Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పద విన్యాసం-18

సంచికలో పజిల్స్ కోరుకునే పాఠకుల కోసం ‘పద విన్యాసం’ పేరిట, రెండు వారాలకి ఒకసారి వచ్చేలా, మరో పజిల్‌ని శ్రీ టి. రామలింగయ్య గారు అందిస్తున్నారు.

ఈ ఫీచర్‍లో రచయిత ఒక పదానికి క్లూస్ ఇస్తారు. దానిలో ఉన్న కొన్ని అక్షరాలతో అటుఇటూ మార్చినా లేదా పదాన్ని విడగొట్టినా ఏర్పడే కొత్త పదాలు ఏర్పడుతాయి. అటువంటి పదాల అర్థాలను నిర్వాహకులు సూచిస్తారు. వాటి ఆధారంగా రచయిత హింట్ ఇచ్చిన పదాన్ని పాఠకులు గుర్తించాలి.

ఈ క్రింది ఉదాహరణ చూడండి.

1, 2 అక్షరాలతో కేళి (ఆట), 3,4 అక్షరాలతో ధర, విలువ (వెల), 3,4,5 అక్షరాలతో ఆడుది (వెలది) పదాలు వస్తాయి.

అప్పుడు మూల పదం ‘ఆటవెలది’ అవుతుంది.

ఇటువంటి పది ప్రశ్నలు ఈ పజిల్‌లో ఉంటాయి.

~

ఈ వారం ప్రశ్నలు:

పదం 1 క్లూస్:

1, 3 అక్షరాలతో ముసలితనం; 1, 2, 5 అక్షరాలతో ప్రజలు; 2, 3, 5 అక్షరాలతో నాడి; 3, 4, 5 అక్షరాలతో ధ్వని, శబ్దము.

పదం 2 క్లూస్:

1, 2, 3 అక్షరాలతో మొసలి; 4, 5 అక్షరాలతో జాలము; 4,3 అక్షరాలతో ఒక మాగాణి పంట; 2, 3 అక్షరాలతో ఏనుగు.

పదం 3 క్లూస్:

4, 5 అక్షరాలతో వాన; 2, 3, 4 అక్షరాలతో నీరు పారేమార్గం; 1, 3 అక్షరాలతో తరంగము.

పదం 4 క్లూస్:

1, 4 అక్షరాలతో స్వప్నము; 3, 4, 5 అక్షరాలతో సమయము; 1, 2 అక్షరాలతో చివర; 3, 1 అక్షరాలతో వేడి.

పదం 5 క్లూస్:

1, 2 అక్షరాలతో అడవి; 4, 5 అక్షరాలతో ఎండిపోవు; 1, 2, 3 అక్షరాలతో చూడని; 4, 2 అక్షరాలతో వర్షం.

పదం 6 క్లూస్:

4, 3 అక్షరాలతో జరుగుతున్న యుగం; 4, 5 అక్షరాలతో నేత్రము; 1, 2, 3 అక్షరాలతో మయూరము.

పదం 7 క్లూస్:

1,3, 5 అక్షరాలతో ఆకు; 3, 1 అక్షరాలతో సిగ్గు; 4, 2 అక్షరాలతో కవిత్వము రాసేవాడు.

పదం 8 క్లూస్:

1, 2, 3 అక్షరాలతో వెనుకటి బాకి; 2, 5 అక్షరాలతో నాలుగు చక్రాల వాహనం; 4, 3 అక్షరాలతో దాపు, సమీపము.

పదం 9 క్లూస్:

1, 2 అక్షరాలతో ఉపకులం; 1, 4, 5 అక్షరాలతో మన రాష్ట్ర భాష; 1, 5, 4 అక్షరాలతో పైరుకు పట్టే చీడ; 3, 4, 5 అక్షరాలతో గర్వము.

పదం 10 క్లూస్:

5, 2, 3 అక్షరాలతో కుండ; 1, 2, 3 అక్షరాలతో దారి, మార్గము; 3, 2 అక్షరాలతో గారె; 1, 4 అక్షరాలతో మధ్యము.

~

మీరు ఈ పజిల్‌ని పూరించి సమాధానాలను 2026 అక్టోబర్ 13వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పద విన్యాసం-18 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 2026 అక్టోబర్ 18వ తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.

~

పదవిన్యాసం-17 జవాబులు:

1) అమలాపురం 2) యానపాత్రము 3) సూపకారుడు 4) మయిమరుపు 5) మేఘమార్గము 6) కపిచూతము 7) మధురసము 8) శివకరుడు 9) తటకాపడు 10) సర్వరసుడు

~

పదవిన్యాసం-17 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

~

గమనిక:

Exit mobile version