
సంచికలో పజిల్స్ కోరుకునే పాఠకుల కోసం ‘పద విన్యాసం’ పేరిట, రెండు వారాలకి ఒకసారి వచ్చేలా, మరో పజిల్ని శ్రీ టి. రామలింగయ్య గారు అందిస్తున్నారు.
ఈ ఫీచర్లో రచయిత ఒక పదానికి క్లూస్ ఇస్తారు. దానిలో ఉన్న కొన్ని అక్షరాలతో అటుఇటూ మార్చినా లేదా పదాన్ని విడగొట్టినా ఏర్పడే కొత్త పదాలు ఏర్పడుతాయి. అటువంటి పదాల అర్థాలను నిర్వాహకులు సూచిస్తారు. వాటి ఆధారంగా రచయిత హింట్ ఇచ్చిన పదాన్ని పాఠకులు గుర్తించాలి.
ఈ క్రింది ఉదాహరణ చూడండి.
1, 2 అక్షరాలతో కేళి (ఆట), 3,4 అక్షరాలతో ధర, విలువ (వెల), 3,4,5 అక్షరాలతో ఆడుది (వెలది) పదాలు వస్తాయి.
అప్పుడు మూల పదం ‘ఆటవెలది’ అవుతుంది.
ఇటువంటి పది ప్రశ్నలు ఈ పజిల్లో ఉంటాయి.
~
ఈ వారం ప్రశ్నలు:
పదం 1 క్లూస్:
1, 2 అక్షరాలతో ఔషదం; 3, 4 అక్షరాలతో కొత్త కాదు; 3, 2 అక్షరాలతో చెట్టూ చుట్టూ త్రవ్వే కుదురు;
3, 4, 5 అక్షరాలతో ధాన్యం ఉంచడానికి భూమిని త్రవ్విన గొయ్యి.
పదం 2 క్లూస్:
1, 2 అక్షరాలతో రక్షణ, కాయలు కాయడం; 2, 3, 5 అక్షరాలతో జాతాశౌచం; 2 3, 4, 5 అక్షరాలతో మగవాడు.
పదం 3 క్లూస్:
1, 2, 5 అక్షరాలతో పుణ్యం కాదు; 3, 4, 5 అక్షరాలతో ప్రపంచము; 2, 4 అక్షరాలతో విరోధం, కక్ష; 1, 2 అక్షరాలతో చిన్నబాలిక.
పదం 4 క్లూస్:
1, 2, 3 అక్షరాలతో కాటకం, క్షామం; 4, 5 అక్షరాలతో కూలితో పాటు అదనంగా యిచ్చే డబ్బు;
1, 3, 2 అక్షరాలతో ముదురు రంగు.
పదం 5 క్లూస్:
1, 2, 3 అక్షరాలతో ఒక రకమైన చర్మ వ్యాధి, పద్మం; 2, 3 అక్షరాలతో యంత్రం; 4, 5 అక్షరాలతో స్నేహితురాలు; 4, 3 అక్షరాలతో కారాగారం.
పదం 6 క్లూస్:
1, 2, 3 అక్షరాలతో నూతిరాట్నం, పొట్టిది; 4, 5 అక్షరాలతో నుయ్యి; 4, 2 అక్షరాలతో రెండు చేతులు
అడ్డంగా చాపిన కొలత.
పదం 7 క్లూస్:
1, 2, 3 అక్షరాలతో వంటిల్లు; 4, 3 అక్షరాలతో పొడవాటి వెదురుబొంగు; 4, 5 అక్షరాలతో ఉపయోగించు.
పదం 8 క్లూస్:
1, 2, 3 అక్షరాలతో ధవళం; 4, 5 అక్షరాలతో వర్ణం; 1, 5, 2 అక్షరాలతో చీడ.
పదం 9 క్లూస్:
1, 4, 5 అక్షరాలతో బాణము; 1, 2 అక్షరాలతో కాకి వాహనదారుడు; 3, 4, 5 అక్షరాలతో ఏడు రోజుల కాలం.
పదం 10 క్లూస్:
2, 1, 5 అక్షరాలతో భిన్నంలో పై భాగము; 3, 2 అక్షరాలతో ఒక షెడ్యూలు కులం, దండ; 1, 4, 5 అక్షరాలతో తోట, అడవి.
~
మీరు ఈ పజిల్ని పూరించి సమాధానాలను 2026 అక్టోబర్ 27వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్లో ‘పద విన్యాసం-19 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 2026 నవంబర్ 01వ తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.
~
పదవిన్యాసం-18 జవాబులు:
1) జనరవము 2) మకరివల 3) అకాలవర్షం 4) కడకాలము 5) కాననివాడు 6) నెమలి కన్ను 7) పవిత్రకము 8) బకాయిదారు 9) తెగనీలుగు 10) నడవడిక
~
పదవిన్యాసం-17 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అరవ భాస్కర రావు, కలకత్తా.
- అరుణరేఖ ముదిగొండ, హైదరాబాద్
- బయన కన్యాకుమారి, విజయవాడ
- సిహెచ్.వి. బృందావన రావు, అహమ్మదాబాదు
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు, హైదరాబాద్.
- గండ్లూరి జగన్మోహన రావు, ఖమ్మం
- ప్రవీణ డా.
- పి. వి. రాజు, హైదరాబాద్
- శ్రీనివాసరావు సొంసాళె, ఎమ్మిగనూరు
- రంగావఝల శారద, హైదరాబాదు.
- రామకూరు నాగేశ్వరరావు, శ్రీకాకుళం.
- రామవరపు గిరిజాశంకర రావు, బెంగుళూరు
- శిష్ట్లా అనిత, బెంగళూరు
- శంభర వెంకట రామ జోగారావు, బెంగుళూరు
- ఉషారాణి జి, తిరుపతి
- వర్ధని మాదిరాజు, బెంగుళూరు
- జాకిర్ హుస్సేన్, ఎమ్.ఎమ్.డి., ఆదోని
వీరికి అభినందనలు.
~
గమనిక:
- ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
- పజిల్లో ఏవైనా సందేహాలు కలిగితే నిర్వాహకులు టి. రామలింగయ్య గారిని 7285938387 నెంబరులో, ramalingaihtadikonda@gmail.com అనే ఈమెయిల్లో సంప్రదించగలరు.
- పజిల్‌కు సంబంధించిన సందేహాలకు నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
ప్రకాశం జిల్లా ఒంగోలు నివాసి అయిన శ్రీ టి. రామలింగయ్య 2002లో ప్రభుత్వ ఉద్యోగిగా పదవీ విరమణ చేసి, విశ్రాంత జీవితం గడుపుతున్నారు. గళ్ళ నుడికట్టులు నింపటంలో ఆసక్తి ఉన్న రామలింగయ్య 1980 నుండి ఆంధ్రభూమి, ఆంధ్రప్రభలలోని ఫజిల్స్ పూరించి పంపేవారు. ప్రస్తుతము కాలక్షేపం కొరకు స్వయంగా ఫజిల్స్ తయారు చేస్తుంటారు. ఎవరిని అనుకరించిక స్వయంగా శబ్దార్థ చంద్రిక, తెలుగు అకాడమి నిఘంటువు లను అనుసరించి వ్రాస్తుంటారు.
సెల్: 7285938387
