Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పద శారద-67

‘సంచిక’ వెబ్ పత్రికలో మరో గళ్ళనుడికట్టుకు స్వాగతం.

సిహెచ్.వి. బృందావనరావు గారు ‘పద శారద’ అనే గళ్ళనుడికట్టు రెండు వారాలకి ఒకసారి నిర్వహిస్తున్నారు. (Grid 11 x 11).

ఆధారాలు:

అడ్డం:

1) దుష్యంత పుత్రుని మాతామహుడు (5)
5) ధర్మజుడు మయసభలో చేసిన యాగము (5)
9) _ _ _ కురవాలి వానదేవుడా (3)
10) గురు, శుక్ర మొదలగు గ్రహాల మౌఢ్యం, వాడుకలో (3)
12) మడివేలుకు అఖరి అక్షరం లేదు (3)
13) మొదటి పానిపట్టు యుద్ధంలో మొగలులతో పోరిన హిందూ రాజు పొట్టి పేరు (2)
16) సూర్యుడు (2)
17) జటాజూటధారియైన ముక్కంటి (3)
18) ఒక స్కాండినేవియన్ దేశము, ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశంగా ప్రసిద్ధి చెందింది (3)
19) చివరి అక్షరం పోయిన త్వర (2)
22) ఓమము (2)
23) కపిల మహర్షి తల్లి, చివరి రెండక్షరాలు చాలు (2)
24) విరామము, ఊరట (3)
25) శ్రీమతి శ్రీకాంత్ (2)
26) బంధించబడినవాడు (2)
29) ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తెలుగు సినిమాలకు ఇచ్చే బహుమతి (2)
31) 18 అడ్డంలో చెప్పిన దేశం రాజధాని (3)
32) 17 అడ్డంలోని ఆయనే (3)
33) నల్ల చారల దుప్పి, ప్రత్యయం లేదు (2)
36) దీనితో మేడలు కడతారా! కూలిపోతాయి! (2)
37) ఇది పారిందంటే, దుస్తంత్రం గెలిచినట్టే (3)
39) గిరిజనులను, ఈ జాతుల వారంటారు (3)
41) ఫ్రెంచి (3)
42) పరమపథం, వైకుంఠం (5)
43) తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం (5)

నిలువు:

1) సాధారణంగా రంకు ఈ రకమైన సంబంధం (5)
2) వేపి (3)
3) ఫ్యాక్టరీ, కర్మాగారం – అన్యదేశ్యం (2)
4) తిరగబడిన త్రిసంఖ్య (2)
5) ఊహూ, మేము రామంటే (2)
6) రెండో అక్షరానికి గుడి వుంటే 16 అడ్డమే (2)
7) జాతీయగీతము లోని జయమగు గాక అనే అక్షరాలు చెదిరినవి (3)
8) ముడుచుకున్నది (5)
11) తిరగబడిన భార్య (2)
14) హానికారకమైన ఆశంస, సాధారణంగా మునులిస్తారు (3)
15) పోస్టాఫీసుల్లో కార్డులు, కవర్లతో పాటు ఈ లెటర్లూ ఉంటాయి (3)
20) ప్రఖ్యాత వయోలిన్ విద్వాంసుడు మెనూహిన్ పూర్తి పేరులోని మొదటి మూడక్షరాలు (3)
21) సదా, నిత్యం, అవిరామం (3)
22) ఎక్కిరింత (3)
26) సైలాస్ మారినర్ అనే నవల ఆధారంగా 1955 లో వచ్చిన తెలుగు చిత్రం (5)
27) అవగతమైనది (3)
28) పసిపాప (3)
30) దేవతలు (5)
34) ఒప్పిదమైనది (3)
35) తంబూరా, బుట్టతో వచ్చే గ్రామీణ స్త్రీ చెప్పే జోస్యం (2)
36) మితి మిరిన ఆశ (3)
38) గాథా? పొట్టలో చుక్క లేదు (2)
39) అహంకారము (2)
40) మీ, మా (2)
41) బిందువు పోయిన పంది (2)

ఈ ప్రహేళికని పూరించి 2026 నవంబర్ 03వ తేదీ లోపు puzzlesanchika@gmail.com కు సమాధానాలను మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పద శారద-67 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసిన వారి పేర్లు 2026 నవంబర్ 08వ తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.

పద శారద-66 జవాబులు

అడ్డం:

1) పాదారవిందం 5) మోదకహస్తం 9) శునకం 10) డెందము 12) రాసభ 13) పవి 16) దుజా 17) హెగ్గడి 18) శాస్త్రము 19) ముని 22) నిడు 23) కర్రు 24) అష్టమి 25) పూరీ 26) పరం 29) హస్తం 31) నిష్కర్ష 32) నశ్యము 33) కుని 36) మర 37) టించరు 39) రేవతి 41) సరమ 42) తిలోదకాలు 43) లలామకము

నిలువు:

1) పాశుపతము 2) దానవి 3) రకం 4) దండెం 5) మోము 6) కరా 7) హసదు 8) స్తంభజాతుడు 11) దధి 14) పగ్గము 15) అస్త్రము 20) నికరం 21) జుష్టము 22) నిరీహ 26) పలుకుటింతి 27) శుష్కము 28) దృశ్యము 30) స్తంబేరమము 34) నిచలో 35) ఠేవ 36) మరక 38) రుద 39) రేలు 40) తిల 41) సమ

పద శారద-66 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

గమనిక:

  1. ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
  2. ఈ పద ప్రహేళికలో అడ్డం, నిలువు ఆధారాలతో ఏవైనా సందేహాలు కలిగితే నిర్వాహకులు సిహెచ్.వి. బృందావనరావు గారిని 9963399189 నెంబరులో, chvbraossp@gmail.com లో గాని సంప్రదించగలరు.
  3. గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
Exit mobile version