
సంచికలో పజిల్స్ కోరుకునే పాఠకుల కోసం ‘పద విన్యాసం’ పేరిట, రెండు వారాలకి ఒకసారి వచ్చేలా, మరో పజిల్‌ని శ్రీ టి. రామలింగయ్య గారు అందిస్తున్నారు.
ఈ ఫీచర్‍లో రచయిత ఒక పదానికి క్లూస్ ఇస్తారు. దానిలో ఉన్న కొన్ని అక్షరాలతో అటుఇటూ మార్చినా లేదా పదాన్ని విడగొట్టినా ఏర్పడే కొత్త పదాలు ఏర్పడుతాయి. అటువంటి పదాల అర్థాలను నిర్వాహకులు సూచిస్తారు. వాటి ఆధారంగా రచయిత హింట్ ఇచ్చిన పదాన్ని పాఠకులు గుర్తించాలి.
ఈ క్రింది ఉదాహరణ చూడండి.
1, 2 అక్షరాలతో కేళి (ఆట), 3,4 అక్షరాలతో ధర, విలువ (వెల), 3,4,5 అక్షరాలతో ఆడుది (వెలది) పదాలు వస్తాయి.
అప్పుడు మూల పదం ‘ఆటవెలది’ అవుతుంది.
ఇటువంటి పది ప్రశ్నలు ఈ పజిల్‌లో ఉంటాయి.
~
ఈ వారం ప్రశ్నలు:
పదం 1 క్లూస్:
1, 2, అక్షరాలతో భారతంనకు మరో పేరు; 3, 2, అక్షరాలతో చీలిక, నదిని చీలినది; 3, 4 అక్షరాలతో క్షీరము; 3, 4, 5 అక్షరాలతో కాపాడేవాడు.
పదం 2 క్లూస్:
1, 2, 3 అక్షరాలతో రాబడి; 4, 5 అక్షరాలతో సుంకము, పన్ను; 1, 3 అక్షరాలతో ఆయువుపట్టు.
పదం 3 క్లూస్:
1, 2, 3, 5 అక్షరాలతో విరేచనము; 1, 3, 4, 5 అక్షరాలతో బెల్లంతో నీళ్ళ పానీయం; 1, 4 అక్షరాలతో గుడిసె, కుటీరం.
పదం 4 క్లూస్:
3, 4, 5 అక్షరాలతో ఏడు రోజులు; 1, 4, 5 అక్షరాలతో వేరైన, బండినొగ; 5, 2 అక్షరాలతో నడకలో కులుకు.
పదం 5 క్లూస్:
1, 2, 3 అక్షరాలతో డాగు; 4, 2, 3 అక్షరాలతో పొల్లుధాన్యం; 1, 4, 5 అక్షరాలతో జాతి, కులము; 4, 1, 5 అక్షరాలతో చీకటి.
పదం 6 క్లూస్:
1, 2, 3 అక్షరాలతో మహారాష్ట్ర నివాసి; 4, 5 అక్షరాలతో విచ్చని పువ్వు; 4, 3, 1 అక్షరాలతో యవ్వనంలో ముఖంపై లేచే పొక్కు.
పదం 7 క్లూస్:
1, 2, 3 అక్షరాలతో రామ భక్తురాలు; 4, 5 అక్షరాలతో కొండ; 1, 2, 5 అక్షరాలతో కామధేనువు.
పదం 8 క్లూస్:
1, 2 అక్షరాలతో శివుని వాహనం; 3, 4, 5 అక్షరాలతో పెరుగుదల; 3, 5 అక్షరాలతో తోట.
పదం 9 క్లూస్:
1, 2 అక్షరాలతో కొమ్మలు లేని చెట్టు; 3, 4, 5 అక్షరాలతో జీవితం; 1, 5 అక్షరాలతో లావు త్రాడు.
పదం 10 క్లూస్:
5, 2, 1 అక్షరాలతో బంగారు కడియం; 3, 1 అక్షరాలతో సెలయేరు; 5, 4 అక్షరాలతో చంద్రగుప్తుని తల్లి.
~
మీరు ఈ పజిల్‌ని పూరించి సమాధానాలను 2026 మార్చ్ 03వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పద విన్యాసం-2 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 2026 మార్చ్ 08వ తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.
~
పదవిన్యాసం-1 జవాబులు:
1) అవకాశము 2) ఆకలిరాజ్యం 3) ఇరుపక్కలు 4) ఉమ్మడిపోరు 5) ఈతముక్కల 6) ఎడమకాలు 7) కోమలికము 8) కాకరూకుడు 9) గాలికబురు 10) గాములవారు
~
పదవిన్యాసం-1 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అనూరాధ సాయి జొన్నలగడ్డ
- బయన కన్యాకుమారి, విజయవాడ
- సిహెచ్. వి. బృందావన రావు, నెల్లూరు
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు, హైదరాబాదు
- మధుసూదన రావు తల్లాప్రగడ, బెంగుళూరు
- రామవరపు గిరిజాశంకరరావు, బెంగుళూరు
- శ్రీనివాసరావు సొంసాళె, ఎమ్మిగనూరు
- వర్ధని మాదిరాజు, హైదరాబాద్
వీరికి అభినందనలు.
~
గమనిక:
- పజిల్‌లో ఏవైనా సందేహాలు కలిగితే నిర్వాహకులు టి. రామలింగయ్య గారిని 7285938387 నెంబరులో, ramalingaihtadikonda@gmail.com అనే ఈమెయిల్లో సంప్రదించగలరు.
- పజిల్‌కు సంబంధించిన సందేహాలకు నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
ప్రకాశం జిల్లా ఒంగోలు నివాసి అయిన శ్రీ టి. రామలింగయ్య 2002లో ప్రభుత్వ ఉద్యోగిగా పదవీ విరమణ చేసి, విశ్రాంత జీవితం గడుపుతున్నారు. గళ్ళ నుడికట్టులు నింపటంలో ఆసక్తి ఉన్న రామలింగయ్య 1980 నుండి ఆంధ్రభూమి, ఆంధ్రప్రభలలోని ఫజిల్స్ పూరించి పంపేవారు. ప్రస్తుతము కాలక్షేపం కొరకు స్వయంగా ఫజిల్స్ తయారు చేస్తుంటారు. ఎవరిని అనుకరించిక స్వయంగా శబ్దార్థ చంద్రిక, తెలుగు అకాడమి నిఘంటువు లను అనుసరించి వ్రాస్తుంటారు.
సెల్: 7285938387
