‘సంచిక’ వెబ్ పత్రికలో మరో గళ్ళనుడికట్టుకు స్వాగతం.
సిహెచ్.వి. బృందావనరావు గారు ‘పద శారద’ అనే గళ్ళనుడికట్టు రెండు వారాలకి ఒకసారి నిర్వహిస్తున్నారు. (Grid 11 x 11).
ఆధారాలు:
అడ్డం:
| 1) తామరల వంటి పాదము (5) |
| 5) లడ్డు పట్టిన చేయి (5) |
| 9) వేపి (3) |
| 10) హృదయం (3) |
| 12) గార్దభ సంబంధి (3) |
| 13) వజ్రాయుధము (2) |
| 16) వెనుదిరిగిన మాయ, అన్యదేశ్యం (2) |
| 17) అంతఃపుర కంచుకి (3) |
| 18) నియమన గ్రంథము (3) |
| 19) యతి (2) |
| 22) పొడవైన (2) |
| 23) నాగలికి బిగించు ఇనుప చీల (2) |
| 24) ఎనిమిదవ తిథి (3) |
| 25) జగన్నాథ క్షేత్రం (2) |
| 26) ఇహం కాదు (2) |
| 29) చేయి (2) |
| 31) ఖచ్చితంగా తెలుపడం (3) |
| 32) నాశికా చూర్ణము (3) |
| 33) కుటుంబ నియంత్రణ – పొట్టిగా (2) |
| 36) యంత్రము (2) |
| 37) ఔషధ మూల ద్రవము, అన్యదేశ్యం (3) |
| 39) ఆఖరి రిక్క (3) |
| 41) విభీషణుడి భార్య (3) |
| 42) జలతర్పణం (5) |
| 43) బాసికము (5) |
నిలువు:
| 1) కిరీటి సాధించిన శైవాస్త్రం (5) |
| 2) రాకాసి (3) |
| 3) విధం (2) |
| 4) గుడ్డలు వ్రేలాడదీసుకునే అడ్డ కర్ర (2) |
| 5) ముఖము (2) |
| 6) క్రింద నుంచి పైకి – పున్నమి రేయి (2) |
| 7) మంచివాడు, దొడ్డవాడు (3) |
| 8) నరసింహస్వామి (5) |
| 11) పెరుగు (2) |
| 14) మోకు (3) |
| 15) మంత్రోచ్చారణతో ప్రయోగించవలసిన ఆయుధం (3) |
| 20) చివరకు ఖచ్చితంగా మిగిలినది (3) |
| 21) ఎంగిలి (3) |
| 22) ఇచ్ఛ లేకపోవుట (3) |
| 26) సరస్వతి (5) |
| 27) ఎండిపోయినది (3) |
| 28) కనిపించునది (3) |
| 30) ఏనుగు (5) |
| 34) కన్నులున్న చిన్నది, క్రింద నుంచి (3) |
| 35) ఒప్పిదమైన రీతి (2) |
| 36) డాగు, కళంకం (3) |
| 38) రోదించుము (2) |
| 39) రాత్రులు (2) |
| 40) నూవు (2) |
| 41) సంవత్సరము (2) |
ఈ ప్రహేళికని పూరించి 2026 అక్టోబర్ 20వ తేదీ లోపు puzzlesanchika@gmail.com కు సమాధానాలను మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పద శారద-66 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసిన వారి పేర్లు 2026 అక్టోబర్ 25వ తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.
