Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పద విన్యాసం-9

సంచికలో పజిల్స్ కోరుకునే పాఠకుల కోసం ‘పద విన్యాసం’ పేరిట, రెండు వారాలకి ఒకసారి వచ్చేలా, మరో పజిల్‌ని శ్రీ టి. రామలింగయ్య గారు అందిస్తున్నారు.

ఈ ఫీచర్‍లో రచయిత ఒక పదానికి క్లూస్ ఇస్తారు. దానిలో ఉన్న కొన్ని అక్షరాలతో అటుఇటూ మార్చినా లేదా పదాన్ని విడగొట్టినా ఏర్పడే కొత్త పదాలు ఏర్పడుతాయి. అటువంటి పదాల అర్థాలను నిర్వాహకులు సూచిస్తారు. వాటి ఆధారంగా రచయిత హింట్ ఇచ్చిన పదాన్ని పాఠకులు గుర్తించాలి.

ఈ క్రింది ఉదాహరణ చూడండి.

1, 2 అక్షరాలతో కేళి (ఆట), 3,4 అక్షరాలతో ధర, విలువ (వెల), 3,4,5 అక్షరాలతో ఆడుది (వెలది) పదాలు వస్తాయి.

అప్పుడు మూల పదం ‘ఆటవెలది’ అవుతుంది.

ఇటువంటి పది ప్రశ్నలు ఈ పజిల్‌లో ఉంటాయి.

~

ఈ వారం ప్రశ్నలు:

పదం 1 క్లూస్:

1, 2, అక్షరాలతో నాసిక; 3, 2 అక్షరాలతో దిశ; 3, 4, 5, అక్షరాలతో జలుబు చేసినప్పుడు ముక్కుకి, చెవులకి కలిగే ఇబ్బంది; 3, 4, అక్షరాలతో ఎత్తుగడ, తిన్నె.

పదం 2 క్లూస్:

1, 2 అక్షరాలతో క్షీరం; 3, 4, 5 అక్షరాలతో పూలదండ; 3, 4 తోటకాపువాడు; 1, 5 అక్షరాలతో గుడిసె.

పదం 3 క్లూస్:

1, 2 అక్షరాలతో భార్య తండ్రి, భర్త తండ్రి; 3, 4, 5 అక్షరాలతో మాంసము; 2, 4, 5 అక్షరాలతో మీరు మేము కలిసిన.

పదం 4 క్లూస్:

1, 2, 3 అక్షరాలతో కిళాంబి వారి కలం పేరు; 2, 4 అక్షరాలతో అన్నం తిన్న తర్వాత గాలితో వచే ధ్వని; 4, 5 అక్షరాలతో పట్టణం.

పదం 5 క్లూస్:

1, 2, 3, 4 అక్షరాలతో మయుడు నిర్మించిన పట్టణం; 1, అక్షరంతో ఆంగ్లంలో మూడు సంఖ్య; 2, 5, 4 అక్షరాలతో రుద్దు, తోము.

పదం 6 క్లూస్:

1, 2 అక్షరాలతో మాసము; 3, 5 అక్షరాలతో తన్ను; 3, 4 అక్షరాలతో పొల్లుగింజ; 5, 4 అక్షరాలతో లోహాల, రత్నాల మురికి.

పదం 7 క్లూస్:

1, 2 అక్షరాలతో భూమి;  3, 4, 5 అక్షరాలతో ప్రసవం; 5, 2, 3 అక్షరాలతో నారు వేసిన మూడవ రోజు పెట్టే తడి.

పదం 8 క్లూస్:

1, 2, 3 అక్షరాలతో నిర్ణీతకాలము; 4, 5 అక్షరాలతో పద్ధతి; 4, 1 అక్షరాలతో లత, తంతి.

పదం 9 క్లూస్:

1, 2 అక్షరాలతో వాయసవాహనుడు; 3, 4, 5 అక్షరాలతో ఏడు రోజుల కాలము; 1, 4, 5 అక్షరాలతో బాణము.

పదం 10 క్లూస్:

1, 2, 3 అక్షరాలతో ఒక నక్షత్రం; 4, 5 అక్షరాలతో అధికారము; 3, 5 అక్షరాలతో గీకు, బరుకు.

~

మీరు ఈ పజిల్‌ని పూరించి సమాధానాలను 2026 జూన్ 9వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పద విన్యాసం-9 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 2026 జూన్ 14వ తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.

~

పదవిన్యాసం-8 జవాబులు:

1) కొమరుదనం 2) అప్రతిహతం 3) కొమ్మదాసరి 4) షరతుకట్టు 5) లాక్షణికము 6) ధారావాహిక 7) పెడసరము 8) శిరిమగడు 9) భారీవర్షము 10) వల్లభదాసి

~

పదవిన్యాసం-8 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

~

గమనిక:

Exit mobile version