‘సంచిక’ వెబ్ పత్రికలో మరో గళ్ళనుడికట్టుకు స్వాగతం.
సిహెచ్.వి. బృందావనరావు గారు ‘పద శారద’ అనే గళ్ళనుడికట్టు రెండు వారాలకి ఒకసారి నిర్వహిస్తున్నారు. (Grid 11 x 11).
ఆధారాలు:
అడ్డం:
| 1) బంగారుకొండ (5) |
| 5) సూర్యదేవుడు (5) |
| 9) పొట్టు, తాండ్ర (3) |
| 10) శ్రమ, అలసట (3) |
| 12) 1993 లో కల్పనా లాజ్మీ దర్శకత్వంలో వచ్చిన డింపుల్ కపాడియా సినిమా (3) |
| 13) కడుపు నొప్పికి వంటింటి వైద్యం (2) |
| 16) ఎండిన లావు, బోలు వెదురు గడ (అటునుంచి) (2) |
| 17) మహానటి (3) |
| 18) తములము (3) |
| 19) సినిమా (అన్యదేశ్యము) (2) |
| 22) పరిమితి (2) |
| 23) అటునుంచి శంఖపు దినుసు, వీటిలో చిల్లివి ఉంటాయా? (2) |
| 24) సిగబంతి (3) |
| 25) తిట్టు, దూరు (2) |
| 26) వికసించు (2) |
| 29) వీవన (2) |
| 31) ఇంద్రుడు కాదు, చంద్రుడు (3) |
| 32) 1 అడ్డమే (3) |
| 33) తిరిగిన గీతం, తిరగని పోస్టు (3) |
| 36) నడు (2) |
| 37) తడబడిన నక్క, బిందువు లేదు (3) |
| 39) ప్రాయశ్చిత్తం (3) |
| 41) ధోరణి, రకం (3) |
| 42) ఆలోచించవలసినది (5) |
| 43) వెనుదిరిగిపోవు (5) |
నిలువు:
| 1) కార్యకారణ సంబంధ చర్చ (5) |
| 2) మినుములు (3) |
| 3) ప్రత్యయం పోయిన సేన (2) |
| 4) తినగ తినగ తియ్యగనుండునది (క్రింద నుంచి పైకి) (2) |
| 5) మృగయ (2) |
| 6) మూలం, ప్రత్యేకం (2) |
| 7) చెదిరిన మరకలు (3) |
| 8) పులిసిన పిండితో చేయు ఒక తినుబండారం (5) |
| 11) బేసి కాదు (2) |
| 14) గర్భావస్థ చిన్నెలు (3) |
| 15) మురుగు, తూర్పు గోదావరి జిల్లాలోని ఒక గ్రామం, నర్సరీలకు ప్రసిద్ధి (3) |
| 20) అర్జునుడు (3) |
| 21) పిరుదు, కటి (3) |
| 22) చెట్టు (3) |
| 26) ఉదా. తెనాలిరామలింగడు (5) |
| 27) కొమరు సామి (3) |
| 28) బాపడు (3) |
| 30) హోలీ (5) |
| 34) మెట్టు, సోపానం (3) |
| 35) తరగ (2) |
| 36) అత్యంతము, ఉత్కృష్టము, (3) |
| 38) సత్యం వద, ధర్మం _ _ (2) |
| 39) ఈడు (2) |
| 40) మెట్టు, తీవ (2) |
| 41) ఉచిత విధముగ (2) |
ఈ ప్రహేళికని పూరించి 2026 సెప్టెంబర్ 08వ తేదీ లోపు puzzlesanchika@gmail.com కు సమాధానాలను మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పద శారద-63 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసిన వారి పేర్లు 2026 సెప్టెంబర్ 13వ తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.
