‘సంచిక’ వెబ్ పత్రికలో మరో గళ్ళనుడికట్టుకు స్వాగతం.
సిహెచ్.వి. బృందావనరావు గారు ‘పద శారద’ అనే గళ్ళనుడికట్టు రెండు వారాలకి ఒకసారి నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
| 1) సహజన్మురాలు (5) |
| 5) ఏడుపు పాట (5) |
| 9) ఒక శబ్దాలంకారం (3) |
| 10) పరమాన్నము (3) |
| 12) మాయాద్యూత ప్రవీణుడు (3) |
| 13) సోషలిస్టు దేశం కాకముందు రష్యా అధినేత (2) |
| 16) తొలి అక్షరం హ్రస్వమైన బంజరు, అటు నుంచి (2) |
| 17) గంగానది (3) |
| 18) దానికింతయితే దీనికింతని చెప్పే పద్ధతి – రేషియో! (3) |
| 19) దొంగ (3) |
| 22) ఊరగాయలు పెట్టే పింగాణీ పాత్ర (2) |
| 23) తిరగబడిన తగాదా (2) |
| 24) శంప (3) |
| 25) ఉప్మాకు ముడిసరుకు (2) |
| 26) వాతెర (2) |
| 29) ఆట అట్నుంచి (2) |
| 31) అశ్వమేధరాజుసూయాది (3) |
| 32) యయాతిని రహస్యంగా పెళ్ళాడిన దానవరాజు పుత్రిక (3) |
| 33) అర్జునుని పిలవండి (2) |
| 36) అగస్త్యుని భార్య పేరులోని తొలి రెండక్షరాలు (2) |
| 37) ఒరయిక, ఉపద్రవము (3) |
| 39) మీనాక్షీ క్షేత్రం (3) |
| 41) బియాస్ నది పురాణ నామం, వశిష్ఠుని పాశములు త్రెంచినదట (3) |
| 42) జాహ్నవీ జలం (5) |
| 43) మనోహరము (5) |
నిలువు:
| 1) తామర – నీట బుట్టినది (5) |
| 2) శిపుని వాద్యం (3) |
| 3) క్రింది నుంచి నీరు, సంకు (2) |
| 4) పైకెక్కిన నాలుగో వంతు (2) |
| 5) గరళం (2) |
| 6) పది, అవస్థ (2) |
| 7) గీరడం (3) |
| 8) నిబిడీకరించబడినది, తారుమారయింది (5) |
| 11) యజ్ఞము చేయువాడు (2) |
| 14) గురుతు (3) |
| 15) కుసుమం (3) |
| 20) క్రింది నుంచి పార్థుడు, ప్రత్యయం పోయింది (3) |
| 21) గవాక్షము (3) |
| 22) శృంగార కీర్తన (3) |
| 26) మదిలోని మధురభావం పలికేను – – – – – ఒక సినీ గీతం (5) |
| 27) ప్రగల్భాలు – ఉత్తరకుమారునివి (3) |
| 28) ఆంధ్ర కాంగ్రెస్ అధినేత్రి (3) |
| 30) కొప్పు (5) |
| 34) శాపవిమోచనం వరకు అహల్య ఇలా ఉంది (3) |
| 35) వీరుడు (2) |
| 36) రహస్య ఒప్పందం – తొలి మూడక్షరాలు (3) |
| 38) ఒక రాగం తిరగబడింది (2) |
| 39) మమ్ములను (2) |
| 40) కంచుకం (2) |
| 41) క్రింద నుంచి పోకముడి (2) |
ఈ ప్రహేళికని పూరించి 2026 జూన్ 16 తేదీ లోపు puzzlesanchika@gmail.com కు సమాధానాలను మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పద శారద-57 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసిన వారి పేర్లు 2026 జూన్ 21వ తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.
