‘సంచిక’ వెబ్ పత్రికలో మరో గళ్ళనుడికట్టుకు స్వాగతం.
సిహెచ్.వి. బృందావనరావు గారు ‘పద శారద’ అనే గళ్ళనుడికట్టు రెండు వారాలకి ఒకసారి నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
| 1) నాగవల్లీ దళం (5) |
| 5) భూపతి (5) |
| 9) సాగిన చమురు (3) |
| 10) ఆశ్రయము, ఉండు చోటు (3) |
| 12) రువ్వుట (3) |
| 13) పేకాటలో ఒక ముక్క, పందేలలో గుర్రం నడుపువాడు (2) |
| 16) వెనుదిరిగిన ఉపాధ్యాయుడు (2) |
| 17) పాద్యంతో పాటు పెద్దలకు సమర్పించేది (3) |
| 18) ఈశ్వర పత్ని (3) |
| 19) మాడపట్టు, బ్రహ్మరంధ్రం – అట్నించి (2) |
| 22) ప్రజస్వామ్యంలో అత్యంత ప్రాముఖ్యమైనది – ఎంపిక సాధనం (2) |
| 23) అభిప్రాయం (2) |
| 24) తొడిమ (3) |
| 25) జూలు, కేసరము (2) |
| 26) పూవు (2) |
| 29) చిన్నది. అన్యదేశ్యం (2) |
| 31) తడవ (3) |
| 32) ఆవాలు (3) |
| 33) ఈ రాజు వ్యాసుని మాతామహుడు (2) |
| 36) విరుద్ధార్థము తెలుపు ఉపసర్గము (2) |
| 37) వేదంలో ఘనా, జటల తో పాటు ఈ పండూను (3) |
| 39) నాద తను _ _ _ త్యాగరాజు కీర్తనలో పదం (3) |
| 41) వెనుక నుంచి నెమ్మదిగా (3) |
| 42) సూర్యుడు (5) |
| 43) ఇప్పుడు మీరు చూసేదే (5) |
నిలువు:
| 1) కుమారుడు (5) |
| 2) బ్రతుకు, ఉండుట (3) |
| 3) శ్రుతితో పాటు ఇదీ (2) |
| 4) చిన్న పాక (2) |
| 5) బోయీలు మోసే ప్రయాణ సాధనం (2) |
| 6) నావి కాని; పోకముడి (2) |
| 7) పత్ర సారము (3) |
| 8) విద్రోహం (5) |
| 11) రక్షకుడు (2) |
| 14) పొడవు (3) |
| 15) దేవభాష (3) |
| 20) అలసుడు (3) |
| 21) ఆనుకూల్యం (3) |
| 22) పరాజయం (3) |
| 26) ఆకాశగంగ (5) |
| 27) నైజము, బ్రతుకు తెరువు (3) |
| 28) సంతోషం (3) |
| 30) అపవాదుకు వాడుక (5) |
| 34) ఒక పప్పుధాన్యం (3) |
| 35) అధిపురాలు, వేశ్య (2) |
| 36) మితి లేని (3) |
| 38) ఒక తెలుగు కేరక్టర్ నటి, ఎక్స్‌ట్రా (2) |
| 39) రత్నము (2) |
| 40) మెరుపు తీవ (2) |
| 41) సాగిన దిక్కు (2) |
ఈ ప్రహేళికని పూరించి 2026 జూలై 14వ తేదీ లోపు puzzlesanchika@gmail.com కు సమాధానాలను మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పద శారద-59 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసిన వారి పేర్లు 2026 జూలై 19వ తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.
