Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పద విన్యాసం-20

సంచికలో పజిల్స్ కోరుకునే పాఠకుల కోసం ‘పద విన్యాసం’ పేరిట, రెండు వారాలకి ఒకసారి వచ్చేలా, మరో పజిల్‌ని శ్రీ టి. రామలింగయ్య గారు అందిస్తున్నారు.

ఈ ఫీచర్‍లో రచయిత ఒక పదానికి క్లూస్ ఇస్తారు. దానిలో ఉన్న కొన్ని అక్షరాలతో అటుఇటూ మార్చినా లేదా పదాన్ని విడగొట్టినా ఏర్పడే కొత్త పదాలు ఏర్పడుతాయి. అటువంటి పదాల అర్థాలను నిర్వాహకులు సూచిస్తారు. వాటి ఆధారంగా రచయిత హింట్ ఇచ్చిన పదాన్ని పాఠకులు గుర్తించాలి.

ఈ క్రింది ఉదాహరణ చూడండి.

1, 2 అక్షరాలతో కేళి (ఆట), 3,4 అక్షరాలతో ధర, విలువ (వెల), 3,4,5 అక్షరాలతో ఆడుది (వెలది) పదాలు వస్తాయి.

అప్పుడు మూల పదం ‘ఆటవెలది’ అవుతుంది.

ఇటువంటి పది ప్రశ్నలు ఈ పజిల్‌లో ఉంటాయి.

~

ఈ వారం ప్రశ్నలు:

పదం 1 క్లూస్:

1, 2 అక్షరాలతో గృహగోధిక; 5, 4, 3 అక్షరాలతో కొంత దాక; 3, 5 అక్షరాలతో పోగు, కువ్వ.

పదం 2 క్లూస్:

1, 2 అక్షరాలతో వాయసం; 3, 4, 5 అక్షరాలతో పూత్తడి; 1, 5 అక్షరాలతో మిరపకాయల పొడి.

పదం 3 క్లూస్:

1, 2 అక్షరాలతో వసారా, మగవారు కోట్టుకొనే ధోవతి; 3, 4, 5 అక్షరాలతో మర్రిచెట్టు; 2, 3, 4 అక్షరాలతో పనికిమాలినవాడు.

పదం 4 క్లూస్:

1, 2 అక్షరాలతో రుచి; 3, 4, 5 అక్షరాలతో ఆశపడు, అలవాటుపడు; 3, 4 అక్షరాలతో తిరుగుడు చీల.

పదం 5 క్లూస్:

1, 2 అక్షరాలతో నుయ్యి; 2, 3 అక్షరాలతో పుష్పము; 4, 5 చుబుకం; 4, 3, 4 అక్షరాలతో కుండ (గ్రామదేవతాఘటము).

పదం 6 క్లూస్:

1, 2 అక్షరాలతో వివాహము; 3, 4, 5 అక్షరాలతో ఆహ్వానము; 5, 4 అక్షరాలతో రత్నం మొదలగు వాని మురికి.

పదం 7 క్లూస్:

1, 2, 5 అక్షరాలతో గతము; 1, 2, 3 అక్షరాలతో అక్క, ముందు జన్మించినది; 3, 4, 5 అక్షరాలతో పుట్టుక; 1,3 అక్షరాలతో అర్చన.

పదం 8 క్లూస్:

1, 2 అక్షరాలతో వ్యాఘ్రం; 1, 4, 3 అక్షరాలతో పుల్ల, సమిధ; 3, 4, 5 అక్షరాలతో నీళ్ళతో

శుభ్రంచేయు.

పదం 9 క్లూస్:

5, 4, 3 అక్షరాలతో చలన చిత్రం; 1, 2 అక్షరాలతో సరిపోవు, నాగలి వరుస; 3, 4, 5 అక్షరాలతో మనుష్యుడు.

పదం 10 క్లూస్:

1, 2 అక్షరాలతో చీరచెంగు; 2, 5 అక్షరాలతో దేవాలయం; 3, 4, 5 అక్షరాలతో బంగారం; 1, 5 అక్షరాలతో తేలుతోక.

~

మీరు ఈ పజిల్‌ని పూరించి సమాధానాలను 2026 నవంబర్ 10వ తేదీ లోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పద విన్యాసం-20 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 2026 నవంబర్ 15వ తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.

~

పదవిన్యాసం-19 జవాబులు:

1) మందుపాతర 2) కాపురుషుడు 3) పాపజగము 4) కరువు భత్యం 5) తామరచెలి 6) గిరకబావి 7) బానసంవాడు 8) తెలుపురంగు 9) శనివారము 10) వలమానము

~

పదవిన్యాసం-19 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

~

గమనిక:

Exit mobile version