పద శారద-56 జవాబులు
అడ్డం:
1) పరమాన్నము 5) తావిమోపరి 9) రివట 10) టంకము 12) తతిమ్మ 13) తాళి 14) కతె 17) షండుడు 18) వెల్లుల్లి 19) ముక్క 22) తాలు 23) బొక్కు 24) సత్యము 25) స్పృహ 26) మీసం 29) తుని 31) గోధుమ 32) యూపము 33) ధ్వని 36) రాక 37) జుగుప్స 39) ధమ్మిల్లం 41) మకురు 42) డువాలికావ 43) అరిందముడు
నిలువు:
1) పరితాపము 2) రవళి 3) మాట 4) ముటం 5) తాము 6) మోత 7) పతిక 8) రిమ్మతెగులు 11) కళ 14) మృడుడు 15) చిల్లులు 20) క్కబొసం 21) స్తుత్యము 22) తాహతు 26) మీనధ్వజుడు 27) బంధువు 28) పాపట 30) నిశాకరుడు 34) నిగువా 35) రమ్మి 36) రాకుము 38) ప్సలి 39) ధవ 40) ల్లంఅ 41) మద
పద శారద–56 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- బయన కన్యాకుమారి, విజయవాడ
- భద్రిరాజు ఇందుశేఖర్, హైదరాబాద్
- భాగవతుల కృష్ణారావు, సికింద్రాబాద్
- ద్రోణంరాజు వెంకట మోహన రావు, హైదరాబాద్
- ద్రోణంరాజు వెంకట నరసింహా రావు
- మంజులదత్త కె, ఆదోని
- పి. వి. రాజు, హైదరాబాదు
- రంగావజ్ఝల శారద, హైదరాబాద్
- రామకూరు నాగేశ్వరరావు, శ్రీకాకుళం
- రామలింగయ్య టి, తెనాలి
- రామవరపు గిరిజాశంకర రావు, బెంగుళూరు
- రాయపెద్ది అప్పా శేష శాస్త్రి, ఆదోని
- శంభర వెంకట రామ జోగారావు, బెంగుళూరు/ముంబయి/టెక్సాస్
- శిష్ట్లా అనిత, బెంగుళూరు
- శ్రీనివాసరావు సొంసాళె, ఎమ్మిగనూరు
- ఉషారాణి జి, తిరుపతి
- జాకిర్ హుస్సేన్ ఎమ్.ఎమ్.డి., ఆదోని
- డాక్టర్ వరలక్ష్మి హరవే, బెంగుళూరు
- వర్ధని మాదిరాజు, హైదరాబాద్
వీరికి అభినందనలు.
గమనిక:
- ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
- ఈ పద ప్రహేళికలో అడ్డం, నిలువు ఆధారాలతో ఏవైనా సందేహాలు కలిగితే నిర్వాహకులు సిహెచ్.వి. బృందావనరావు గారిని 9963399189 నెంబరులో, chvbraossp@gmail.com లో గాని సంప్రదించగలరు.
- గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
శ్రీ సిహెచ్.వి. బృందావనరావు తపాలా శాఖలో సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టాఫీసెస్గా పని చేసి పదవీ విరమణ చేశారు. వీరి ప్రస్తుత నివాసం నెల్లూరు.
వీరికి సాహిత్యం మీద ఎంతో అభిరుచి ఉంది. రెండు కథా సంపుటాలు, రెండు కవితా సంపుటాలూ, ఒక ఖండకావ్యమూ, ఒక నానీల కవితాసంపుటీ వెలువరించారు. ఇటీవలే వాల్మీకి రామాయణం లోని సుందరకాండకు 1500 పద్యాల – మూల విధేయ మైన అనువాదాన్ని ప్రచురించారు. గడినుడి పూరణలంటే ఉన్న అభిరుచి కారణం దాదాపు అరవై ఏళ్ళ నించే వివిధ పత్రికల్లోని గడినుడులను పూరణ చేస్తూనే ఉన్నారు.
సంచిక వారు సంకలించి, ప్రచురించిన ‘రామకథాసుధ’ సంకలనంలో వీరి కథ ‘కౌగిలి’ కూడా ఉన్నది. వీరిని 9963399189 అనే నెంబరులో సంప్రదించవచ్చు.

