Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పద శారద-65

‘సంచిక’ వెబ్ పత్రికలో మరో గళ్ళనుడికట్టుకు స్వాగతం.

సిహెచ్.వి. బృందావనరావు గారు ‘పద శారద’ అనే గళ్ళనుడికట్టు రెండు వారాలకి ఒకసారి నిర్వహిస్తున్నారు. (Grid 11 x 11).

ఆధారాలు:

అడ్డం:

1) ఆసక్తిలేనితనము, అనాస్థ (5)
5) దువ్వూరి రామిరెడ్డి గారి ఒక కావ్యము, ఆఖరి అక్షరానికి ఒత్తు లేదు (5)
9) ర గుణింతము లోని తొలి 2, 1, 3 అక్షరాలు (3)
10) కలువపూవు (3)
12) తూచు సాధనము (3)
13) గర్వము, పొగరు (2)
16) చివరి అక్షరం లేని ఎల్లప్పుడూ (2)
17) చుట్టరికం (3)
18) ఆచ్ఛాదన లేని (3)
19) రాయి, సారాయి (2)
22) ఒక తీపి బండారము, కాకినాడ ఫేమ్ (2)
23) లిఖిత రూప అక్షరగతి (2)
24) ఇంద్రుడు చంపిన ఒక రాక్షసుడు (3)
25) ఇది నోరు (2)
26) పట్టుదల (2)
29) ఒక పేలాల గింజ (2)
31) రాగము లేకుండుట (3)
32) తెలుగు (3)
33) ఒక ధాన్యం పంట (2)
36) ఈగ, తేనెటీగ, వేశ్య, అల్ప (2)
37) చెదిరిన నాగలి (3)
39) ఒక మందుగుండు దినుసు (3)
41) కంపము, స్వరకంపము – చివరి అక్షరం లేదు (3)
42) పుట్టుమచ్చ (5)
43) సమయ ప్రకారం నడిచే యమధర్మరాజు (5

నిలువు:

1) ఉజ్జాయింపుగా (5)
2) పాదరసం, ఇంగువ (3)
3) రేవతీపతి (2)
4) నాసిక (2)
5) పడమరకు పారు ఏరు (2)
6) జన్మించిన (2)
7) దానవ స్త్రీ (3)
8) 22 అడ్డమే, మడతలతో చేసేది, అల్లరి నరేష్ సినిమా పేరు (5)
11) మోక్షము (2)
14) భర్తృహీనత (3)
15) ముహూర్తము (3)
20) చలించినది (3)
21) ఈశ్వరుడే (3)
22) అనారోగ్యము (3)
26) భూమి (5)
27) కాపాడాలనే కోరిక (3)
28) కలుగు (3)
30) సింధుదేశపు రాజు, ధృతరాష్ట్రుని జామాత (5)
34) పైకెగసిన పెను తరగ (3)
35) _ _ మన మంచికే (2)
36) కురుచ కొమ్మలు, ఊడలు గల చెట్టు (3)
38) అవుతాము కు వ్యతిరేకం, క్రింద నుంచి (2)
39) ప్రయాణంలో నిలుచు స్థలం, రెండో అక్షరం పొట్టిదైంది (2)
40) ఘూకం కేకా, భేకం _ _ (శ్రీశ్రీ విన్నవి) (2)
41) సహస్రము – రెండో అక్షరానికి గుడి లేదు (2)

ఈ ప్రహేళికని పూరించి 2026 అక్టోబర్ 06వ తేదీ లోపు puzzlesanchika@gmail.com కు సమాధానాలను మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పద శారద-65 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసిన వారి పేర్లు 2026 అక్టోబర్ 11వ తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.

పద శారద-64 జవాబులు

అడ్డం:

1) నవ మన్మథ 5) తంపులమారి 9) లలన 10) కవాతు 12) విరక్త 13) కూన 16) నిహ 17) సప్పము 18) గర్భిణి 19) రవి 22) స్వము 23) తాల్మి 24) ప్రవేశము 25) తోయం 26) సంకు 29) భువి 31) త్రిజట 32) లవంగం 33) వంట 36) గయ 37) దమము 39) పటకా 41) బాడిస 42) నకులములు 43) రమణీయము

నిలువు:

1) నలకూబర 2) వలన 3) మన 4) థక 5) తంతు 6) లవి 7) మారని 8) రిక్తహస్తము 11) వాసి 14) అప్పడం 15) దుర్భిణి 20) వితాకు 21) వివేకం 22) స్వయంభు 26) సంధ్యావందన 27) స్రజము 28) స్రవంతి 30) విహాయసము 34) టమకు 35) గంట 36) గడియ 38) ముల 39) పలు 40) కార 41) బాణీ

పద శారద-64 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

గమనిక:

  1. ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
  2. ఈ పద ప్రహేళికలో అడ్డం, నిలువు ఆధారాలతో ఏవైనా సందేహాలు కలిగితే నిర్వాహకులు సిహెచ్.వి. బృందావనరావు గారిని 9963399189 నెంబరులో, chvbraossp@gmail.com లో గాని సంప్రదించగలరు.
  3. గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
Exit mobile version