Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

‘పద విన్యాసం’ సరికొత్త ఫీచర్ ప్రారంభం – త్వరలో – ప్రకటన

సంచికలో పజిల్స్ కోరుకునే పాఠకుల కోసం ‘పద విన్యాసం’ పేరిట మరో పజిల్ ఫీచర్ త్వరలో అందించనున్నాము.

సంచిక మాసపత్రికలో ‘పద ప్రహేళిక’ ఫీచర్ నిర్వహిస్తున్న శ్రీ టి. రామలింగయ్య గారు ఈ కొత్త ఫీచర్‍ని నిర్వహిస్తారు.

రెండు వారాలకి ఒకసారి వచ్చే ఈ ఫీచర్ పాఠకులను ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాము.

ఈ ఫీచర్‍లో రచయిత ఒక పదానికి క్లూ ఇస్తారు. దానిలో ఉన్న కొన్ని అక్షరాలతో అటుఇటూ మార్చినా లేదా పదాన్ని విడగొట్టినా ఏర్పడే కొత్త పదాలు ఏర్పడుతాయి. అటువంటి పదాల అర్థాలను నిర్వాహకులు సూచిస్తారు. వాటి ఆధారంగా రచయిత హింట్ ఇచ్చిన పదాన్ని పాఠకులు గుర్తించాలి.

ఈ క్రింది ఉదాహరణ చూడండి.

1, 2 అక్షరాలతో కేళి (ఆట), 3,4 అక్షరాలతో ధర, విలువ (వెల), 3,4,5 అక్షరాలతో ఆడుది (వెలది) పదాలు వస్తాయి.

అప్పుడు మూల పదం ‘ఆటవెలది’ అవుతుంది.

ఇటువంటి పది ప్రశ్నలు ఈ పజిల్‌లో ఉంటాయి.

~

‘పద విన్యాసం’ శీర్షిక త్వరలో ప్రారంభం!

ఈ శీర్షికలో పాల్గొనండి! మీ భాషా ప్రావీణ్యాన్ని పరీక్షించుకోండి!

Exit mobile version