‘సంచిక’ వెబ్ పత్రికలో మరో గళ్ళనుడికట్టుకు స్వాగతం.
సిహెచ్.వి. బృందావనరావు గారు ‘పద శారద’ అనే గళ్ళనుడికట్టు రెండు వారాలకి ఒకసారి నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
| 1) ఇంద్రుడు (5) |
| 5) చివర కుండ గల బంగారము (5) |
| 9) గరుత్మంతుడు (3) |
| 10) ఒక చర్మవాద్యవిశేషం (3) |
| 12) వినబడక పోయే రోగం (3) |
| 13) భిక్షావృత్తి మొదటి రెండక్షరాలు, రెండో అక్షరం హ్రస్వం (2) |
| 16) తిరగబడిన పుల్లకు చివర విరిగింది (2) |
| 17) తిరుగమాత; పోపు (3) |
| 18) ఱంకుటాలు, కులట (3) |
| 19) పూర్వము (2) |
| 22) నిందించు (2) |
| 23) ఇది 5 అడ్డమే (2) |
| 24) ద్ర్రాక్ష (3) |
| 25) పిల్లలకు పెట్టే కుచ్చు టోపీ (2) |
| 26) గుప్త చరుడు (2) |
| 29) ఎగ పెడితే ఇవ్వకపోవడం అని వాడుక; పేరు, బొట్టు (2) |
| 31) ఈ గింజలు 17 అడ్డానికి అవసరం (3) |
| 32) లేలిహానము (3) |
| 33) అట్నుంచి, చెడు వాసన (2) |
| 36) చీరకు రూపాంతరం (2) |
| 37) వాగ్బంధనం (3) |
| 39) ఆఖరక్షరం లేని పూట కూళ్ళ పెద్దమ్మ (3) |
| 41) ఒక అష్టపది ప్రారంభం తడబడంది (3) |
| 42) కోరికలు తీర్చే చెట్టు (5) |
| 43) నారదుడు (5) |
నిలువు:
| 1) చాలా సులువు, శ్రమలేకుండా (5) |
| 2) దివిసీమలోని ఒక లంక గ్రామం, తొలి మూడక్షరాలు (3) |
| 3) బలదేవుడు (2) |
| 4) తలక్రిందులైన ఇల్లు (2) |
| 5) సానరాయి, సుత్తితో పాటు ఇదీని (2) |
| 6) చిత్రకారుని పనిముట్టు (2) |
| 7) శంకరుడు (3) |
| 8) కోరినది నెరవేరడం కోసం దేవుడికి డబ్బు ముడి వేయడం (5) |
| 11) రాగము, అనురాగము (2) |
| 14) యమున (3) |
| 15) ఖచ్చితంగా చేసుకున్న నిర్ణయం (3) |
| 20) నముచిని చంపిన ఆయుధం (3) |
| 21) అన్నం తినే ఆకు పాత్ర (3) |
| 22) – – – కసి కళ్ళ కూనా! ముత్తు పాట ప్రారంభం ఒకటి. (3) |
| 26) ఆకాశ గంగ (5) |
| 27) అడవిలో రేగే నిప్పు(3) |
| 28) కట్టుబడికి సిమెంటు బదులు పూర్వం వాడేవారు (3) |
| 30) కాన్పులు జరిపే స్త్రీ (5) |
| 34) 42 అడ్డం తడబడింది (3) |
| 35) పైన కాదు (2) |
| 36) నాగలి (3) |
| 38) తిరగబడిన పొట్టి గుర్రం – తరచుట (2) |
| 39) ప్రేగు – రూపాంతరం (2) |
| 40) రాగమయి — పాట 2 అక్షరాలు (2) |
| 41) ఆఖరి అక్షరం లేని విస్తారం (2) |
ఈ ప్రహేళికని పూరించి 2026 మే 19వ తేదీ లోపు puzzlesanchika@gmail.com కు సమాధానాలను మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పద శారద-55 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసిన వారి పేర్లు 2026 మే 24వ తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.
