Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పద విన్యాసం-3

సంచికలో పజిల్స్ కోరుకునే పాఠకుల కోసం ‘పద విన్యాసం’ పేరిట, రెండు వారాలకి ఒకసారి వచ్చేలా, మరో పజిల్‌ని శ్రీ టి. రామలింగయ్య గారు అందిస్తున్నారు.

ఈ ఫీచర్‍లో రచయిత ఒక పదానికి క్లూస్ ఇస్తారు. దానిలో ఉన్న కొన్ని అక్షరాలతో అటుఇటూ మార్చినా లేదా పదాన్ని విడగొట్టినా ఏర్పడే కొత్త పదాలు ఏర్పడుతాయి. అటువంటి పదాల అర్థాలను నిర్వాహకులు సూచిస్తారు. వాటి ఆధారంగా రచయిత హింట్ ఇచ్చిన పదాన్ని పాఠకులు గుర్తించాలి.

ఈ క్రింది ఉదాహరణ చూడండి.

1, 2 అక్షరాలతో కేళి (ఆట), 3,4 అక్షరాలతో ధర, విలువ (వెల), 3,4,5 అక్షరాలతో ఆడుది (వెలది) పదాలు వస్తాయి.

అప్పుడు మూల పదం ‘ఆటవెలది’ అవుతుంది.

ఇటువంటి పది ప్రశ్నలు ఈ పజిల్‌లో ఉంటాయి.

~

ఈ వారం ప్రశ్నలు:

పదం 1 క్లూస్:

1, 2, 5 అక్షరాలతో సమస్తము; 1, 4, 5 అక్షరాలతో సమానము; 3, 1 అక్షరాలతో ముక్కు; 3, 4, 5 అక్షరాలతో పేరు.

పదం 2 క్లూస్:

1, 2, 3 అక్షరాలతో  ఒరిపిడి; 1, 2 అక్షరాలతో శిల; 4, 5 అక్షరాలతో శ్మశానము; 1, 5 అక్షరాలతో గుంజ, స్తంభం.

పదం 3 క్లూస్:

1, 2, అక్షరాలతో అప్పు సొమ్ముకు అదనంగా చెల్లించే ధనం; 3, 4, 5 అక్షరాలతో పశువులను మేపేవాడు; 1, 5 అక్షరాలతో ఒక ధాన్యం.

పదం 4 క్లూస్:

1, 2, 3, 4 అక్షరాలతో పరిశీలన; 3, 4, 5 అక్షరాలతో యుద్ధం; 2, 3 అక్షరాలతో గీత, గీటు; 3, 1 అక్షరాలతో సూర్యుడు.

పదం 5 క్లూస్:

1, 4, 5 అక్షరాలతో ఇవ్వదగిన; 2, 3, 5 అక్షరాలతో తోక; 2, 5 అక్షరాలతో ఓమం, ఓ మందు దినుసు; 3, 4 అక్షరాలతో సంగీత విరామం, మోసం.

పదం 6 క్లూస్:

1, 2, 3 అక్షరాలతో కూష్మాండం; 4, 5 అక్షరాలతో పిందె, పండు మధ్య దశ; 4,1 అక్షరాలతో పెద్ద బిందె.

పదం 7 క్లూస్:

1, 2, 3 అక్షరాలతో నిద్రలో ఉచ్ఛ్వాస నిశ్వాసాల ధ్వని; 4, 5 అక్షరాలతో మగ పశువు; 5, 2, 3 అక్షరాలతో మహమ్మదీయులలో ఒక తెగ.

పదం 8 క్లూస్:

1, 2, అక్షరాలతో రేయి; 3, 4, 5 అక్షరాలతో గట్టిపడిన ముద్ద; 1, 3 అక్షరాలతో రావడం.

పదం 9 క్లూస్:

1, 2, అక్షరాలతో ఆకారం; 3, 4, 5 అక్షరాలతో గీతలు; 3, 2 అక్షరాలతో మరుసటి దినం.

పదం 10 క్లూస్:

1, 2, అక్షరాలతో పశువుల కొట్టం; 3, 4, 5 అక్షరాలతో పల్లె; 1, 5 అక్షరాలతో వ్యాయామము.

~

మీరు ఈ పజిల్‌ని పూరించి సమాధానాలను 2026 మార్చ్ 17వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పద విన్యాసం-3 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 2026 మార్చ్ 22వ తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.

~

పదవిన్యాసం-2 జవాబులు:

1) జయపాలుడు 2) ఆదాయంపన్ను 3) పాచనకము 4) పరివారము 5) మరకతము 6) మరాటిమొగ్గ 7) శబరిమల 8) నందివర్ధనం 9) మోడుబతుకు 10) గురువారము

~

పదవిన్యాసం-2 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

~

గమనిక:

Exit mobile version