‘సంచిక’ వెబ్ పత్రికలో మరో గళ్ళనుడికట్టుకు స్వాగతం.
సిహెచ్.వి. బృందావనరావు గారు ‘పద శారద’ అనే గళ్ళనుడికట్టు రెండు వారాలకి ఒకసారి నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
| 1) తెలుగుకు జ్ఞానపీఠం తెచ్చిన నవల (5) |
| 5) తెలుగు తొలి జ్ఞానపీఠం సాధించిన కావ్యం ఆఖరి ఐదక్షరాలు (5) |
| 9) తామర, తామరకొలను (3) |
| 10) చూచినవి (3) |
| 12) తడబడిన తీతువు, 2వ అక్షరం గుడి లేదు (3) |
| 13) స్వాధీనం (2) |
| 15) ఒక తాళ విశేషము (2) |
| 17) నగ్నిక, దిగంబరి (3) |
| 18) చిరుతపులి (3) |
| 19) వదనం (2) |
| 22) అవకాశము (2) |
| 23) డబ్బు గలవాడు (2) |
| 24) పిండారులు థగ్గులు కట్టిరి కాలానికి – – – వంతెన – శ్రీశ్రీ (3) |
| 25) హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పోరేషన్ (2) |
| 26) మూడిటి సమూహం (2) |
| 29) తలలోని స్వేదజములు – తిరగబడి దీర్ఘం కోల్పోయాయి (2) |
| 31) చలం ప్రసిద్ధ నవల (3) |
| 32) వేరుపడినది, వ్యాకులమైనది (3) |
| 33) రాయితో పాటు (2) |
| 36) పువ్వు దేనియ గొను కీటకం (2) |
| 37) నియమము (3) |
| 39) ఒక దుంప శాకం (3) |
| 41) అట్నుంచి పేయము (3) |
| 42) రోగము లేనిది (5) |
| 43) అలుపు తీర్చుకొనుట (5) |
నిలువు:
| 1) శివలింగం క్రింది పీఠము (5) |
| 2) వజ్రాయుధము (3) |
| 3) పొడవైనది, తిరగబడింది (2) |
| 4) క్రింది నుంచి చూచే నేత్రాలు (2) |
| 5) కైతలల్లు వాడు (2) |
| 6) బ్రతుకు దెరువునకు జేయునది (2) |
| 7) రుధిరం (3) |
| 8) ముద్దులతో పాటు ఇవీను (5) |
| 11) వినుకొండ నాగరాజు గారి ప్రసిద్ధ నవల – ఊబిలో _ _ క్రింద నుంచి (2) |
| 14) ఒక రకం ధూప ద్రవ్యం (3) |
| 15) తొందర (3) |
| 20) ఒక ప్రేలుడు మందు దినుసు (3) |
| 21) గొంతుక (3) |
| 22) టాటా – ఇంక శలవు (3) |
| 26) అసమర్థుని జీవయాత్ర రచయిత ఇంటిపేరు (5) |
| 27) గౌతమి (3) |
| 28) చెలిమి (3) |
| 30) విద్వాన్ విశ్వం పెన్నపై రచించిన మనోహరకావ్యం (5) |
| 34) వరంగల్ జిల్లా లోని శిల్ప ప్రఖ్యాత ఆలయం పైకి వచ్చింది (3) |
| 35) ప్రజానాట్య మండలి నుండి వచ్చిన పాతకాలపు సినీ నటుడు నరసింహారావు ఇంటిపేరు (2) |
| 36) టీ (3) |
| 38) క్రింది నుంచి మమ్ములను (2) |
| 39) ఇరు ము లు (2) |
| 40) నష్టి (క్రింది నుంచి) (2) |
| 41) ప్రియవచనము ఇది క్రింది నుంచే (2) |
ఈ ప్రహేళికని పూరించి 2026 ఆగస్ట్ 11వ తేదీ లోపు puzzlesanchika@gmail.com కు సమాధానాలను మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పద శారద-61 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసిన వారి పేర్లు 2026 ఆగస్ట్ 16 వ తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.
