
సంచికలో పజిల్స్ కోరుకునే పాఠకుల కోసం ‘పద విన్యాసం’ పేరిట, రెండు వారాలకి ఒకసారి వచ్చేలా, మరో పజిల్ని శ్రీ టి. రామలింగయ్య గారు అందిస్తున్నారు.
ఈ ఫీచర్లో రచయిత ఒక పదానికి క్లూస్ ఇస్తారు. దానిలో ఉన్న కొన్ని అక్షరాలతో అటుఇటూ మార్చినా లేదా పదాన్ని విడగొట్టినా ఏర్పడే కొత్త పదాలు ఏర్పడుతాయి. అటువంటి పదాల అర్థాలను నిర్వాహకులు సూచిస్తారు. వాటి ఆధారంగా రచయిత హింట్ ఇచ్చిన పదాన్ని పాఠకులు గుర్తించాలి.
ఈ క్రింది ఉదాహరణ చూడండి.
1, 2 అక్షరాలతో కేళి (ఆట), 3,4 అక్షరాలతో ధర, విలువ (వెల), 3,4,5 అక్షరాలతో ఆడుది (వెలది) పదాలు వస్తాయి.
అప్పుడు మూల పదం ‘ఆటవెలది’ అవుతుంది.
ఇటువంటి పది ప్రశ్నలు ఈ పజిల్లో ఉంటాయి.
~
ఈ వారం ప్రశ్నలు:
పదం 1 క్లూస్:
1, 2, 4, 5 అక్షరాలతో ఆధీనంలో లేని, వశం కాని; 4, 2, 5 అక్షరాలతో పీనుగు; 2.4.5 అక్షరాలతో స్వాధీనం.
పదం 2 క్లూస్:
1, 2, 3 అక్షరాలతో క్షుత్తు; 2, 3 అక్షరాలతో ప్రస్తుత యుగం; 1, 5 అక్షరాలతో నెయ్యి; 1, 4 అక్షరాలతో ఆచూకి.
పదం 3 క్లూస్:
1, 2, 5 చీకటి; 1,2 అక్షరాలతో రెండు; 3, 2, 5 అక్షరాలతో ఇతరులు.
పదం 4 క్లూస్:
1, 2, 3 అక్షరాలతో సమిష్టి; 4, 5 అక్షరాలతో యుద్ధము; 3, 4 అక్షరాలతో ప్రభుత్వ బస్సులు డ్యూటీ ముగిసాకా నిలిచే స్థలం
పదం 5 క్లూస్:
1, 2 అక్షరాలతో నీటిలో చేసే వ్యాయామము; 1, 5 అక్షరాలతో నోటితో చేసే ధ్వని; 3, 4 అక్షరాలతో తునక; 2, 5 అక్షరాలతో శిరస్సు.
పదం 6 క్లూస్:
1, 2, 3 అక్షరాలతో వామ భాగం, దాపల; 4, 5 అక్షరాలతో పాదము; 4, 3 అక్షరాలతో గొడుగుకాడ; 4, 2 అక్షరాలతో తొడిమ.
పదం 7 క్లూస్:
1, 2, 3 అక్షరాలతో అందమైన స్త్రీ; 1, 4 చీర; 4, 3, 2, 5 అక్షరాలతో మాంసము.
పదం 8 క్లూస్:
1, 2 అక్షరాలతో వేడిమి, సెగ; 3, 2 అక్షరాలతో రూపాయి; 4, 5, 2 అక్షరాలతో తక్కెడ సిబ్బి; 1, 4 అక్షరాలతో అవమానం, నింద.
పదం 9 క్లూస్:
1, 2 అక్షరాలతో వాయువు; 3, 4, 5 అక్షరాలతో వార్త; 1, 4 అక్షరాలతో పశువుల కుడితి తొట్టె,
పదం 10 క్లూస్:
1, 2 అక్షరాలతో పిశాచం, సూర్యాది గ్రహం; 4, 3, 2 అక్షరాలతో తోక; 1, 5 అక్షరాలతో పూజత్వమును తెలుపునది.
~
మీరు ఈ పజిల్ని పూరించి సమాధానాలను 2026 ఫిబ్రవరి 17వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్లో ‘పద విన్యాసం-1 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 2026 ఫిబ్రవరి 22వ తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.
~
గమనిక:
- పజిల్లో ఏవైనా సందేహాలు కలిగితే నిర్వాహకులు టి రామలింగయ్య గారిని 7285938387 నెంబరులో, ramalingaihtadikonda@gmailcom అనే ఈమెయిల్లో సంప్రదించగలరు.
- పజిల్‌కు సంబంధించిన సందేహాలకు నిర్వాహకులను సంప్రదించాలి సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
ప్రకాశం జిల్లా ఒంగోలు నివాసి అయిన శ్రీ టి. రామలింగయ్య 2002లో ప్రభుత్వ ఉద్యోగిగా పదవీ విరమణ చేసి, విశ్రాంత జీవితం గడుపుతున్నారు. గళ్ళ నుడికట్టులు నింపటంలో ఆసక్తి ఉన్న రామలింగయ్య 1980 నుండి ఆంధ్రభూమి, ఆంధ్రప్రభలలోని ఫజిల్స్ పూరించి పంపేవారు. ప్రస్తుతము కాలక్షేపం కొరకు స్వయంగా ఫజిల్స్ తయారు చేస్తుంటారు. ఎవరిని అనుకరించిక స్వయంగా శబ్దార్థ చంద్రిక, తెలుగు అకాడమి నిఘంటువు లను అనుసరించి వ్రాస్తుంటారు.
సెల్: 7285938387