పద శారద-65 జవాబులు
అడ్డం:
1) ఉదాసీనము 5) నలజారమ 9) రారరి 10) కుముదం 12) తక్కెడ 13) మదం 16) సత 17) బాంధవ్యం 18) నగ్నము 19) కలు 22) కాజా 23) లిపి 24) జంభుడు 25) వాయి 26) పంతం 29) లాజ 31) విరక్తి 32) ఆంధ్రము 33) వరి 36) క్షుద్ర 37) లహము 39) మతాబా 41) వేపధు 42) తిలకాలకం 43) కాలయముడు
నిలువు:
1) ఉరామరిక 2) దారదం 3) సీరి 4) ముకు 5) నదం 6) జాత 7) రక్కెస 8) మడతకాజా 11) ముక్తి 14) వైధవ్యం 15) లగ్నము 20) లులితం 21) శంభుడు 22) కాయిలా 26) పంటవలతి 27) రిరక్ష 28) రంధ్రము 30) జయద్రధుడు 34) రిహల 35) అంతా 36) క్షుపము 38) ముకా 39) మకం 40) బాకా 41) వేయ
పద శారద-65 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అరవ భాస్కర రావు, కోల్కత
- అరుణరేఖ ముదిగొండ, హైదరాబాద్
- బయన కన్యాకుమారి, విజయవాడ
- భద్రిరాజు ఇందుశేఖర్, హైదరాబాద్
- భాగవతుల కృష్ణారావు, సికిందరాబాద్
- ద్రోణంరాజు వెంకట నరసింహా రావు
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు, హైదరాబాద్
- కంభం చంద్రశేఖర్, హైదరాబాద్
- కర్రి ఝాన్సీ, హైదరాబాద్
- మంజులదత్త కె, ఆదోని
- పి. వి. రాజు, హైదరాబాదు
- రంగావజ్ఝల శారద, హైదరాబాద్
- రామకూరు నాగేశ్వరరావు, శ్రీకాకుళం
- రామలింగయ్య టి, తెనాలి
- రామవరపు గిరిజాశంకర రావు, బెంగుళూరు
- రాయపెద్ది అప్పా శేష శాస్త్రి, ఆదోని
- రుద్రరాజు అనసూయ, ఆదోని
- శంభర వెంకట రామ జోగారావు, బెంగుళూరు/ముంబయి/టెక్సాస్
- శిష్ట్లా అనిత, బెంగుళూరు
- శ్రీనివాసరావు సొంసాళె, ఎమ్మిగనూరు
- తాతిరాజు జగం, బరంపురం (ఒడిసా)
- ఉషారాణి జి, తిరుపతి
- వర్ధని మాదిరాజు, బెంగుళూరు
- డాక్టర్ వరలక్ష్మి హరవే, బెంగుళూరు
- జాకిర్ హుస్సేన్ ఎమ్.ఎమ్.డి., ఆదోని
వీరికి అభినందనలు.
గమనిక:
- ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
- ఈ పద ప్రహేళికలో అడ్డం, నిలువు ఆధారాలతో ఏవైనా సందేహాలు కలిగితే నిర్వాహకులు సిహెచ్.వి. బృందావనరావు గారిని 9963399189 నెంబరులో, chvbraossp@gmail.com లో గాని సంప్రదించగలరు.
- గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
శ్రీ సిహెచ్.వి. బృందావనరావు తపాలా శాఖలో సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టాఫీసెస్గా పని చేసి పదవీ విరమణ చేశారు. వీరి ప్రస్తుత నివాసం నెల్లూరు.
వీరికి సాహిత్యం మీద ఎంతో అభిరుచి ఉంది. రెండు కథా సంపుటాలు, రెండు కవితా సంపుటాలూ, ఒక ఖండకావ్యమూ, ఒక నానీల కవితాసంపుటీ వెలువరించారు. ఇటీవలే వాల్మీకి రామాయణం లోని సుందరకాండకు 1500 పద్యాల – మూల విధేయ మైన అనువాదాన్ని ప్రచురించారు. గడినుడి పూరణలంటే ఉన్న అభిరుచి కారణం దాదాపు అరవై ఏళ్ళ నించే వివిధ పత్రికల్లోని గడినుడులను పూరణ చేస్తూనే ఉన్నారు.
సంచిక వారు సంకలించి, ప్రచురించిన ‘రామకథాసుధ’ సంకలనంలో వీరి కథ ‘కౌగిలి’ కూడా ఉన్నది. వీరిని 9963399189 అనే నెంబరులో సంప్రదించవచ్చు.