పద శారద-54 జవాబులు
అడ్డం:
1) శితికంఠుడు 5) కోడె ప్రాయము 9) సురుచి 10) ల్చుదవ 12) సమాఖ్య 13) మాచ 16) రిప 17) చబుకు 18) పతంగం 19) ముత్తు 22) కణం 23) ద్యుతి 25) బందరు 25) వేయి 26) వేవి 29) రోము 31) సింధురం 32) సెబ్బర 33) వేట 36) ధాత 37) లుపుట 39) కైకసి 41) చమకు 42) పురపాలిక 43) అరిందముడు
నిలువు:
1) శిసుమారము 2) తిరుచ 3) కంచి 4) డుల్చు 5) కోవ 6) ప్రాస 7) యమారి 8) ముఖ్య పట్టణం 11) దర్భ 14) సాంబుడు 15) మాతంగం 20) త్తుద్యువి 21) సౌందర్య 22) కయిరో 26) వేడి వేలుపు 27) సింధుజ 28) దబ్బర 30) మురాంతకుడు 34) టపుర 35) వీక 36) ధామము 38) టపా 30) కైక 40) సిఅ 41) చద
పద శారద-54 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- బయన కన్యాకుమారి, విజయవాడ
- భాగవతుల కృష్ణారావు, సికింద్రాబాద్
- ద్రోణంరాజు వెంకట మోహన రావు, హైదరాబాద్
- ద్రోణంరాజు వెంకట నరసింహా రావు
- మంజులదత్త కె, ఆదోని
- పి. వి. రాజు, హైదరాబాదు
- రంగావజ్ఝల శారద, హైదరాబాద్
- రామకూరు నాగేశ్వరరావు, శ్రీకాకుళం
- రామలింగయ్య టి, తెనాలి
- రామవరపు గిరిజాశంకర రావు, బెంగుళూరు
- శంభర వెంకట రామ జోగారావు, బెంగుళూరు/ముంబయి/టెక్సాస్
- శిష్ట్లా అనిత, బెంగుళూరు
- శ్రీనివాసరావు సొంసాళె, ఎమ్మిగనూరు
- ఉషారాణి జి, తిరుపతి
- జాకిర్ హుస్సేన్ ఎమ్.ఎమ్.డి., ఆదోని
- డాక్టర్ వరలక్ష్మి హరవే, బెంగుళూరు
వీరికి అభినందనలు.
గమనిక:
- ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
- ఈ పద ప్రహేళికలో అడ్డం, నిలువు ఆధారాలతో ఏవైనా సందేహాలు కలిగితే నిర్వాహకులు సిహెచ్.వి. బృందావనరావు గారిని 9963399189 నెంబరులో, chvbraossp@gmail.com లో గాని సంప్రదించగలరు.
- గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
శ్రీ సిహెచ్.వి. బృందావనరావు తపాలా శాఖలో సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టాఫీసెస్గా పని చేసి పదవీ విరమణ చేశారు. వీరి ప్రస్తుత నివాసం నెల్లూరు.
వీరికి సాహిత్యం మీద ఎంతో అభిరుచి ఉంది. రెండు కథా సంపుటాలు, రెండు కవితా సంపుటాలూ, ఒక ఖండకావ్యమూ, ఒక నానీల కవితాసంపుటీ వెలువరించారు. ఇటీవలే వాల్మీకి రామాయణం లోని సుందరకాండకు 1500 పద్యాల – మూల విధేయ మైన అనువాదాన్ని ప్రచురించారు. గడినుడి పూరణలంటే ఉన్న అభిరుచి కారణం దాదాపు అరవై ఏళ్ళ నించే వివిధ పత్రికల్లోని గడినుడులను పూరణ చేస్తూనే ఉన్నారు.
సంచిక వారు సంకలించి, ప్రచురించిన ‘రామకథాసుధ’ సంకలనంలో వీరి కథ ‘కౌగిలి’ కూడా ఉన్నది. వీరిని 9963399189 అనే నెంబరులో సంప్రదించవచ్చు.

