సంచికలో తాజాగా

Related Articles

9 Comments

  1. 1

    Padma

    పాదచారి మొదటివారాన్ని మామోలుగా ,రెండవవారాన్ని ఉత్సుకత తో ,మూడో వారాన్ని మనస్సు నింపుకొని‌చదివిన తరువాత తెల్సింది .భావోద్వేగాల శకలాలు లోంచి ఎవరికి వారు లోలోపలకు చూసుకొంటే ,ఒకో శకలం లోనుంచి ,ఒక కల నో ,ఒక‌విప్లవ మూర్తో ,ఒక‌ వేదాంతో కన్పించినట్లుగా ఎవరికి వారు ప్రశ్నించుకొన్నట్లుగా అద్భుతమైన రచన లా కొనసాగుతుంది .భువనచంద్ర సార్ కి నా హృదయపూర్వక నమస్సులు .ఇంత చక్కటి రచనను అందిస్తున్నా సంచిక పత్రిక వారికి హృదయపూర్వక అభినందనలు

    Reply
    1. 1.1

      BHUVANACHANDRA

      ధన్యవాదాలు పద్మగారు …చాలా సంతోషం …..చదివి మీ అభిప్రాయం చెప్పినందుకు చాలా చాలా ధన్యవాదాలు .

      Reply
  2. 2

    కస్తూరి మురళీ కృష్ణ

    This is the comment by Sivangi
    Verasi- Nee Padachari 3 Bhagalpur chadivanu.

    Nee Viplavam, Nee Karunyam, Nee Prema, Nee Prakruthi, Nee Asa Bhavam, Nee Picchitana I meant I read all 3 parts – parichina Hrudayam- Pagilina Addam lanti vastava Karaku samaajam- entho Bhavavesam- nijanni Pacchiga chupe tapana- very deliberate n sincere effort. Has to touch the heart of the reader!!
    Jali manasutho Chinna cheemaki kuda apakaram cheyyani parama Nazukaina hrudayamSamudranni saitham tagesentha UdrekamEmi cheyaleni Nee Nissahayam You have very artistic hands – anduke Kadhani andamaina Silpam laaga chekkagalav.Entho cheyyalanna Kondantha TapanaYeah nuvvo errabassu Akasanni mingesentha Avesa Samudranni saitham tagesentha Udrekam.. How old were you when you started this??
    Ammavari karuNa
    Verribaguloda!!
    Nimpesindi neelo
    It’s not possible for everyone to relate to Nature. Yes. You r right Mother Nature

    Reply
  3. 3

    యామినీ దేవి కోడే

    నిన్నంటే నిన్ను కాదు.. నాలో దాచుకున్న నన్ను.

    నీ నీడలో నేనున్నా.. నన్ను ప్రేమించవూ అని.. మనసుతో అడిగితే.. పులకించిన ప్రకృతి గలగలమని ఆకుల చప్పుడుతో ఊసుల బాసలు చేసాయి.

    ఆశల స్కూటరు నడిపే స్వప్న మూర్తిలో ఆశల సౌధం కట్టుకుని ఊహల మేడలో ఆమెకై పడే ఆరాటాన్ని చూసాను.
    ఆమెవరో తెలియదు.. కానీ.. ఐక్యం కాలేదని తనలో దిగులు చెట్లు పాతుకుంటాడతను.. మనిషిలోని ఆ స్వప్నికుడు.!

    చేతుల మాల చెట్టు కేస్తే చిటుక్కున కుట్టిన చిట్టి చీమ.. ఎందుక్కుట్టావంటే అప్పుడు కదా చెప్తుంది అసలు నిజం..
    మనసు నుంచీ విడివిడి మనిషివలే మసలి.. ప్రకృతి నుండి విడివడుతున్నావనే ఎరుక చేయడానికే కుట్టానని.

    సమస్త జీవజాలంతో సంచారం
    ఆశ్వాదించే మనసుకు నిదర్శనమై.. చక్కటి అనుభవ సారమనిపించింది.
    ఫలాలేరుకోవడం.. సేదతీరడం.. ప్రకృతిని ఆశ్వాదించడం..
    కుక్కపిల్ల సావాసం..
    అసలు ప్రశ్న.. అవసరమైన ప్రశ్న.. నువ్వు ఎవరూ? నేను ఎవరూ?

    నిద్రలో.. కలలు.. అందులో కథల్లాంటి కలలు.

    నీవనే నీవంటే..??
    తర్కం అనే రెండు వైపులా పదునైన కత్తి. ఆ కత్తి అందులో పదును ధర్శించాక నిజం ఆచూకీ.. సత్యం యొక్క స్థానం రెండు కనిపిస్తాయి.

    కొండ కోనల నుండీ భూమి ఆకాశాలవరకూ.. సముద్రం గర్భం నుండీ ఎత్తైన పర్వత శిఖరాల వరకూ మనిషి ఆశలు, నిశ్వాసలున్నాయి అనే సత్యం ఎరుకలోకి వచ్చాక గుండెల్లో ఆనందం వ్యాకోచించి పెదవులపై చిరునవ్వుగా పరచుకుంది.