పద శారద-60 జవాబులు
అడ్డం:
1) విశేషణము 5) సంజకెంజాయ 9) లేవరా 10) సామెత 12) పురితి 13) పధి 16) చిప్రా 17) బాల్యము 18) సిద్ధుడు 19) మురో 22) రోలు 23) హిజ్రా 24) అర్ణవం 25) ఇమాం 26) తెల్ల 29) చందా 31) మౌక్తికం 32) వార్తాకం 33) చిక్కి 36) అమ్మ 37) రాళము 39) కుదువ 41) పాదపం 42) జుహురాణము 43) సుమశరుడు
నిలువు:
1) విలేపనము 2) శేవధి 3) షరా 4) ముసా 5) సంత 6) కెంపు 7) జారిచి 8) యతిప్రాసలు 11) మెట్ట 14) శల్యము 15) బద్ధుడు 20) రోహిల్ల 21) నిర్ణయం 22) రోమాంచం 26) తెరచిరాజు 27) రక్తిమ 28) కుర్తాళం 30) దానిమ్మపండు 34) క్కిళహు 35) లేదు 36) అదరు 38) మురా 39) కుము 40) వసు 41) పాశ
పద శారద-60 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అరవ భాస్కర రావు, కోల్కతా
- అరుణరేఖ ముదిగొండ, హైదరాబాద్
- బయన కన్యాకుమారి, విజయవాడ
- భద్రిరాజు ఇందుశేఖర్, హైదరాబాద్
- భాగవతుల కృష్ణారావు, సికింద్రాబాద్
- ద్రోణంరాజు వెంకట మోహన రావు, హైదరాబాద్
- ద్రోణంరాజు వెంకట నరసింహా రావు
- గండ్లూరి జగన్మోహన రావు, ఖమ్మం
- కర్రి ఝాన్సీ, హైదరాబాద్
- కంభం చంద్రశేఖర్, హైదరాబాద్
- మంజులదత్త కె, ఆదోని
- పి. వి. రాజు, హైదరాబాదు
- రంగావజ్ఝల శారద, హైదరాబాద్
- రామకూరు నాగేశ్వరరావు, శ్రీకాకుళం
- రామలింగయ్య టి, తెనాలి
- రామవరపు గిరిజాశంకర రావు, బెంగుళూరు
- రాయపెద్ది అప్పా శేష శాస్త్రి, ఆదోని
- శంభర వెంకట రామ జోగారావు, బెంగుళూరు/ముంబయి/టెక్సాస్
- శిష్ట్లా అనిత, బెంగుళూరు
- శ్రీనివాసరావు సొంసాళె, ఎమ్మిగనూరు
- ఉషారాణి జి, తిరుపతి
- వర్ధని మాదిరాజు, హైదరాబాద్
- డాక్టర్ వరలక్ష్మి హరవే, బెంగుళూరు
- జాకిర్ హుస్సేన్ ఎమ్.ఎమ్.డి., ఆదోని
వీరికి అభినందనలు.
గమనిక:
- ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
- ఈ పద ప్రహేళికలో అడ్డం, నిలువు ఆధారాలతో ఏవైనా సందేహాలు కలిగితే నిర్వాహకులు సిహెచ్.వి. బృందావనరావు గారిని 9963399189 నెంబరులో, chvbraossp@gmail.com లో గాని సంప్రదించగలరు.
- గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
శ్రీ సిహెచ్.వి. బృందావనరావు తపాలా శాఖలో సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టాఫీసెస్గా పని చేసి పదవీ విరమణ చేశారు. వీరి ప్రస్తుత నివాసం నెల్లూరు.
వీరికి సాహిత్యం మీద ఎంతో అభిరుచి ఉంది. రెండు కథా సంపుటాలు, రెండు కవితా సంపుటాలూ, ఒక ఖండకావ్యమూ, ఒక నానీల కవితాసంపుటీ వెలువరించారు. ఇటీవలే వాల్మీకి రామాయణం లోని సుందరకాండకు 1500 పద్యాల – మూల విధేయ మైన అనువాదాన్ని ప్రచురించారు. గడినుడి పూరణలంటే ఉన్న అభిరుచి కారణం దాదాపు అరవై ఏళ్ళ నించే వివిధ పత్రికల్లోని గడినుడులను పూరణ చేస్తూనే ఉన్నారు.
సంచిక వారు సంకలించి, ప్రచురించిన ‘రామకథాసుధ’ సంకలనంలో వీరి కథ ‘కౌగిలి’ కూడా ఉన్నది. వీరిని 9963399189 అనే నెంబరులో సంప్రదించవచ్చు.

