Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పద విన్యాసం-6

సంచికలో పజిల్స్ కోరుకునే పాఠకుల కోసం ‘పద విన్యాసం’ పేరిట, రెండు వారాలకి ఒకసారి వచ్చేలా, మరో పజిల్‌ని శ్రీ టి. రామలింగయ్య గారు అందిస్తున్నారు.

ఈ ఫీచర్‍లో రచయిత ఒక పదానికి క్లూస్ ఇస్తారు. దానిలో ఉన్న కొన్ని అక్షరాలతో అటుఇటూ మార్చినా లేదా పదాన్ని విడగొట్టినా ఏర్పడే కొత్త పదాలు ఏర్పడుతాయి. అటువంటి పదాల అర్థాలను నిర్వాహకులు సూచిస్తారు. వాటి ఆధారంగా రచయిత హింట్ ఇచ్చిన పదాన్ని పాఠకులు గుర్తించాలి.

ఈ క్రింది ఉదాహరణ చూడండి.

1, 2 అక్షరాలతో కేళి (ఆట), 3,4 అక్షరాలతో ధర, విలువ (వెల), 3,4,5 అక్షరాలతో ఆడుది (వెలది) పదాలు వస్తాయి.

అప్పుడు మూల పదం ‘ఆటవెలది’ అవుతుంది.

ఇటువంటి పది ప్రశ్నలు ఈ పజిల్‌లో ఉంటాయి.

~

ఈ వారం ప్రశ్నలు:

పదం 1 క్లూస్:

1, 2, 3 అక్షరాలతో అరణ్యము; 4, 5 అక్షరాలతో రక్షకుడు; 4, 2, అక్షరాలతో తొడిమ; 4, 3 అక్షరాలతో కాషాయ రంగు.

పదం 2 క్లూస్:

1, 2, 3, 4 అక్షరాలతో అత్రి ముని భార్య; 1, 3, 4 అక్షరాలతో ఓర్వలేనితనం; 2, 4, 2, 5 అక్షరాలతో కన్ను.

పదం 3 క్లూస్:

1, 2 అక్షరాలతో అరుపు, పెద్ద కూత; 3, 4, 2 అక్షరాలతో ఇనుప చువ్వ, కడ్డీ; 2, 5 అక్షరాలతో మిక్కిలి.

పదం 4 క్లూస్:

3, 4, 5 అక్షరాలతో ధ్వని, చప్పుడు; 1, 2, 5 అక్షరాలతో పెన్ను; 1, 2 అక్షరాలతో స్వప్నం; 2, 4, 5 అక్షరాలతో భిన్నంలో పై భాగము.

పదం 5 క్లూస్:

1, 2, 3 అక్షరాలతో బంగారం; 4, 3 అక్షరాలతో సమీపించు, పొందు; 4, 5 అక్షరాలతో వస్త్రము.

పదం 6 క్లూస్:

1, 2, 5 అక్షరాలతో పొగ, ఆవిరి; 3, 4, 5 అక్షరాలతో తాగడం; 3, 5 అక్షరాలతో సర్పము.

పదం 7 క్లూస్:

1, 2 అక్షరాలతో పిరికివాడు; 1, 3, 5 అక్షరాలతో పట్టుదల;  4, 2, 5 అక్షరాలతో పడమరగా పారెడు ఏరు.

పదం 8 క్లూస్:

1, 2, 4 అక్షరాలతో సత్తువ; 3, 4, 5 అక్షరాలతో కౌసల్యా తనయుడు; 3, 5 అక్షరాలతో గుంజ; 1, 2 అక్షరాలతో విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు నేర్పిన ఒక విద్య.

పదం 9 క్లూస్:

1, 2, 3 అక్షరాలతో పెద్ద సుత్తి; 4, 3, అక్షరాలతో దుర్గము; 4, 5 అక్షరాలతో చేతికర్ర.

పదం 10 క్లూస్:

1, 2, 3 అక్షరాలతో విన్నపం; 4, 5 అక్షరాలతో ఆచరించు; 1, 2 అక్షరాలతో మనము అనుదానికి ప్రాతిపదికము.

~

మీరు ఈ పజిల్‌ని పూరించి సమాధానాలను 2026 ఏప్రిల్ 28వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పద విన్యాసం-6 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 2026 మే 03వ తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.

~

పదవిన్యాసం-5 జవాబులు:

1) అదురుగడ 2) అజగవము 3) ఐదువరాలు 4) ఏకతానుడు 5) గడుసుపిండం 6) ఉపదర్శనం 7) వినాయకుడు 8) భద్రగజము 9) హానికరము 10) జనసంచారం

~

పదవిన్యాసం-4 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

~

గమనిక:

  1. పజిల్‌లో ఏవైనా సందేహాలు కలిగితే నిర్వాహకులు టి. రామలింగయ్య గారిని 7285938387 నెంబరులో, ramalingaihtadikonda@gmail.com అనే ఈమెయిల్‍లో సంప్రదించగలరు.
  2. పజిల్‌కు సంబంధించిన సందేహాలకు నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
Exit mobile version