Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పద విన్యాసం-5

సంచికలో పజిల్స్ కోరుకునే పాఠకుల కోసం ‘పద విన్యాసం’ పేరిట, రెండు వారాలకి ఒకసారి వచ్చేలా, మరో పజిల్‌ని శ్రీ టి. రామలింగయ్య గారు అందిస్తున్నారు.

ఈ ఫీచర్‍లో రచయిత ఒక పదానికి క్లూస్ ఇస్తారు. దానిలో ఉన్న కొన్ని అక్షరాలతో అటుఇటూ మార్చినా లేదా పదాన్ని విడగొట్టినా ఏర్పడే కొత్త పదాలు ఏర్పడుతాయి. అటువంటి పదాల అర్థాలను నిర్వాహకులు సూచిస్తారు. వాటి ఆధారంగా రచయిత హింట్ ఇచ్చిన పదాన్ని పాఠకులు గుర్తించాలి.

ఈ క్రింది ఉదాహరణ చూడండి.

1, 2 అక్షరాలతో కేళి (ఆట), 3,4 అక్షరాలతో ధర, విలువ (వెల), 3,4,5 అక్షరాలతో ఆడుది (వెలది) పదాలు వస్తాయి.

అప్పుడు మూల పదం ‘ఆటవెలది’ అవుతుంది.

ఇటువంటి పది ప్రశ్నలు ఈ పజిల్‌లో ఉంటాయి.

~

ఈ వారం ప్రశ్నలు:

పదం 1 క్లూస్:

1, 2, 3 అక్షరాలతో కంపము; 4, 5 అక్షరాలతో వెదురు బొంగు; 4, 2, 3 అక్షరాలతో దుర్వాసన.

పదం 2 క్లూస్:

1, 2, అక్షరాలతో మేక; 3, 2, 5 అక్షరాలతో ఏనుగు, మూడు అడుగుల కొలత; 2, 3, 5 అక్షరాలతో ప్రపంచం; 2, 4, 5 అక్షరాలతో వడి, వేగము.

పదం 3 క్లూస్:

1, 2 అక్షరాలతో ఏను; 3, 4, 5 అక్షరాలతో శాపాలు కాదు; 3, 2, 5 అక్షరాలతో బిగువు కాని.

పదం 4 క్లూస్:

1, 2 అక్షరాలతో ఒకటి; 3, 4 అక్షరాలతో బట్టల కొట్టులో బట్ట మడత; 1, 5 అక్షరాలతో ఆరున్నొక్కటి.

పదం 5 క్లూస్:

1, 2, 3 అక్షరాలతో మోటుదనం, కాఠిన్యం; 4, 2 అక్షరాలతో పాలు పితుకు, ఆకులు నలిపి రసం తీయుట; 4, 5 అక్షరాలతో పితృదేవతలకు పెట్టే అన్నం ముద్ద.

పదం 6 క్లూస్:

1, 2, 3 అక్షరాలతో కానుక; 2, 3 అక్షరాలతో నడువు; 3, 4, 5 అక్షరాలతో చూపు.

పదం 7 క్లూస్:

2, 1, 4, 5 అక్షరాలతో ఓడను నడిపేవాడు; 2, 3, 4, 5 అక్షరాలతో నేత; 2, 4 అక్షరాలతో లేహనము చేయు.

పదం 8 క్లూస్:

1, 2, అక్షరాలతో శ్రీకృష్ణుని అష్ట భార్యలలో ఒకరు; 3, 4, 5 అక్షరాలతో ఏనుగు; 1, 2, 5 అక్షరాలతో జాగురూకత.

పదం 9 క్లూస్:

1, 2, అక్షరాలతో కీడు; 2, 3, 4, 5 అక్షరాలతో పోయినది పోగా మిగిలినది; 1, 4, 5 అక్షరాలతో దండ, మాల; 3, 4, 5 అక్షరాలతో చెయ్యి.

పదం 10 క్లూస్:

1, 2, అక్షరాలతో గుడ్డు లోని గిజరు (సొన); 3, 4, 5 అక్షరాలతో తిరగడం; 4, 2 అక్షరాలతో స్త్రీ; 2, 5 అక్షరాలతో నాడి.

~

మీరు ఈ పజిల్‌ని పూరించి సమాధానాలను 2026 ఏప్రిల్ 14వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పద విన్యాసం-5 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 2026 ఏప్రిల్ 19వ తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.

~

పదవిన్యాసం-4 జవాబులు:

1) అనపాయము 2) ఊడబెరుకు 3) కరఫలము 4) ఆర్యపదము 5) కళవరము 6) ఆత్మగతము 7) శతయష్టికం 8) గోరునామము 9) జలజంతువు 10) బండచాకిరి

~

పదవిన్యాసం-4 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

~

గమనిక:

  1. పజిల్‌లో ఏవైనా సందేహాలు కలిగితే నిర్వాహకులు టి. రామలింగయ్య గారిని 7285938387 నెంబరులో, ramalingaihtadikonda@gmail.com అనే ఈమెయిల్‍లో సంప్రదించగలరు.
  2. పజిల్‌కు సంబంధించిన సందేహాలకు నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
Exit mobile version