పద శారద-58 జవాబులు
అడ్డం:
1) తంతువాయము 2) పెనగులాట 9) జవ్వాజి 10) నిదానం 12) డలపా 13) పుయి 16) సకా 17) టైగ్రస్ 18) అంకారా 19) ముష్టి 22) జూలు 23) మిథ్య 24) కావ్యుడు 25) ఎద 26) పస 29) రిపు 31) కుట్టారం 32) విభ్రమం 33) భృతి 36) కొమి 37) తనాబి 39) కిలూతం 41) బాపురే 42) ముసలధారి 43) పురందరుడు
నిలువు:
1) తంజపురము 2) తువ్వాయి 3) వాజి 4) ముని 5) పెనం 6) గుడ 7)లాలస 8) టపాకాయలు 11) దావా 14) నిగ్రహం 15) వంకాయ 20) ష్టమిస 21) దివ్యుడు 22) జూదరి 26) పరభృతము 27) అట్టావా 28) అభ్రకం 30) పుడమిరేడు 34) తినాస 35) ఓలా 36) కొపురు 38) బిల 39) కిరి 40) తంపు 41) బాద
పద శారద–58 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అరుణరేఖ ముదిగొండ, హైదరాబాద్
- బయన కన్యాకుమారి, విజయవాడ
- భద్రిరాజు ఇందుశేఖర్, హైదరాబాద్
- భాగవతుల కృష్ణారావు, సికింద్రాబాద్
- ద్రోణంరాజు వెంకట మోహన రావు, హైదరాబాద్
- ద్రోణంరాజు వెంకట నరసింహా రావు
- గండ్లూరి జగన్మోహన రావు, ఖమ్మం
- మధుసూదనరావు తల్లాప్రగడ, బెంగుళూరు
- మంజులదత్త కె, ఆదోని
- పి. వి. రాజు, హైదరాబాదు
- రంగావజ్ఝల శారద, హైదరాబాద్
- రామకూరు నాగేశ్వరరావు, శ్రీకాకుళం
- రామలింగయ్య టి, తెనాలి
- రామవరపు గిరిజాశంకర రావు, బెంగుళూరు
- రాయపెద్ది అప్పా శేష శాస్త్రి, ఆదోని
- శంభర వెంకట రామ జోగారావు, బెంగుళూరు/ముంబయి/టెక్సాస్
- శిష్ట్లా అనిత, బెంగుళూరు
- శ్రీనివాసరావు సొంసాళె, ఎమ్మిగనూరు
- తాతిరాజు జగం, బరంపురం (ఒడిసా)
- ఉషారాణి జి, తిరుపతి
- డాక్టర్ వరలక్ష్మి హరవే, బెంగుళూరు
- జాకిర్ హుస్సేన్ ఎమ్.ఎమ్.డి., ఆదోని
వీరికి అభినందనలు.
గమనిక:
- ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
- ఈ పద ప్రహేళికలో అడ్డం, నిలువు ఆధారాలతో ఏవైనా సందేహాలు కలిగితే నిర్వాహకులు సిహెచ్.వి. బృందావనరావు గారిని 9963399189 నెంబరులో, chvbraossp@gmail.com లో గాని సంప్రదించగలరు.
- గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
శ్రీ సిహెచ్.వి. బృందావనరావు తపాలా శాఖలో సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టాఫీసెస్గా పని చేసి పదవీ విరమణ చేశారు. వీరి ప్రస్తుత నివాసం నెల్లూరు.
వీరికి సాహిత్యం మీద ఎంతో అభిరుచి ఉంది. రెండు కథా సంపుటాలు, రెండు కవితా సంపుటాలూ, ఒక ఖండకావ్యమూ, ఒక నానీల కవితాసంపుటీ వెలువరించారు. ఇటీవలే వాల్మీకి రామాయణం లోని సుందరకాండకు 1500 పద్యాల – మూల విధేయ మైన అనువాదాన్ని ప్రచురించారు. గడినుడి పూరణలంటే ఉన్న అభిరుచి కారణం దాదాపు అరవై ఏళ్ళ నించే వివిధ పత్రికల్లోని గడినుడులను పూరణ చేస్తూనే ఉన్నారు.
సంచిక వారు సంకలించి, ప్రచురించిన ‘రామకథాసుధ’ సంకలనంలో వీరి కథ ‘కౌగిలి’ కూడా ఉన్నది. వీరిని 9963399189 అనే నెంబరులో సంప్రదించవచ్చు.

