
సంచికలో పజిల్స్ కోరుకునే పాఠకుల కోసం ‘పద విన్యాసం’ పేరిట, రెండు వారాలకి ఒకసారి వచ్చేలా, మరో పజిల్‌ని శ్రీ టి. రామలింగయ్య గారు అందిస్తున్నారు.
ఈ ఫీచర్‍లో రచయిత ఒక పదానికి క్లూస్ ఇస్తారు. దానిలో ఉన్న కొన్ని అక్షరాలతో అటుఇటూ మార్చినా లేదా పదాన్ని విడగొట్టినా ఏర్పడే కొత్త పదాలు ఏర్పడుతాయి. అటువంటి పదాల అర్థాలను నిర్వాహకులు సూచిస్తారు. వాటి ఆధారంగా రచయిత హింట్ ఇచ్చిన పదాన్ని పాఠకులు గుర్తించాలి.
ఈ క్రింది ఉదాహరణ చూడండి.
1, 2 అక్షరాలతో కేళి (ఆట), 3,4 అక్షరాలతో ధర, విలువ (వెల), 3,4,5 అక్షరాలతో ఆడుది (వెలది) పదాలు వస్తాయి.
అప్పుడు మూల పదం ‘ఆటవెలది’ అవుతుంది.
ఇటువంటి పది ప్రశ్నలు ఈ పజిల్‌లో ఉంటాయి.
~
ఈ వారం ప్రశ్నలు:
పదం 1 క్లూస్:
4, 5 అక్షరాలతో అర్చన; 4, 3 అక్షరాలతో పిందెకు ముందు దశ; 1, 2 అక్షరాలతో పాఠశాల.
పదం 2 క్లూస్:
1, 2 అక్షరాలతో శిరము; 3, 5 అక్షరాలతో అంగదుని తండ్రి; 3, 4, 5 అక్షరాలతో గుమ్మము.
పదం 3 క్లూస్:
1, 2 అక్షరాలతో శిశువు, బాల; 3, 4, 5 అక్షరాలతో పిశాచము, రాహువు; 1, 5 అక్షరాలతో సర్పము.
పదం 4 క్లూస్:
1, 2, 4, 5 అక్షరాలతో స్త్రీ తలయందు ధరించెడి ఒక నగ; 3, 4, 5 అక్షరాలతో కంఠధ్వని; 1, 4 అక్షరాలతో తాడు మొదలగువాని పీచు.
పదం 5 క్లూస్:
4, 5 అక్షరాలతో వరుస, సమూహము; 3, 5, 2 అక్షరాలతో కాటకము; 1, 2, 3 అక్షరాలతో తక్కువ ధర.
పదం 6 క్లూస్:
1, 2, 3 అక్షరాలతో సముద్రము; 4, 5 అక్షరాలతో నవనీతము; 4, 3 అక్షరాలతో బహిష్కరణ.
పదం 7 క్లూస్:
1, 2 అక్షరాలతో శ్రీపదము; 4, 5 అక్షరాలతో వంద, శతము; 3, 2 అక్షరాలతో చింతపండు మరగబెట్టిన పోపు రసము.
పదం 8 క్లూస్:
4, 2 అక్షరాలతో కక్ష; 4, 5 అక్షరాలతో శ్రమ; 1, 2, 3 అక్షరాలతో క్షురకుడు.
పదం 9 క్లూస్:
1, 2 అక్షరాలతో ఎల్లప్పుడు; 2, 3 అక్షరాలతో ఇచ్చువాడు; 2, 4, 5 అక్షరాలతో ఈవి.
పదం 10 క్లూస్:
4, 3 అక్షరాలతో బదరి; 4, 5 అక్షరాలతో ప్రభువు, రాజు; 1, 2, 3 అక్షరాలతో కాంతి, ప్రకాశం.
~
మీరు ఈ పజిల్‌ని పూరించి సమాధానాలను 2026 నవంబర్ 24వ తేదీ లోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పద విన్యాసం-21 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 2026 నవంబర్ 29వ తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.
~
పదవిన్యాసం-20 జవాబులు:
1) బల్లికురవ 2) కాకి బంగారం 3) పంచవటము 4) చవిమరగు 5) బావిరి గడ్డం 6) పెళ్ళిపిలుపు 7) పూర్వజన్మము 8) పులి కడుగు 9) చాలుమానిసి 10) కొంగు పసిడి
~
పదవిన్యాసం-20 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అరవ భాస్కర రావు, కలకత్తా.
- అరుణరేఖ ముదిగొండ, హైదరాబాద్
- సిహెచ్.వి. బృందావన రావు, అహమ్మదాబాదు
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు, హైదరాబాద్.
- గండ్లూరి జగన్మోహన రావు, ఖమ్మం
- ప్రవీణ డా.
- పి. వి. రాజు, హైదరాబాద్
- శ్రీనివాసరావు సొంసాళె, ఎమ్మిగనూరు
- రామకూరు నాగేశ్వరరావు, శ్రీకాకుళం.
- రామవరపు గిరిజాశంకర రావు, బెంగుళూరు
- శంభర వెంకట రామ జోగారావు, బెంగుళూరు
- ఉషారాణి జి, తిరుపతి
- జాకిర్ హుస్సేన్, ఎమ్.ఎమ్.డి., ఆదోని
వీరికి అభినందనలు.
~
గమనిక:
- ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
- పజిల్‌లో ఏవైనా సందేహాలు కలిగితే నిర్వాహకులు టి. రామలింగయ్య గారిని 7285938387 నెంబరులో, ramalingaihtadikonda@gmail.com అనే ఈమెయిల్లో సంప్రదించగలరు.
- పజిల్‌కు సంబంధించిన సందేహాలకు నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
ప్రకాశం జిల్లా ఒంగోలు నివాసి అయిన శ్రీ టి. రామలింగయ్య 2002లో ప్రభుత్వ ఉద్యోగిగా పదవీ విరమణ చేసి, విశ్రాంత జీవితం గడుపుతున్నారు. గళ్ళ నుడికట్టులు నింపటంలో ఆసక్తి ఉన్న రామలింగయ్య 1980 నుండి ఆంధ్రభూమి, ఆంధ్రప్రభలలోని ఫజిల్స్ పూరించి పంపేవారు. ప్రస్తుతము కాలక్షేపం కొరకు స్వయంగా ఫజిల్స్ తయారు చేస్తుంటారు. ఎవరిని అనుకరించిక స్వయంగా శబ్దార్థ చంద్రిక, తెలుగు అకాడమి నిఘంటువు లను అనుసరించి వ్రాస్తుంటారు.
సెల్: 7285938387
