
సంచికలో పజిల్స్ కోరుకునే పాఠకుల కోసం ‘పద విన్యాసం’ పేరిట, రెండు వారాలకి ఒకసారి వచ్చేలా, మరో పజిల్‌ని శ్రీ టి. రామలింగయ్య గారు అందిస్తున్నారు.
ఈ ఫీచర్‍లో రచయిత ఒక పదానికి క్లూస్ ఇస్తారు. దానిలో ఉన్న కొన్ని అక్షరాలతో అటుఇటూ మార్చినా లేదా పదాన్ని విడగొట్టినా ఏర్పడే కొత్త పదాలు ఏర్పడుతాయి. అటువంటి పదాల అర్థాలను నిర్వాహకులు సూచిస్తారు. వాటి ఆధారంగా రచయిత హింట్ ఇచ్చిన పదాన్ని పాఠకులు గుర్తించాలి.
ఈ క్రింది ఉదాహరణ చూడండి.
1, 2 అక్షరాలతో కేళి (ఆట), 3,4 అక్షరాలతో ధర, విలువ (వెల), 3,4,5 అక్షరాలతో ఆడుది (వెలది) పదాలు వస్తాయి.
అప్పుడు మూల పదం ‘ఆటవెలది’ అవుతుంది.
ఇటువంటి పది ప్రశ్నలు ఈ పజిల్‌లో ఉంటాయి.
~
ఈ వారం ప్రశ్నలు:
పదం 1 క్లూస్:
1, 2 అక్షరాలతో ఉత్తమ స్త్రీ, దుర్గ; 1, 4, 5 అక్షరాలతో ఏడు రోజులు; 3, 4, 5 అక్షరాలతో చెయ్యి.
పదం 2 క్లూస్:
3, 4, 5 అక్షరాలతో వంశము; 5, 2, 3 అక్షరాలతో జంతిక; 5, 2, 1 అక్షరాలతో చేతికి ధరించే కడియం.
పదం 3 క్లూస్:
1, 2, 3, 4 అక్షరాలతో నలభైయ్యో సంవత్సరం; 2, 4, 5 అక్షరాలతో ధ్వని, అరుపు; 3, 4, 5 అక్షరాలతో పుట్టుక.
పదం 4 క్లూస్:
1, 4 అక్షరాలతో ఎడమ, వామ; 1,2 అక్షరాలతో పట్టణం; 5, 3, 5 అక్షరాలతో సంతోషము.
పదం 5 క్లూస్:
1, 2, 5 అక్షరాలతో శివుడు; 4, 5 అక్షరాలతో తోటకాపు; 4, 3 అక్షరాలతో పూలదండీ; 2, 5, 1 అక్షరాలతో పాలించే స్త్రీ.
పదం 6 క్లూస్:
1, 2, 4, 5 అక్షరాలతో లేఖలు; 4, 5 అక్షరాలతో పడిపోవు, పడు; 1, 2, 3, 5 అక్షరాలతో మంచివారు.
పదం 7 క్లూస్:
1, 2 అక్షరాలతో ఎల్లప్పుడు; 3, 4, 5 అక్షరాలతో కృష్ణుని పెంచిన తండ్రి; 2, 3 అక్షరాలతో ఈవి, త్యాగం.
పదం 8 క్లూస్:
1, 2, 5 అక్షరాలతో అంతా, సమస్తము; 3, 4, 5 అక్షరాలతో మేలు; 1, 4 అక్షరాలతో ఏడు స౦ఖ్య.
పదం 9 క్లూస్:
1,5 అక్షరాలతో గర్వం; 4, 3, 5 అక్షరాలతో పెన్ను; 4, 2, 3, 5 అక్షరాలతో తామరపువ్వు; 2, 3 అక్షరాలతో కొండ.
పదం 10 క్లూస్:
1, 2, 3 అక్షరాలతో ధాన్యం నిలవ ఉంచడానికి తవ్విన గొయ్యి; 1, 2 అక్షరాలతో పురాతన; 4, 5, 3 అక్షరాలతో గుడ్డలు కత్తిరించే సాధనము.
~
మీరు ఈ పజిల్‌ని పూరించి సమాధానాలను 2026 ఆగస్ట్ 04వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పద విన్యాసం-13 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 2026 ఆగస్ట్ 09వ తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.
~
పదవిన్యాసం-12 జవాబులు:
1) అరదండాలు 2) ఊతపదము 3) పదాతిదళం 4) నోరు మెదపు 5) శర్క రజము 6) వయసుకాడు 7) మోటు సరసం 8) సరదాపడు 9) సరికడచు 10) తట్టు పునుగు
~
పదవిన్యాసం-12 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అరవ భాస్కర రావు, కలకత్తా.
- అరుణరేఖ ముదిగొండ, హైదరాబాద్
- బయన కన్యాకుమారి, విజయవాడ
- సిహెచ్.వి. బృందావన రావు, అహమ్మదాబాద్.
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు, హైదరాబాద్
- పి,వి. రాజు, హైదరాబాద్
- ఎస్. పూర్ణకుమారి, అంగలకుదురు
- శ్రీనివాసరావు సొంసాళె, ఎమ్మిగనూరు
- రంగావఝల శారద, హైదరాబాదు
- రామకూరు నాగేశ్వరరావు, శ్రీకాకుళం.
- రామవరపు గిరిజాశంకర రావు, బెంగుళూరు
- శంభర వెంకట రామ జోగారావు, బెంగుళూరు
- శిష్ట్లా అనిత, బెంగుళురు
- తాతిరాజు జగం, బరంపురం (ఒడిసా)
- ఉషారాణి జి, తిరుపతి
- డాక్టర్ వరలక్ష్మి హరవే, బెంగుళూరు
వీరికి అభినందనలు.
~
గమనిక:
- ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
- పజిల్‌లో ఏవైనా సందేహాలు కలిగితే నిర్వాహకులు టి. రామలింగయ్య గారిని 7285938387 నెంబరులో, ramalingaihtadikonda@gmail.com అనే ఈమెయిల్లో సంప్రదించగలరు.
- పజిల్‌కు సంబంధించిన సందేహాలకు నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
ప్రకాశం జిల్లా ఒంగోలు నివాసి అయిన శ్రీ టి. రామలింగయ్య 2002లో ప్రభుత్వ ఉద్యోగిగా పదవీ విరమణ చేసి, విశ్రాంత జీవితం గడుపుతున్నారు. గళ్ళ నుడికట్టులు నింపటంలో ఆసక్తి ఉన్న రామలింగయ్య 1980 నుండి ఆంధ్రభూమి, ఆంధ్రప్రభలలోని ఫజిల్స్ పూరించి పంపేవారు. ప్రస్తుతము కాలక్షేపం కొరకు స్వయంగా ఫజిల్స్ తయారు చేస్తుంటారు. ఎవరిని అనుకరించిక స్వయంగా శబ్దార్థ చంద్రిక, తెలుగు అకాడమి నిఘంటువు లను అనుసరించి వ్రాస్తుంటారు.
సెల్: 7285938387
