Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పద విన్యాసం-17

సంచికలో పజిల్స్ కోరుకునే పాఠకుల కోసం ‘పద విన్యాసం’ పేరిట, రెండు వారాలకి ఒకసారి వచ్చేలా, మరో పజిల్‌ని శ్రీ టి. రామలింగయ్య గారు అందిస్తున్నారు.

ఈ ఫీచర్‍లో రచయిత ఒక పదానికి క్లూస్ ఇస్తారు. దానిలో ఉన్న కొన్ని అక్షరాలతో అటుఇటూ మార్చినా లేదా పదాన్ని విడగొట్టినా ఏర్పడే కొత్త పదాలు ఏర్పడుతాయి. అటువంటి పదాల అర్థాలను నిర్వాహకులు సూచిస్తారు. వాటి ఆధారంగా రచయిత హింట్ ఇచ్చిన పదాన్ని పాఠకులు గుర్తించాలి.

ఈ క్రింది ఉదాహరణ చూడండి.

1, 2 అక్షరాలతో కేళి (ఆట), 3,4 అక్షరాలతో ధర, విలువ (వెల), 3,4,5 అక్షరాలతో ఆడుది (వెలది) పదాలు వస్తాయి.

అప్పుడు మూల పదం ‘ఆటవెలది’ అవుతుంది.

ఇటువంటి పది ప్రశ్నలు ఈ పజిల్‌లో ఉంటాయి.

~

ఈ వారం ప్రశ్నలు:

పదం 1 క్లూస్:

1, 2, 5 అక్షరాలతో చావులేని; 4, 5 అక్షరాలతో పట్టణం; 2, 3, 5 అక్షరాలతో గాజుల గుది.

పదం 2 క్లూస్:

1, 4 అక్షరాలతో పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం; 3, 2, 5 అక్షరాలతో త్రాగుట; 3, 4 అక్షరాలతో గిన్నె, నాటకంలో వేషం.

పదం 3 క్లూస్:

1, 4, 5 అక్షరాలతో సూర్యుడు, శూరుడు; 2, 4, 5 అక్షరాలతో ఇతరుడు; 3, 4 అక్షరాలతో స్రవించు, నాలుగు చక్రాల వాహనం.

పదం 4 క్లూస్:

3, 4, 5 అక్షరాలతో జ్ఞాపకం లేకపోవడం; 1, 4 అక్షరాలతో వేరొకటి, బదులు; 1, 2 అక్షరాలతో శరీరం, మార్గం; 1, 3 అక్షరాలతో నేను.

పదం 5 క్లూస్:

1, 2, 5 అక్షరాలతో మబ్బు; 3, 4, 5 అక్షరాలతో దారి త్రోవ; 1, 5 అక్షరాలతో మీరు కాదు; 3, 2, 5 అక్షరాలతో తెలుగు మాసములలో 11వ మాసము.

పదం 6 క్లూస్:

1, 2 అక్షరాలతో కోతి; 3, 4, 1, 5 అక్షరాలతో మామిడి; 5, 4, 1 అక్షరాలతో కోరాగుడ్డ, మోటైన.

పదం 7 క్లూస్:

1, 2, 3 అక్షరాలతో మీనాక్షినగరం; 3, 4, 5 అక్షరాలతో చారు, పసరు; 1, 3 అక్షరాలతో యంత్రము.

పదం 8 క్లూస్:

1, 2 అక్షరాలతో పార్వతి; 3, 4, 5 అక్షరాలతో గట్టిపడిన ముద్ద; 3, 2, 4 అక్షరాలతో కాగితపు సంచి.

పదం 9 క్లూస్:

1, 2, 3 అక్షరాలతో నివ్వెరపాటు; 4, 5 అక్షరాలతో రాలు, పడిపోవు; 4, 2, 3 అక్షరాలతో బెల్టు.

పదం 10 క్లూస్:

1, 3, 4 అక్షరాలతో కొలను; 1, 2 అక్షరాలతో అన్నీ, మొత్తం; 1, 3, 4, 5 అక్షరాలతో రసికుడు, సహృదయుడు.

~

మీరు ఈ పజిల్‌ని పూరించి సమాధానాలను 2026 సెప్టెంబర్ 29వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పద విన్యాసం-17 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 2026 అక్టోబర్ 04వ తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.

~

పదవిన్యాసం-16 జవాబులు:

1) గానుగ పిండి 2) కాచలవణం 3) ఆరడిపోక 4) ఉత్తర పక్షం 5) శతమానము 6) వరుగు చేప 7) నమయమానం 8) పడకటిల్లు 9) మలహరుడు 10) రిమ్మతెగులు

~

పదవిన్యాసం-16 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

~

గమనిక:

Exit mobile version