Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పద విన్యాసం-7

సంచికలో పజిల్స్ కోరుకునే పాఠకుల కోసం ‘పద విన్యాసం’ పేరిట, రెండు వారాలకి ఒకసారి వచ్చేలా, మరో పజిల్‌ని శ్రీ టి. రామలింగయ్య గారు అందిస్తున్నారు.

ఈ ఫీచర్‍లో రచయిత ఒక పదానికి క్లూస్ ఇస్తారు. దానిలో ఉన్న కొన్ని అక్షరాలతో అటుఇటూ మార్చినా లేదా పదాన్ని విడగొట్టినా ఏర్పడే కొత్త పదాలు ఏర్పడుతాయి. అటువంటి పదాల అర్థాలను నిర్వాహకులు సూచిస్తారు. వాటి ఆధారంగా రచయిత హింట్ ఇచ్చిన పదాన్ని పాఠకులు గుర్తించాలి.

ఈ క్రింది ఉదాహరణ చూడండి.

1, 2 అక్షరాలతో కేళి (ఆట), 3,4 అక్షరాలతో ధర, విలువ (వెల), 3,4,5 అక్షరాలతో ఆడుది (వెలది) పదాలు వస్తాయి.

అప్పుడు మూల పదం ‘ఆటవెలది’ అవుతుంది.

ఇటువంటి పది ప్రశ్నలు ఈ పజిల్‌లో ఉంటాయి.

~

ఈ వారం ప్రశ్నలు:

పదం 1 క్లూస్:

1, 2, 3, 4 అక్షరాలతో వెన్నెముక; 2, 3 అక్షరాలతో ధాన్యము మొదలగునవి కొలిచే ఒక కొలత; 4, 5, 3 అక్షరాలతో కాటు వాసన.

పదం 2 క్లూస్:

1, 5 అక్షరాలతో వెళ్ళము; 2, 3, 5 అక్షరాలతో భిన్నము లోని పై భాగము; 5, 4, అక్షరాలతో చంద్రగుప్తుని తల్లి.

పదం 3 క్లూస్:

1, 4 అక్షరాలతో కోత కోసిన పైరు గడ్డి; 5, 2 అక్షరాలతో ఋషి; 1, 3, 4, 5 అక్షరాలతో దిగజారిపోవటం.

పదం 4 క్లూస్:

1, 2, 5 అక్షరాలతో గొంతు, కుత్తుక; 3, 4, 5 అక్షరాలతో హాని, అపాయం; 1, 4 అక్షరాలతో వెదురుబొంగు.

పదం 5 క్లూస్:

1, 2 అక్షరాలతో విసరివేయుట; 3, 4, 5 అక్షరాలతో పక్షి; 3, 1, 5 అక్షరాలతో కీటకము.

పదం 6 క్లూస్:

1, 2 అక్షరాలతో చొంగ; 3, 4, 5 అక్షరాలతో అరుపులు, కేకలు; 3, 5 అక్షరాలతో పడిపోవు.

పదం 7 క్లూస్:

1, 2, 3, 4 అక్షరాలతో నలభైవ సంవత్సరం; 3, 4, 5 అక్షరాలతో పుట్టుక;  2, 4, 5 అక్షరాలతో ధ్వని, అరుపు; 1, 4, 5 అక్షరాలతో గాలి.

పదం 8 క్లూస్:

1, 2, 3 అక్షరాలతో నమ్మకం; 4, 1 అక్షరాలతో అడవి; 4, 5 అక్షరాలతో రక్షణం, కాయలు కాయడం.

పదం 9 క్లూస్:

1, 2, 3 అక్షరాలతో మేలు, మంచి; 4, 5 అక్షరాలతో పాదరక్ష, పలుకు; 2, 5 అక్షరాలతో అపరాధం, దోషం.

పదం 10 క్లూస్:

1, 2, 3 అక్షరాలతో భూమి; 4, 5 అక్షరాలతో కుమార్తె; 5, 2, 3 అక్షరాలతో సూర్యుడు.

~

మీరు ఈ పజిల్‌ని పూరించి సమాధానాలను 2026 మే 12వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పద విన్యాసం-7 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 2026 మే 17వ తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.

~

పదవిన్యాసం-6 జవాబులు:

1) అడవికాపు 2) అనసూయము 3) కేకసలాడు 4) కలరవము 5) బంగారుచేల 6) ధూమపానము 7) పందతనము 8) బలరాముడు 9) సమ్మెటకోల 10) మనవిచేయు

~

పదవిన్యాసం-6 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

~

గమనిక:

  1. పజిల్‌లో ఏవైనా సందేహాలు కలిగితే నిర్వాహకులు టి. రామలింగయ్య గారిని 7285938387 నెంబరులో, ramalingaihtadikonda@gmail.com అనే ఈమెయిల్‍లో సంప్రదించగలరు.
  2. పజిల్‌కు సంబంధించిన సందేహాలకు నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
Exit mobile version