి
- జాకిర్ హుస్సేన్ ఎమ్.ఎమ్.డి., ఆదోని
వీరికి అభినందనలు.
గమనిక:
- ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
- ఈ పద ప్రహేళికలో అడ్డం, నిలువు ఆధారాలతో ఏవైనా సందేహాలు కలిగితే నిర్వాహకులు సిహెచ్.వి. బృందావనరావు గారిని 9963399189 నెంబరులో, chvbraossp@gmail.com లో గాని సంప్రదించగలరు.
- గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
శ్రీ సిహెచ్.వి. బృందావనరావు తపాలా శాఖలో సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టాఫీసెస్గా పని చేసి పదవీ విరమణ చేశారు. వీరి ప్రస్తుత నివాసం నెల్లూరు.
వీరికి సాహిత్యం మీద ఎంతో అభిరుచి ఉంది. రెండు కథా సంపుటాలు, రెండు కవితా సంపుటాలూ, ఒక ఖండకావ్యమూ, ఒక నానీల కవితాసంపుటీ వెలువరించారు. ఇటీవలే వాల్మీకి రామాయణం లోని సుందరకాండకు 1500 పద్యాల – మూల విధేయ మైన అనువాదాన్ని ప్రచురించారు. గడినుడి పూరణలంటే ఉన్న అభిరుచి కారణం దాదాపు అరవై ఏళ్ళ నించే వివిధ పత్రికల్లోని గడినుడులను పూరణ చేస్తూనే ఉన్నారు.
సంచిక వారు సంకలించి, ప్రచురించిన ‘రామకథాసుధ’ సంకలనంలో వీరి కథ ‘కౌగిలి’ కూడా ఉన్నది. వీరిని 9963399189 అనే నెంబరులో సంప్రదించవచ్చు.

