Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పద విన్యాసం-19

సంచికలో పజిల్స్ కోరుకునే పాఠకుల కోసం ‘పద విన్యాసం’ పేరిట, రెండు వారాలకి ఒకసారి వచ్చేలా, మరో పజిల్‌ని శ్రీ టి. రామలింగయ్య గారు అందిస్తున్నారు.

ఈ ఫీచర్‍లో రచయిత ఒక పదానికి క్లూస్ ఇస్తారు. దానిలో ఉన్న కొన్ని అక్షరాలతో అటుఇటూ మార్చినా లేదా పదాన్ని విడగొట్టినా ఏర్పడే కొత్త పదాలు ఏర్పడుతాయి. అటువంటి పదాల అర్థాలను నిర్వాహకులు సూచిస్తారు. వాటి ఆధారంగా రచయిత హింట్ ఇచ్చిన పదాన్ని పాఠకులు గుర్తించాలి.

ఈ క్రింది ఉదాహరణ చూడండి.

1, 2 అక్షరాలతో కేళి (ఆట), 3,4 అక్షరాలతో ధర, విలువ (వెల), 3,4,5 అక్షరాలతో ఆడుది (వెలది) పదాలు వస్తాయి.

అప్పుడు మూల పదం ‘ఆటవెలది’ అవుతుంది.

ఇటువంటి పది ప్రశ్నలు ఈ పజిల్‌లో ఉంటాయి.

~

ఈ వారం ప్రశ్నలు:

పదం 1 క్లూస్:

1, 2 అక్షరాలతో ఔషదం; 3, 4 అక్షరాలతో కొత్త కాదు; 3, 2 అక్షరాలతో చెట్టూ చుట్టూ త్రవ్వే కుదురు;

3, 4, 5 అక్షరాలతో ధాన్యం ఉంచడానికి భూమిని త్రవ్విన గొయ్యి.

పదం 2 క్లూస్:

1, 2 అక్షరాలతో రక్షణ, కాయలు కాయడం; 2, 3, 5 అక్షరాలతో జాతాశౌచం; 2 3, 4, 5 అక్షరాలతో మగవాడు.

పదం 3 క్లూస్:

1, 2, 5 అక్షరాలతో పుణ్యం కాదు; 3, 4, 5 అక్షరాలతో ప్రపంచము; 2, 4 అక్షరాలతో విరోధం, కక్ష; 1, 2 అక్షరాలతో చిన్నబాలిక.

పదం 4 క్లూస్:

1, 2, 3  అక్షరాలతో కాటకం, క్షామం; 4, 5 అక్షరాలతో కూలితో పాటు అదనంగా యిచ్చే డబ్బు;

1, 3, 2 అక్షరాలతో ముదురు రంగు.

పదం 5 క్లూస్:

1, 2, 3 అక్షరాలతో ఒక రకమైన చర్మ వ్యాధి, పద్మం; 2, 3 అక్షరాలతో యంత్రం; 4, 5 అక్షరాలతో స్నేహితురాలు; 4, 3 అక్షరాలతో కారాగారం.

పదం 6 క్లూస్:

1, 2, 3 అక్షరాలతో నూతిరాట్నం, పొట్టిది; 4, 5 అక్షరాలతో నుయ్యి; 4, 2 అక్షరాలతో రెండు చేతులు

అడ్డంగా చాపిన కొలత.

పదం 7 క్లూస్:

1, 2, 3 అక్షరాలతో వంటిల్లు; 4, 3 అక్షరాలతో పొడవాటి వెదురుబొంగు; 4, 5 అక్షరాలతో ఉపయోగించు.

పదం 8 క్లూస్:

1, 2, 3 అక్షరాలతో ధవళం; 4, 5 అక్షరాలతో వర్ణం; 1, 5, 2 అక్షరాలతో చీడ.

పదం 9 క్లూస్:

1, 4, 5 అక్షరాలతో బాణము; 1, 2 అక్షరాలతో కాకి వాహనదారుడు; 3, 4, 5 అక్షరాలతో ఏడు రోజుల కాలం.

పదం 10 క్లూస్:

2, 1, 5 అక్షరాలతో భిన్నంలో పై భాగము; 3, 2 అక్షరాలతో ఒక షెడ్యూలు కులం, దండ; 1, 4, 5 అక్షరాలతో తోట, అడవి.

~

మీరు ఈ పజిల్‌ని పూరించి సమాధానాలను 2026 అక్టోబర్ 27వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పద విన్యాసం-19 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 2026 నవంబర్ 01వ తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.

~

పదవిన్యాసం-18 జవాబులు:

1) జనరవము 2) మకరివల 3) అకాలవర్షం 4) కడకాలము 5) కాననివాడు 6) నెమలి కన్ను 7) పవిత్రకము 8) బకాయిదారు 9) తెగనీలుగు 10) నడవడిక

~

పదవిన్యాసం-17 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

~

గమనిక:

Exit mobile version