పద శారద-62 జవాబులు
అడ్డం:
1) ఔరంగాబాదు 5) ఎఱ్ఱాప్రగడ 9) దగరు 10) రంజిల్ల 12) ములక్కా 13) నిమ్మ 16) బాము 17) దక్షుడు 18) భృత్యుడు 19) డువా 22) ప్రోలు 23) గుల్ల 24) రిక్తము 25) సోయా 26) పార 29) లువ 31) జృంభణం 32) సాంబారు 33) మాము 36) తుంచ 37) ర్థితవి 39) చేమిరి 41) పోటరి 42) కంటక ఫలము 43) మను చరిత్ర
నిలువు:
1) ఔదనికుడు 2) రంగమ్మ 3) గారు 4) దురం 5) ఎల్ల 6) ప్రము 7) గలబా 8) డక్కాముక్కీలు 11) జిహ్వ 14) చక్షువు 15) మృత్యువు 20) వాగుర 21) నక్తము 22) ప్రోయాలు 26) పారమార్థికం 27) ప్రాభవం 28) డంబాలు 30) వసుచరిత్ర 34) ముతట 35) లేమి 36) తుంటరి 38) విక 39) చేలం 40) రిమ 41) పోచ
పద శారద-62 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అరవ భాస్కర రావు, కోల్కతా
- అరుణరేఖ ముదిగొండ, హైదరాబాద్
- బయన కన్యాకుమారి, విజయవాడ
- భద్రిరాజు ఇందుశేఖర్, హైదరాబాద్
- భాగవతుల కృష్ణారావు, సికిందరాబాద్
- ద్రోణంరాజు వెంకట నరసింహా రావు
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు, హైదరాబాద్
- గండ్లూరి జగన్మోహన రావు, ఖమ్మం
- కర్రి ఝాన్సీ, హైదరాబాద్
- కంభం చంద్రశేఖర్, హైదరాబాద్
- మధుసూదన రావు తల్లాప్రగడ, బెంగుళూరు
- మంజులదత్త కె, ఆదోని
- పి. వి. రాజు, హైదరాబాదు
- రంగావజ్ఝల శారద, హైదరాబాద్
- రామకూరు నాగేశ్వరరావు, శ్రీకాకుళం
- రామలింగయ్య టి, తెనాలి
- రామవరపు గిరిజాశంకర రావు, బెంగుళూరు
- రాయపెద్ది అప్పా శేష శాస్త్రి, ఆదోని
- శంభర వెంకట రామ జోగారావు, బెంగుళూరు/ముంబయి/టెక్సాస్
- శిష్ట్లా అనిత, బెంగుళూరు
- శ్రీనివాసరావు సొంసాళె, ఎమ్మిగనూరు
- తాతిరాజు జగం, బరంపురం (ఒడిసా)
- ఉషారాణి జి, తిరుపతి
- డాక్టర్ వరలక్ష్మి హరవే, బెంగుళూరు
- వర్ధని మాదిరాజు, బెంగుళూరు
- జాకిర్ హుస్సేన్ ఎమ్.ఎమ్.డి., ఆదోని
వీరికి అభినందనలు.
గమనిక:
- ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
- ఈ పద ప్రహేళికలో అడ్డం, నిలువు ఆధారాలతో ఏవైనా సందేహాలు కలిగితే నిర్వాహకులు సిహెచ్.వి. బృందావనరావు గారిని 9963399189 నెంబరులో, chvbraossp@gmail.com లో గాని సంప్రదించగలరు.
- గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
శ్రీ సిహెచ్.వి. బృందావనరావు తపాలా శాఖలో సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టాఫీసెస్గా పని చేసి పదవీ విరమణ చేశారు. వీరి ప్రస్తుత నివాసం నెల్లూరు.
వీరికి సాహిత్యం మీద ఎంతో అభిరుచి ఉంది. రెండు కథా సంపుటాలు, రెండు కవితా సంపుటాలూ, ఒక ఖండకావ్యమూ, ఒక నానీల కవితాసంపుటీ వెలువరించారు. ఇటీవలే వాల్మీకి రామాయణం లోని సుందరకాండకు 1500 పద్యాల – మూల విధేయ మైన అనువాదాన్ని ప్రచురించారు. గడినుడి పూరణలంటే ఉన్న అభిరుచి కారణం దాదాపు అరవై ఏళ్ళ నించే వివిధ పత్రికల్లోని గడినుడులను పూరణ చేస్తూనే ఉన్నారు.
సంచిక వారు సంకలించి, ప్రచురించిన ‘రామకథాసుధ’ సంకలనంలో వీరి కథ ‘కౌగిలి’ కూడా ఉన్నది. వీరిని 9963399189 అనే నెంబరులో సంప్రదించవచ్చు.