    ఆ దృశ్యాదృశ్యాలు..
    ఆ అనుభూతులన్నీ
    మాయేదో నిజమేదో చూడమని చెప్పినట్టనిపించిది.

    నీ కళ్ళకు కనిపించేది దౌర్భాగ్యం
    నా కంటికి రుచించేది సౌందర్యం అన్న
    భావం లో రమించు వాడిని తెచ్చి.. వాస్తవాన్ని రుచి చూపడం బావుంది.

    వంటిని విస్తరి చేసిన పసితనాలెన్నో..
    ఆ తర్వాత చివరి పేరా వరకూ మనసు మెలిక పడింది.
    పలయనానికీ.. విప్లవానికీ మద్య తేడా సున్నితంగా తెలియజెప్పడం ఆలోచనలో పడేయక మానదు.
    పాదచారి వెంట అన్ని పాత్రల్లో.. కలగలిసిపోయాను.
    ఆ అడుగుల్లో అడుగేస్తూ అక్కడే నేనింకిపోయాను.

    Reply
  4. 4

    BHUVANACHANDRA

    చదువరుల౦దరికీ నా హృదయపూర్వక నమస్కారాలు.ఈ ”’పాదచారి ”’ తోటలో పెరిగిన మొక్క కాదు .అడవిలో స్వేచ్చగా పెరిగిన వృక్షం . ఇదో అంతరంగ పయనం.ఇందులో సస్పెన్స్ వుండదు.శృంగార ,వీర రసాల్లాంటి రసాలు వుండవు ….చక్కిలిగింతలు పుట్టించే ప్రేమ సంభాషణలు వుండవు .ఉన్నది ఎదో
    ఓపెన్ గానే వుంది . మీరూ నాతోపాటు పయనిస్తున్నందుకు మీకు నా సాష్టాంగనమస్కారాలు .
    అభిప్రాయాలు అందించిన ,అందిస్తున్న అందరికీ మరీ మరీ నా ధన్యవాదాలు .
    మీఅభిప్రాయాలు తెలియజేస్తే ఎంతో సంతోషిస్తానని మనవి చేస్తూ
    మీ
    భువనచంద్ర

    Reply
  5. 5

    కస్తూరి మురళీ కృష్ణ

    ఇది యామిని దేవి కోడే గారి అభిప్రాయం

    మనిషికీ మనసుకూ మద్య ఊసులు
    పాదచారి వెంట పాత్రలు..
    ఎవరి లోకంలో వారిని ఉండనివ్వక సత్యమేమిటో చూపిస్తాయి.
    నిత్యం వైపు నడిపిస్తాయి.

    కావాలనుకున్న కాంతి నక్షత్రం
    దూరపు కొండ.. మనిషికీ మనసుకూ మద్య శ్వాసలూ.. నిట్టూర్పులూ.. ఎన్ననీ.. చెప్పలేనన్ని శ్వాసలు ఎదురుగా నిలిచి నిలతీస్తున్నాయి.

    రేయి.. పగలు చీకటి.. వెలుగు ఇలా అనేకం వెలిగి ఆరే నక్షత్రాలు.. ఎంత చక్కటి పోలికలివ్వన్నీ.. జీవితం క్షణకాలపు బంగురం అనే మాట ఎందుకో నా కిప్పుడు గుర్తు వచ్చింది..

    ఈ ప్రస్తావన ఇప్పుడు సరైనదో కాదో కానీ.. నాకు అదే అనిపించిది.
    ఏదో ఉందనుకోవడం.. కావాలనుకోవడం..
    ఊహలో ఉన్నదీ.. కావాలనుకున్నదీ..
    అప్పుడే తెలిసింది తృప్తి అనేది ఉండేది ఎక్కడని.

    పాదచారి పార్కులో ప్రేమికుణ్ణి అడిగే ప్రశ్న ఆలోచన రేకెత్తించదూ..
    నక్షత్రాలను అడిగే ప్రశ్నలు కూడా అంతే ఆలోచనలో పడేసాయి.
    ఈ ఆరోమెట్టు కథే నాక్కావాల్సిందనిపించిందిప్పుడు.. చేరవలసిన తీరమేదో అక్కడే ఉన్నట్టుంది..
    నిన్నంటే నిన్ను కాదు.. నాలో దాచుకున్న నన్ను.

    నీ నీడలో నేనున్నా.. నన్ను ప్రేమించవూ.. మనసుతో అడిగితే పులకించిన ప్రకృతి .. గలగలమని చప్పుడు చేసి ఊసుల బాసలు చేసిన ఆకులు..

    ఆశల స్కూటరు నడిపే స్వప్న మూర్తిని చూస్తే.. ఆశల సౌధం కట్టుకుని ఊహల మేడలో ఆమెకై పడే ఆరాటాన్ని చూడవచ్చు.
    ఎవరో తెలియదు.. కానీ.. ఐక్యం కాలేదని దిగులు చెట్లు పాతుకుంటాడతను.. మనిషిలోని ఆ స్వప్నికుడు.!

