
సంచికలో పజిల్స్ కోరుకునే పాఠకుల కోసం ‘పద విన్యాసం’ పేరిట, రెండు వారాలకి ఒకసారి వచ్చేలా, మరో పజిల్ని శ్రీ టి. రామలింగయ్య గారు అందిస్తున్నారు.
ఈ ఫీచర్లో రచయిత ఒక పదానికి క్లూస్ ఇస్తారు. దానిలో ఉన్న కొన్ని అక్షరాలతో అటుఇటూ మార్చినా లేదా పదాన్ని విడగొట్టినా ఏర్పడే కొత్త పదాలు ఏర్పడుతాయి. అటువంటి పదాల అర్థాలను నిర్వాహకులు సూచిస్తారు. వాటి ఆధారంగా రచయిత హింట్ ఇచ్చిన పదాన్ని పాఠకులు గుర్తించాలి.
ఈ క్రింది ఉదాహరణ చూడండి.
1, 2 అక్షరాలతో కేళి (ఆట), 3,4 అక్షరాలతో ధర, విలువ (వెల), 3,4,5 అక్షరాలతో ఆడుది (వెలది) పదాలు వస్తాయి.
అప్పుడు మూల పదం ‘ఆటవెలది’ అవుతుంది.
ఇటువంటి పది ప్రశ్నలు ఈ పజిల్లో ఉంటాయి.
~
ఈ వారం ప్రశ్నలు:
పదం 1 క్లూస్:
1, 2 అక్షరాలతో చిన్న పిల్ల; 5,3 అక్షరాలతో ఒక దురద దుంప; 1, 4, 5 అక్షరాలతో కడియం, ఉంగరం.
పదం 2 క్లూస్:
1, 2 అక్షరాలతో పట్టుచీరలకు ప్రసిద్ధ నగరం; 3, 4, 5 అక్షరాలతో పట్టుచీరల నగర దేవత; 3, 4 అక్షరాలతో విరామచిహ్నం.
పదం 3 క్లూస్:
1, 2 అక్షరాలతో కందుకం; 3, 4, 5 అక్షరాలతో భుక్తి; 3, 2 అక్షరాలతో ఆరాటం, కోరిక.
పదం 4 క్లూస్:
1, 2 అక్షరాలతో ఎలుక; 3, 2 అక్షరాలతో చెవితమ్మె; 3, 4, 5 అక్షరాలతో శిల, రాయి.
పదం 5 క్లూస్:
1, 2, 3 అక్షరాలతో పంటచేలో రాలిన వెన్ను; 1, 3 అక్షరాలతో కక్ష, కోపము; 3, 4, 5 అక్షరాలతో లెక్కల శాస్త్రము.
పదం 6 క్లూస్:
1, 2 అక్షరాలతో చెరగడానికి ఉపయోగించే సాధనం; 3, 2 అక్షరాలతో దిక్కు, దారి; 3, 4, 5 అక్షరాలతో కౌరవుల, పాండవుల చరిత్ర.
పదం 7 క్లూస్:
1, 2, 3 అక్షరాలతో దండ, జలతారు; 5, 3 అక్షరాలతో విరోధం, కక్ష; 4, 3 అక్షరాలతో పురుష జాతి; 5, 1 అక్షరాలతో చేవ.
పదం 8 క్లూస్:
1, 2, 3 అక్షరాలతో ఆవిరిపోకుండా కుండమూతకి కట్టిన గుడ్డ; 1, 3 అక్షరాలతో వర్షం; 1, 4, 5 అక్షరాలతో నోరుమూత.
పదం 9 క్లూస్:
1, 2, 5 అక్షరాలతో నాడి; 3, 5 అక్షరాలతో మీరు కాదు; 3, 2 అక్షరాలతో హద్దు; 3, 4 అక్షరాలతో బుద్ధి, తెలివి.
పదం 10 క్లూస్:
1, 2 అక్షరాలతో నఖము; 1, 5 అక్షరాలతో బాధ, దుఃఖము; 2, 3 అక్షరాలతో చవి; 3, 4 అక్షరాలతో మెలిక.
~
మీరు ఈ పజిల్ని పూరించి సమాధానాలను 2026 ఆగస్ట్ 18వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్లో ‘పద విన్యాసం-14 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 2026 ఆగస్ట్ 23వ తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.
~
పదవిన్యాసం-13 జవాబులు:
1) వామకరము 2) గురుకులము 3) పరాభవము 4) పురందరము 5) కపాలమాలి 6) ఉత్తమురాలు 7) సదానందుడు 8) సర్వహితము 9) ఆమలకము 10) పాతరకత్తె
~
పదవిన్యాసం-13 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అరవ భాస్కర రావు, కలకత్తా.
- అరుణరేఖ ముదిగొండ, హైదరాబాద్
- బయన కన్యాకుమారి, విజయవాడ
- సిహెచ్.వి. బృందావన రావు, అహమ్మదాబాద్.
- గండ్లూరి జగన్మోహన రావు, ఖమ్మం
- పి,వి. రాజు, హైదరాబాద్
- ఎస్. పూర్ణకుమారి, అంగలకుదురు
- శ్రీనివాసరావు సొంసాళె, ఎమ్మిగనూరు
- రంగావఝల శారద, హైదరాబాదు
- రామకూరు నాగేశ్వరరావు, శ్రీకాకుళం.
- రామవరపు గిరిజాశంకర రావు, బెంగుళూరు
- శంభర వెంకట రామ జోగారావు, బెంగుళూరు
- శిష్ట్లా అనిత, బెంగుళురు
- ఎస్. ఎస్. షా, పటాన్చెరువు
- తాతిరాజు జగం, బరంపురం (ఒడిసా)
- ఉషారాణి జి, తిరుపతి
- వర్ధని మాదిరాజు, బెంగుళూరు
వీరికి అభినందనలు.
~
గమనిక:
- ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
- పజిల్లో ఏవైనా సందేహాలు కలిగితే నిర్వాహకులు టి. రామలింగయ్య గారిని 7285938387 నెంబరులో, ramalingaihtadikonda@gmail.com అనే ఈమెయిల్లో సంప్రదించగలరు.
- పజిల్‌కు సంబంధించిన సందేహాలకు నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
ప్రకాశం జిల్లా ఒంగోలు నివాసి అయిన శ్రీ టి. రామలింగయ్య 2002లో ప్రభుత్వ ఉద్యోగిగా పదవీ విరమణ చేసి, విశ్రాంత జీవితం గడుపుతున్నారు. గళ్ళ నుడికట్టులు నింపటంలో ఆసక్తి ఉన్న రామలింగయ్య 1980 నుండి ఆంధ్రభూమి, ఆంధ్రప్రభలలోని ఫజిల్స్ పూరించి పంపేవారు. ప్రస్తుతము కాలక్షేపం కొరకు స్వయంగా ఫజిల్స్ తయారు చేస్తుంటారు. ఎవరిని అనుకరించిక స్వయంగా శబ్దార్థ చంద్రిక, తెలుగు అకాడమి నిఘంటువు లను అనుసరించి వ్రాస్తుంటారు.
సెల్: 7285938387
