
సంచికలో పజిల్స్ కోరుకునే పాఠకుల కోసం ‘పద విన్యాసం’ పేరిట, రెండు వారాలకి ఒకసారి వచ్చేలా, మరో పజిల్‌ని శ్రీ టి. రామలింగయ్య గారు అందిస్తున్నారు.
ఈ ఫీచర్‍లో రచయిత ఒక పదానికి క్లూస్ ఇస్తారు. దానిలో ఉన్న కొన్ని అక్షరాలతో అటుఇటూ మార్చినా లేదా పదాన్ని విడగొట్టినా ఏర్పడే కొత్త పదాలు ఏర్పడుతాయి. అటువంటి పదాల అర్థాలను నిర్వాహకులు సూచిస్తారు. వాటి ఆధారంగా రచయిత హింట్ ఇచ్చిన పదాన్ని పాఠకులు గుర్తించాలి.
ఈ క్రింది ఉదాహరణ చూడండి.
1, 2 అక్షరాలతో కేళి (ఆట), 3,4 అక్షరాలతో ధర, విలువ (వెల), 3,4,5 అక్షరాలతో ఆడుది (వెలది) పదాలు వస్తాయి.
అప్పుడు మూల పదం ‘ఆటవెలది’ అవుతుంది.
ఇటువంటి పది ప్రశ్నలు ఈ పజిల్‌లో ఉంటాయి.
~
ఈ వారం ప్రశ్నలు:
పదం 1 క్లూస్:
1, 3, 4, 5 అక్షరాలతో కీడు, ప్రమాదము; 3, 2, 5 అక్షరాలతో తాగడం; 3, 4, 5 అక్షరాలతో వయసు.
పదం 2 క్లూస్:
1, 2, అక్షరాలతో కొమ్మల నుండి కిందకి దిగే వేరు; 1, 4 అక్షరాలతో గ్రామం, పల్లె; 3, 4, 5 అక్షరాలతో పిరికితనం.
పదం 3 క్లూస్:
1, 2, 5 అక్షరాలతో చెయ్యి, తొండము; 3, 4, 5 అక్షరాలతో పండు; 5, 2 అక్షరాలతో చంద్రగుప్తుని తల్లి, 1, 4 అక్షరాలతో స్వప్నం.
పదం 4 క్లూస్:
1, 2 అక్షరాలతో పూజ్యురాలు, పార్వతి; 3, 4, 5 అక్షరాలతో మాట; 1, 3, 4 అక్షరాలతో కష్టము.
పదం 5 క్లూస్:
1, 2 అక్షరాలతో చంద్రుడిలో 16వ భాగం; 3, 4, 5 అక్షరాలతో దేవతల వల్ల పొందే కోరిక; 4, 3, 5 అక్షరాలతో ధ్వని, చప్పుడు.
పదం 6 క్లూస్:
1, 2, అక్షరాలతో జీవుడు, మనస్సు; 3, 4, 5 అక్షరాలతో ప్రాచీనం, జరిగిన కాలం; 1, 3, 5 అక్షరాలతో అల్లరి.
పదం 7 క్లూస్:
1, 2, 5 అక్షరాలతో నూరు పద్యాల గ్రంథం; 3, 4 అక్షరాలతో కర్ర, హారం; 1, 5 అక్షరాలతో ఒకని పాలనలో చేరిన సంవత్సరం.
పదం 8 క్లూస్:
1, 2, అక్షరాలతో నఖము; 3, 4, 5 అక్షరాలతో పేరు; 1, 5 అక్షరాలతో గారాబము.
పదం 9 క్లూస్:
1, 2, 3 అక్షరాలతో తామర, శంఖం; 3, 4, 5 అక్షరాలతో పశువు; 1, 4, 5 అక్షరాలతో లక్క.
పదం 10 క్లూస్:
1, 2, అక్షరాలతో పెద్దరాయి; 3, 4, 5 అక్షరాలతో ఊడిగం; 4, 5 అక్షరాలతో పంది.
~
మీరు ఈ పజిల్‌ని పూరించి సమాధానాలను 2026 మార్చ్ 31వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పద విన్యాసం-4 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 2026 ఏప్రిల్ 05వ తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.
~
పదవిన్యాసం-3 జవాబులు:
1) సర్వనామము 2) రాయిడికాడు 3) వడ్డిమేపరి 4) విచారణము 5) దేవాలయము 6) గుమ్మడికాయ 7) గురకపోతు 8) రాత్రికరుడు 9) రూపురేఖలు 10) సాలగ్రామము
~
పదవిన్యాసం-3 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అరుణరేఖ ముదిగొండ, హైదరాబాద్
- బయన కన్యాకుమారి, విజయవాడ
- సిహెచ్. వి. బృందావన రావు, నెల్లూరు
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు, హైదరాబాదు
- కాళీపట్నపు శారద, హైదరాబాద్
- మధుసూదన రావు తల్లాప్రగడ, బెంగుళూరు
- రంగావజ్ఝల శారద, హైదరాబాద్
- రామకూరు నాగేశ్వరరావు, శ్రీకాకుళం
- రామవరపు గిరిజాశంకరరావు, బెంగుళూరు
- శిష్ట్లా అనిత, బెంగుళూరు
- శ్రీనివాసరావు సొంసాళె, ఎమ్మిగనూరు
- ఉషారాణి.జి, తిరుపతి
- వర్ధని మాదిరాజు, హైదరాబాద్
వీరికి అభినందనలు.
~
గమనిక:
- పజిల్‌లో ఏవైనా సందేహాలు కలిగితే నిర్వాహకులు టి. రామలింగయ్య గారిని 7285938387 నెంబరులో, ramalingaihtadikonda@gmail.com అనే ఈమెయిల్‍లో సంప్రదించగలరు.
- పజిల్‌కు సంబంధించిన సందేహాలకు నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
ప్రకాశం జిల్లా ఒంగోలు నివాసి అయిన శ్రీ టి. రామలింగయ్య 2002లో ప్రభుత్వ ఉద్యోగిగా పదవీ విరమణ చేసి, విశ్రాంత జీవితం గడుపుతున్నారు. గళ్ళ నుడికట్టులు నింపటంలో ఆసక్తి ఉన్న రామలింగయ్య 1980 నుండి ఆంధ్రభూమి, ఆంధ్రప్రభలలోని ఫజిల్స్ పూరించి పంపేవారు. ప్రస్తుతము కాలక్షేపం కొరకు స్వయంగా ఫజిల్స్ తయారు చేస్తుంటారు. ఎవరిని అనుకరించిక స్వయంగా శబ్దార్థ చంద్రిక, తెలుగు అకాడమి నిఘంటువు లను అనుసరించి వ్రాస్తుంటారు.
సెల్: 7285938387
