Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పద విన్యాసం-8

సంచికలో పజిల్స్ కోరుకునే పాఠకుల కోసం ‘పద విన్యాసం’ పేరిట, రెండు వారాలకి ఒకసారి వచ్చేలా, మరో పజిల్‌ని శ్రీ టి. రామలింగయ్య గారు అందిస్తున్నారు.

ఈ ఫీచర్‍లో రచయిత ఒక పదానికి క్లూస్ ఇస్తారు. దానిలో ఉన్న కొన్ని అక్షరాలతో అటుఇటూ మార్చినా లేదా పదాన్ని విడగొట్టినా ఏర్పడే కొత్త పదాలు ఏర్పడుతాయి. అటువంటి పదాల అర్థాలను నిర్వాహకులు సూచిస్తారు. వాటి ఆధారంగా రచయిత హింట్ ఇచ్చిన పదాన్ని పాఠకులు గుర్తించాలి.

ఈ క్రింది ఉదాహరణ చూడండి.

1, 2 అక్షరాలతో కేళి (ఆట), 3,4 అక్షరాలతో ధర, విలువ (వెల), 3,4,5 అక్షరాలతో ఆడుది (వెలది) పదాలు వస్తాయి.

అప్పుడు మూల పదం ‘ఆటవెలది’ అవుతుంది.

ఇటువంటి పది ప్రశ్నలు ఈ పజిల్‌లో ఉంటాయి.

~

ఈ వారం ప్రశ్నలు:

పదం 1 క్లూస్:

1, 2, 3 అక్షరాలతో అందము; 1, 4, 2 అక్షరాలతో పశుపక్ష్యాదుల పిల్ల; 2, 4, 5, అక్షరాలతో పొదుపు, మర్యాద; 3, 4, 5 అక్షరాలతో ఏడ్పు, రోదనం.

పదం 2 క్లూస్:

4, 3 అక్షరాలతో దెబ్బ; 1, 2, 3 అక్షరాలతో సాటిలేని; 4, 5 అక్షరాలతో చంపడం, కొట్టడం.

పదం 3 క్లూస్:

1, 2 అక్షరాలతో కన్య, వృక్ష శాఖ; 1, 4 అక్షరాలతో చివర; 3, 4, 5 అక్షరాలతో విష్ణుభక్తుడు.

పదం 4 క్లూస్:

1, 2, 3 అక్షరాలతో ఒడంబడిక; 2, 5 అక్షరాలతో బహిర్గతం; 3, 2, 4 అక్షరాలతో మహమ్మదీయుడు; 3, 5 అక్షరాలతో పీడ, బాధాకరం.

పదం 5 క్లూస్:

1, 4 అక్షరాలతో మొలక; 1, 2 అక్షరాలతో లక్క; 2, 3, 4, 5 అక్షరాలతో రెప్పపాటు కాలం.

పదం 6 క్లూస్:

2, 1 అక్షరాలతో కృష్ణుని ప్రియురాలు గోపికను పిలవండి; 3, 5 అక్షరాలతో ఏరు, వంకర; 3, 2, 4 అక్షరాలతో సప్తమాతృకలలో ఒకరు, అడవిపంది.

పదం 7 క్లూస్:

3, 4, 5 అక్షరాలతో హారములోని ఒక పేట; 3, 4 అక్షరాలతో దట్టమైన నారు వరుస;  1, 3, 4 అక్షరాలతో పప్పు ధాన్యాలలో ఒకటి.

పదం 8 క్లూస్:

4, 2, 3 అక్షరాలతో అణిమాది అష్టైశ్వర్యాలలో ఒకటి; 3, 4, 5 అక్షరాలతో పెనిమిటి, భర్త; 1, 2 అక్షరాలతో కత్తి, బాణం.

పదం 9 క్లూస్:

1, 2 అక్షరాలతో గొప్పదైన; 3, 4, 5 అక్షరాలతో వాన; 1, 3, 5 అక్షరాలతో ఉద్దేశము, రీతి.

పదం 10 క్లూస్:

1, 2, 3 అక్షరాలతో ప్రియురాలు, భార్య; 4, 5 అక్షరాలతో పనికత్తె; 1, 5  అక్షరాలతో కొన చెక్కిన కొయ్య.

~

మీరు ఈ పజిల్‌ని పూరించి సమాధానాలను 2026 మే 26వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పద విన్యాసం-8 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 2026 మే 31వ తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.

~

పదవిన్యాసం-7 జవాబులు:

1) కశేరుకము 2) పోలవరము 3) పనితనము 4) గళగండము 5) రువ్వుపులుగు 6) జొల్లుకూతలు 7) పరాభవము 8) నమ్మికకాపు 9) హితవుచెప్పు 10) ధరణిసుత

~

పదవిన్యాసం-7 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

~

గమనిక:

Exit mobile version