
సంచికలో పజిల్స్ కోరుకునే పాఠకుల కోసం ‘పద విన్యాసం’ పేరిట, రెండు వారాలకి ఒకసారి వచ్చేలా, మరో పజిల్‌ని శ్రీ టి. రామలింగయ్య గారు అందిస్తున్నారు.
ఈ ఫీచర్‍లో రచయిత ఒక పదానికి క్లూస్ ఇస్తారు. దానిలో ఉన్న కొన్ని అక్షరాలతో అటుఇటూ మార్చినా లేదా పదాన్ని విడగొట్టినా ఏర్పడే కొత్త పదాలు ఏర్పడుతాయి. అటువంటి పదాల అర్థాలను నిర్వాహకులు సూచిస్తారు. వాటి ఆధారంగా రచయిత హింట్ ఇచ్చిన పదాన్ని పాఠకులు గుర్తించాలి.
ఈ క్రింది ఉదాహరణ చూడండి.
1, 2 అక్షరాలతో కేళి (ఆట), 3,4 అక్షరాలతో ధర, విలువ (వెల), 3,4,5 అక్షరాలతో ఆడుది (వెలది) పదాలు వస్తాయి.
అప్పుడు మూల పదం ‘ఆటవెలది’ అవుతుంది.
ఇటువంటి పది ప్రశ్నలు ఈ పజిల్‌లో ఉంటాయి.
~
ఈ వారం ప్రశ్నలు:
పదం 1 క్లూస్:
1, 2, 3 అక్షరాలతో నూనె, రసం తీ సేయంత్రం; 4,5 అక్షరాలతో బియ్యం మొదలగువాని పొడి; 2, 5 అక్షరాలతో మాట, వాక్యం.
పదం 2 క్లూస్:
1, 2 అక్షరాలతో గోచి; 3, 4, 5 అక్షరాలతో ఉప్పు; 1, 3, 4 అక్షరాలతో నీరు పారే మార్గం.
పదం 3 క్లూస్:
1, 2, 3 అక్షరాలతో కష్టం, నింద; 4, 5 అక్షరాలతో పోవడం, వక్క; 3, 4 అక్షరాలతో అన్ని బస్సులు ఆగే చోటు.
పదం 4 క్లూస్:
1, 2, 3 అక్షరాలతో పండ్రెండవ నక్షత్రం; 4, 5 అక్షరాలతో పదిహేను రోజుల కాలం; 1, 2 అక్షరాలతో కల్పితం, వట్టిది.
పదం 5 క్లూస్:
1, 2 అక్షరాలతో వంద, నూరు; 3, 4, 5 అక్షరాలతో ఆత్యాభిమానం, గౌరవము; 3, 2 అక్షరాలతో తల్లి.
పదం 6 క్లూస్:
1, 2, 3 అక్షరాలతో ఎండబెట్టిన కాయ ముక్కలు; 4, 5 అక్షరాలతో మత్స్యము; 5, 2, 3 అక్షరాలతో పరుగెత్తడం, ఉఱకడం.
పదం 7 క్లూస్:
1, 2, 5 అక్షరాలతో నమస్కారం, మొక్కు; 4, 3 అక్షరాలతో మోసం; 1, 3, 5 అక్షరాలతో కన్ను.
పదం 8 క్లూస్:
1, 2, 3 అక్షరాలతో పానుపు,శయ్య; 3, 4 అక్షరాలతో నడుము; 3, 2, 1 అక్షరాలతో రాయలసీమ లోని ఒక జిల్లా పేరు; 3, 5 అక్షరాలతో మద్యము.
పదం 9 క్లూస్:
1, 2 అక్షరాలతో కొండ; 3, 4, 5 అక్షరాలతో శివుడు; 1, 4, 5 అక్షరాలతో మన్మథుడు.
పదం 10 క్లూస్:
1, 2 అక్షరాలతో ఉన్మాదము. పిచ్చి; 3, 4, 5 అక్షరాలతో పైరులకు పట్టే చీడ; 4, 1 అక్షరాలతో లక్ష్యము.
~
మీరు ఈ పజిల్‌ని పూరించి సమాధానాలను 2026 సెప్టెంబర్ 15వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పద విన్యాసం-16 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 2026 సెప్టెంబర్ 20వ తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.
~
పదవిన్యాసం-15 జవాబులు:
1) పీతనడక 2) బీటలువారు 3) ముగుదతనం 4) మొలకనవ్వు 5) వితండవాదం 6) ముట్టడివేయు 7) ఇలాతికాయ 8) కారుమొగులు 9) తగవులాడు 10) అల్లరిమూక
~
పదవిన్యాసం-15 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అరవ భాస్కర రావు, కలకత్తా.
- అరుణరేఖ ముదిగొండ, హైదరాబాద్
- బయన కన్యాకుమారి, విజయవాడ
- సిహెచ్.వి. బృందావన రావు, అహమ్మదాబాద్.
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు, హైదరాబాద్
- గండ్లూరి జగన్మోహన రావు, ఖమ్మం
- పి. వి. రాజు, హైదరాబాద్
- శ్రీనివాసరావు సొంసాళె, ఎమ్మిగనూరు
- రంగావఝల శారద, హైదరాబాదు
- రామకూరు నాగేశ్వరరావు, శ్రీకాకుళం.
- రామవరపు గిరిజాశంకర రావు, బెంగుళూరు
- శంభర వెంకట రామ జోగారావు, బెంగుళూరు
- శిష్ట్లా అనిత, బెంగుళురు
- తాతిరాజు జగం, బరంపురం (ఒడిసా)
- ఉషారాణి జి, తిరుపతి
- డాక్టర్ వరలక్ష్మి హరవే, బెంగుళూరు
- జాకిర్ హుస్సేన్, ఎమ్.ఎమ్.డి., ఆదోని
వీరికి అభినందనలు.
~
గమనిక:
- ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
- పజిల్‌లో ఏవైనా సందేహాలు కలిగితే నిర్వాహకులు టి. రామలింగయ్య గారిని 7285938387 నెంబరులో, ramalingaihtadikonda@gmail.com అనే ఈమెయిల్లో సంప్రదించగలరు.
- పజిల్‌కు సంబంధించిన సందేహాలకు నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
ప్రకాశం జిల్లా ఒంగోలు నివాసి అయిన శ్రీ టి. రామలింగయ్య 2002లో ప్రభుత్వ ఉద్యోగిగా పదవీ విరమణ చేసి, విశ్రాంత జీవితం గడుపుతున్నారు. గళ్ళ నుడికట్టులు నింపటంలో ఆసక్తి ఉన్న రామలింగయ్య 1980 నుండి ఆంధ్రభూమి, ఆంధ్రప్రభలలోని ఫజిల్స్ పూరించి పంపేవారు. ప్రస్తుతము కాలక్షేపం కొరకు స్వయంగా ఫజిల్స్ తయారు చేస్తుంటారు. ఎవరిని అనుకరించిక స్వయంగా శబ్దార్థ చంద్రిక, తెలుగు అకాడమి నిఘంటువు లను అనుసరించి వ్రాస్తుంటారు.
సెల్: 7285938387
