
సంచికలో పజిల్స్ కోరుకునే పాఠకుల కోసం ‘పద విన్యాసం’ పేరిట, రెండు వారాలకి ఒకసారి వచ్చేలా, మరో పజిల్‌ని శ్రీ టి. రామలింగయ్య గారు అందిస్తున్నారు.
ఈ ఫీచర్‍లో రచయిత ఒక పదానికి క్లూస్ ఇస్తారు. దానిలో ఉన్న కొన్ని అక్షరాలతో అటుఇటూ మార్చినా లేదా పదాన్ని విడగొట్టినా ఏర్పడే కొత్త పదాలు ఏర్పడుతాయి. అటువంటి పదాల అర్థాలను నిర్వాహకులు సూచిస్తారు. వాటి ఆధారంగా రచయిత హింట్ ఇచ్చిన పదాన్ని పాఠకులు గుర్తించాలి.
ఈ క్రింది ఉదాహరణ చూడండి.
1, 2 అక్షరాలతో కేళి (ఆట), 3,4 అక్షరాలతో ధర, విలువ (వెల), 3,4,5 అక్షరాలతో ఆడుది (వెలది) పదాలు వస్తాయి.
అప్పుడు మూల పదం ‘ఆటవెలది’ అవుతుంది.
ఇటువంటి పది ప్రశ్నలు ఈ పజిల్‌లో ఉంటాయి.
~
ఈ వారం ప్రశ్నలు:
పదం 1 క్లూస్:
1, 2 అక్షరాలతో పిల్లి జాతికి చెందిన అడవి మృగం; 3, 4 అక్షరాలతో దురద; 3, 4, 5 అక్షరాలతో తొంబది.
పదం 2 క్లూస్:
2, 3, 4, 5 అక్షరాలతో విడాకులు తీసుకునే స్త్రీకి పరిహారంగా ఇచ్చే ధనం; 3, 4, 5 అక్షరాలతో యుద్ధం; 1, 5 అక్షరాలతో మదం, గర్వం.
పదం 3 క్లూస్:
1, 2, అక్షరాలతో కవిత్వం వ్రాసేవాడు; 1, 3 అక్షరాలతో స్వప్నం; 4, 5, 1 అక్షరాలతో దిన మాసపత్రికలలోని ఒక ప్రతి.
పదం 4 క్లూస్:
1, 5 అక్షరాలతో పువ్వు, చిగురు; 3, 4, 5 అక్షరాలతో మోసం, దగా; 1, 2 అక్షరాలతో ఇంపు, అందం.
పదం 5 క్లూస్:
1, 2, 3 అక్షరాలతో బ్రహ్మ; 1, 4, 2 అక్షరాలతో నాడులు; 3, 4, 2 అక్షరాలతో దేవతల వల్ల పొందే కోరికలు; 4, 5 అక్షరాలతో రాజుగారి భార్య.
పదం 6 క్లూస్:
1, 2 అక్షరాలతో వాయసము; 1, 3 అక్షరాలతో వేడి, సెగ; 1, 4, 5 అక్షరాలతో నీళ్ళు పారే మార్గం.
పదం 7 క్లూస్:
1, 4, 5 అక్షరాలతో తోట, అడవి; 4, 2, 4, 5 అక్షరాలతో ఆట, నృత్యము; 3, 4, 5 అక్షరాలతో ఆత్మాభిమానము, గౌరవము.
పదం 8 క్లూస్:
1, 5, 3 అక్షరాలతో ఇష్టం వచ్చినట్టు పాలించేవాడు; 3, 2 అక్షరాలతో జీవితకాలం; 4, 3 అక్షరాలతో లేఖనము.
పదం 9 క్లూస్:
1, 2 అక్షరాలతో పదిహేనవ నక్షత్రం; 3, 4, 5 అక్షరాలతో బొట్టు, చుక్క; 1, 4, 5 అక్షరాలతో తియ్యని రసం, కమ్మని.
పదం 10 క్లూస్:
1, 3, 4, 5 అక్షరాలతో పెదవి; 2, 3, 5 అక్షరాలతో ధ్వని; 2, 4, 5 అక్షరాలతో నీరు.
~
మీరు ఈ పజిల్‌ని పూరించి సమాధానాలను 2026 జూలై 07వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పద విన్యాసం-11 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 2026 జూలై 12వ తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.
~
పదవిన్యాసం-10 జవాబులు:
1) బడితపాఠం 2) బారుబడాయి 3) నరమేధము 4) గొడ్డుతెవులు 5) ఎలప్రాయము 6) ఆమనిచెలి 7) అడిమోహము 8) కలపడము 9) కమండలము 10) జలుబుకారు
~
పదవిన్యాసం-10 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అరుణరేఖ ముదిగొండ, హైదరాబాద్
- బయన కన్యాకుమారి, విజయవాడ
- భాగవతుల కృష్ణారావు, సికింద్రాబాద్
- సిహెచ్. వి. బృందావన రావు, అహమ్మదాబాదు
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు, హైదరాబాద్
- పి,వి. రాజు, హైదరాబాద్
- ఎస్. పూర్ణకుమారి, అంగలకుదురు
- శ్రీనివాసరావు సొంసాళె, ఎమ్మిగనూరు
- రంగావఝల శారద, హైదరాబాదు
- రామవరపు గిరిజాశంకర రావు, బెంగుళూరు
- శిష్ట్లా అనిత, బెంగుళురు
- తాతిరాజు జగం, బరంపురం (ఒడిసా)
- ఉషారాణి జి, తిరుపతి
వీరికి అభినందనలు.
~
గమనిక:
- ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
- పజిల్‌లో ఏవైనా సందేహాలు కలిగితే నిర్వాహకులు టి. రామలింగయ్య గారిని 7285938387 నెంబరులో, ramalingaihtadikonda@gmail.com అనే ఈమెయిల్లో సంప్రదించగలరు.
- పజిల్‌కు సంబంధించిన సందేహాలకు నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
ప్రకాశం జిల్లా ఒంగోలు నివాసి అయిన శ్రీ టి. రామలింగయ్య 2002లో ప్రభుత్వ ఉద్యోగిగా పదవీ విరమణ చేసి, విశ్రాంత జీవితం గడుపుతున్నారు. గళ్ళ నుడికట్టులు నింపటంలో ఆసక్తి ఉన్న రామలింగయ్య 1980 నుండి ఆంధ్రభూమి, ఆంధ్రప్రభలలోని ఫజిల్స్ పూరించి పంపేవారు. ప్రస్తుతము కాలక్షేపం కొరకు స్వయంగా ఫజిల్స్ తయారు చేస్తుంటారు. ఎవరిని అనుకరించిక స్వయంగా శబ్దార్థ చంద్రిక, తెలుగు అకాడమి నిఘంటువు లను అనుసరించి వ్రాస్తుంటారు.
సెల్: 7285938387
