Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పద విన్యాసం-10

సంచికలో పజిల్స్ కోరుకునే పాఠకుల కోసం ‘పద విన్యాసం’ పేరిట, రెండు వారాలకి ఒకసారి వచ్చేలా, మరో పజిల్‌ని శ్రీ టి. రామలింగయ్య గారు అందిస్తున్నారు.

ఈ ఫీచర్‍లో రచయిత ఒక పదానికి క్లూస్ ఇస్తారు. దానిలో ఉన్న కొన్ని అక్షరాలతో అటుఇటూ మార్చినా లేదా పదాన్ని విడగొట్టినా ఏర్పడే కొత్త పదాలు ఏర్పడుతాయి. అటువంటి పదాల అర్థాలను నిర్వాహకులు సూచిస్తారు. వాటి ఆధారంగా రచయిత హింట్ ఇచ్చిన పదాన్ని పాఠకులు గుర్తించాలి.

ఈ క్రింది ఉదాహరణ చూడండి.

1, 2 అక్షరాలతో కేళి (ఆట), 3,4 అక్షరాలతో ధర, విలువ (వెల), 3,4,5 అక్షరాలతో ఆడుది (వెలది) పదాలు వస్తాయి.

అప్పుడు మూల పదం ‘ఆటవెలది’ అవుతుంది.

ఇటువంటి పది ప్రశ్నలు ఈ పజిల్‌లో ఉంటాయి.

~

ఈ వారం ప్రశ్నలు:

పదం 1 క్లూస్:

1, 2, 3 అక్షరాలతో దుడ్డుకర్ర; 4, 5 అక్షరాలతో పాఠ్యపుస్తకంలో భాగం; 4, 3 అక్షరాలతో కొత్త కాదు; 4, 2 అక్షరాలతో పాలు, న్యాయం.

పదం 2 క్లూస్:

1, 2 అక్షరాలతో వరుస; 1, 3, 2 అక్షరాలతో ఒక ముస్లిం చక్రవర్తి; 3, 4, 5 అక్షరాలతో  లేని గొప్పదనం, డాబు.

పదం 3 క్లూస్:

1, 2, 5 అక్షరాలతో నాడి; 3, 4 అక్షరాలతో బుద్ధి, తెలివి; 3, 5 అక్షరాలతో మీరు కాదు; 3, 2 అక్షరాలతో హద్దు.

పదం 4 క్లూస్:

1, 2 అక్షరాలతో పశువు; 3, 4, 5 అక్షరాలతో పైరులకు తగిలే చీడ; 3, 2 అక్షరాలతో కొయ్య గరిటె.

పదం 5 క్లూస్:

3, 4, 5 అక్షరాలతో వయసు; 2, 4, 5 అక్షరాలతో సంగీతంలో విశ్రాంతి; 1, 2, 5 అక్షరాలతో చిగురించు.

పదం 6 క్లూస్:

1, 2, 3 అక్షరాలతో వసంత ఋతువు; 2, 5, 3 అక్షరాలతో మురికి; 4, 5 అక్షరాలతో చెలికత్తె.

పదం 7 క్లూస్:

1, 4, 5 అక్షరాలతో పగలు, గర్వము; 3, 4, 5 అక్షరాలతో వలపు; 5, 2 అక్షరాలతో మెలిక.

పదం 8 క్లూస్:

3, 4, 1 అక్షరాలతో శయ్య, మంచం; 3, 2, 5 అక్షరాలతో మూడు తులాల బంగారం; 3, 2, 1 అక్షరాలతో చిన్న పిల్లలు రాయడానికి ఉపయోగించే రాతిబల్ల.

పదం 9 క్లూస్:

1, 4, 5 అక్షరాలతో పెన్ను; 2, 3, 4, 5 అక్షరాలతో  పాలన కొరకు కొన్ని గ్రామాలు కలిపి ఏర్పర్చిన ప్రాంతము; 1, 3 అక్షరాలతో చివర, తుది.

పదం 10 క్లూస్:

1, 2, 3 అక్షరాలతో పడిసెం, రొంప; 4, 2 అక్షరాలతో పాదము, దగ్ధమవు; 4, 5 అక్షరాలతో నాలుగు చక్రాల వాహనం; 5, 1 అక్షరాలతో ముసలితనం, రోగం.

~

మీరు ఈ పజిల్‌ని పూరించి సమాధానాలను 2026 జూన్ 23వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పద విన్యాసం-10 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 2026 జూన్ 28వ తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.

~

పదవిన్యాసం-9 జవాబులు:

1) ముక్కుదిబ్బడ 2) పాలుమాలిక 3) మామకీనము 4) ఆత్రేయపురం 5) త్రిపురములు 6) నెలతాలుపు 7) నేలకానుపు 8) గడువుతీరు 9) శనివారము 10) ఉత్తరహక్కు

~

పదవిన్యాసం-9 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

~

గమనిక:

Exit mobile version