Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పద శారద-64

‘సంచిక’ వెబ్ పత్రికలో మరో గళ్ళనుడికట్టుకు స్వాగతం.

సిహెచ్.వి. బృందావనరావు గారు ‘పద శారద’ అనే గళ్ళనుడికట్టు రెండు వారాలకి ఒకసారి నిర్వహిస్తున్నారు. (Grid 11 x 11).

ఆధారాలు:

అడ్డం:

1) క్రొత్త చిత్తజ (5)
5) తగాదాకోరు (5)
9) యువతి (3)
10) సిపాయిలు చేయు సాధన (3)
12) ఆసక్తి లేనిది (3)
13) శిశువు, పసిది (2)
16) వెనుక నుండి ఇంగ్లీషు తేనె (2)
17) భుజంగము (3)
18) చూలాలు (3)
19) సూరీడు (2)
22) తన సొంతది (2)
23) ఓర్మి, క్షమ (2)
24) వచ్చుట (3)
25) నీరు (2)
26) కంబువు (2)
29) భూమి (2)
31) సీత కాపలాదారులలో, కల వచ్చిన వృద్ధ రక్కసి (3)
32) కరాపువు (3)
33) పచనము (2)
36) పిండప్రదాన క్షేత్రం (2)
37) ఇంద్రియ నిగ్రహ శక్తి (3)
39) పట్టీ (3)
41) కంసాలి/వడ్రంగి పనిముట్టు (3)
42) ముంగిసలు (5)
43) మనోహరము (5)

నిలువు:

1) రంభాప్రియుడు (5)
2) పంచమీ విభక్తి ప్రత్యయము (3)
3) మీది మాది వెరసి (2)
4) తిరగబడిన గాథ (2)
5) వ్యవహార సరళి (2)
6) బాధను వ్యక్తం చేయు ధ్వన్యనుకరణ మొకటి, క్రింద నుంచి పైకి (2)
7) పరిణామం చెందని (3)
8) ఖాళీ చేయి (5)
11) భేదము, ప్రసిద్ధి, ఉత్కృష్టము (2)
14) వడియంతో ఇదీనూ (3)
15) దూర వస్తు దర్శన యంత్రము (3)
20) నిశ్చేష్టత, సంతాపము (3)
21) తెలివి (3)
22) తనంత తానే ఉద్భవించిన (3)
26) సందె వేళల ప్రార్థన, చివరి అక్షరంలో అనుస్వారం లోపించింది (5)
27) పూలదండ (3)
28) నది (3)
30) ఆకాశము (5)
34) దండోరా (3)
35) 3600 సెకనుల కాలం (2)
36) కవాటపు చిలుకు, 24 నిముషాల కాలము (3)
38) మొదటి అక్షరం హ్రస్వమైన ఒక నక్షత్రం, ఉపదిక్కు (2)
39) దంతములు, అనేక (2)
40) చెరసాల (2)
41) పద్ధతి, ధోరణి (2)

ఈ ప్రహేళికని పూరించి 2026 సెప్టెంబర్ 22వ తేదీ లోపు puzzlesanchika@gmail.com కు సమాధానాలను మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పద శారద-64 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసిన వారి పేర్లు 2026 సెప్టెంబర్ 27వ తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.

పద శారద-63 జవాబులు

అడ్డం:

1) హేమాచలము 5) వేడివేలుపు 9) తుషము 10) వేసట 12) రుడాలి 13) వాము 16) గుబొం 17) సావిత్రి 18) విడియం 19) మువి 22) పారం 23) వ్వగ 24) వతంసం 25) నింద 26) విచ్చు 29) పంకా 31) ఇందుడు 32) మేరువు 33) టపా 36) పద 37) కవంచ 39) ప్రాచితం 41) తరహ 42) విచారణీయం 43) తిరోగమనం

నిలువు:

1) హేతువాదము 2) మాషము 3) చము 4) మువే 5) వేట 6) వేరు 7) లుడాగు 8) పులిబొంగరం 11) సరి 14) వేవిళ్ళు 15) కడియం 20) వివ్వచ్చు 21) నితంబం 22) పాదపం 26) వికటకవి 27) స్కందుడు 28) పారుడు 30) కామదహనం 34) పావంచా 35) వీచి 36) పరమ 38) చర 39) ప్రాయం 40) తంతి 41) తగ

పద శారద-63 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

గమనిక:

  1. ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
  2. ఈ పద ప్రహేళికలో అడ్డం, నిలువు ఆధారాలతో ఏవైనా సందేహాలు కలిగితే నిర్వాహకులు సిహెచ్.వి. బృందావనరావు గారిని 9963399189 నెంబరులో, chvbraossp@gmail.com లో గాని సంప్రదించగలరు.
  3. గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
Exit mobile version