    చేతుల మాల చెట్టు కేస్తే చిటుక్కున కుట్టిన చిట్టి చీమ.. ఎందుకంటే అప్పుడు కదా చెప్తుంది అసలు నిజం..
    మనసు నుంచీ విడివిడి మనిషివలే మసలి.. ప్రకృతి నుండి విడివడుతున్నావనే ఎరుక చేయడానికే కుట్టిన చీమ
    సమస్త జీవజాలంతో సంచారం చక్కటి అనుభవ సారమనిపించదూ..

    ఫలాలేరుకోవడం.. సేదతీరడం.. ప్రకృతిని ఆశ్వాదించడం..
    కుక్కపిల్ల సావాసం..
    అసలు ప్రశ్న.. అవసరమైన ప్రశ్న.. నువ్వు ఎవరూ? నేను ఎవరూ?

    నిద్రలో.. కలలు.. అందులో కథల్లాంటి కలలు.

    నీవనే నీవంటే..??
    తర్కం అనే రెండు వైపులా పదునైన కత్తిని ధర్శించాక నిజం ఆచూకీ.. సత్యం యొక్క స్థానం రెండు కనిపిస్తాయి.

    కొండ కోనల నుండీ భూమి ఆకాశాలవరకూ.. సముద్రం గర్భం నుండీ ఎత్తైన పర్వత శిఖరాల వరకూ మనిషి ఆశలు, నిశ్వాసలున్నాయి అనే సత్యం ఎరుకలోకి వచ్చాక గుండెల్లో ఆనందం వ్యాకోచించి పెదవులపై చిరునవ్వుగా పరచుకుంది.

    ఆ దృశ్యాదృశ్యాలు..
    ఆ అనుభూతులన్నీ
    మాయ ఏదో నిజం ఏదో చూడమని చెప్పినట్టు అనిపించిది.

    నీ కళ్ళకు కనిపించేది దౌర్భాగ్యం
    నా కంటికి రుచించేది సౌందర్యం అన్న
    భావం లో రమించు వాడిని తెచ్చి.. వాస్తవాన్ని రుచి చూపడం బావుంది.

    వంటిని విస్తరి చేసిన పసితనాలెన్నో..
    ఆ తర్వాత చివరి పేరా వరకూ మనసు మెలిక పడింది
    పలయనానికీ.. విప్లవానికీ మద్య తేడా సున్నితంగా తెలియజెప్పడం ఆలోచనలో పడేయక మానదు.
    పాదచారి వెంట అన్ని పాత్రల్లో.. కలగలిసిపోయాను.
    ఆ అడుగుల్లో నేనింకిపోయాను. ఇంకా మరలా చూడాలి.. ఇంకా నేను అనుభూతి చెందిన భావాలు ఏదైనా చేర్చడానికి..

    Reply
  6. 6

    కస్తూరి మురళీ కృష్ణ

    పాదచారీ
    నీ విప్లవం నీ కారుణ్యం నీ ప్రేమ​
    నీ ప్రకృతి నీ ఆశాభావం​
    నీ పిచ్చితనం వెరశి నీ పాదచారి (నవలా?)​
    3 భాగాలు పూర్తిగా చదివాను.​
    ‘పరిచిన హృదయం – పగిలిన అద్దం’ లాంటి​
    వాస్తవ కరకు సమాజం.​
    ఎంతో భావావేశం… నిజాన్ని పచ్చిగా​
    చూపాలనే తపన -​
    వెరీ డెలిబరేట్ అండ్ సిన్సియర్ ఎఫర్ట్.​
    అది పాఠకుల హృదయాల్ని స్పృశించి​
    తీరుతుంది.​
    సమాజాన్ని సైతం తాగేసేంత ఉద్రేకం​
    జాలి మనసులో చిన్న చీమకి కూడా​
    అపకారం చెయ్యని ప్రేమ…​
    నాజూకైన హృదయం​
    ఎన్నో చెయ్యాలనే కొండంత తపన​
    ఆకాశాన్ని మింగేసేంత ఆవేశం​
    నీ చేతులు చాలా కళాత్మకంగా ఉంటాయి…​
    అందుకే కథని అందమైన శిల్పంగా​
    చెక్కుతున్నావు​
    నువ్వో ఎర్రబస్సువి​
    ఓ వెర్రి బాగులోడివి​
    ఈ ‘పాదచారి’ మొదలెట్టినప్పుడు నీకెన్నేళ్ళు?​
    – ‘శివంగి’.​

    Reply
  7. 7

    యామినీ దేవి కోడే

    ఓ పాదచారి నీవెవరు – నేనెవరూ..!!
    ఏయ్.. ఎవర్నువ్వూ..?
    నేను తెలీదా నీకూ..?
    నేను నేనే..
    నువ్వంటే..
    నేనే..
    అనంతాన్ని.
    అనంతమా.. అదేమిటీ..
    అది అదే..
    అదే అంటే..
    అదేం తిక్క సమాధానం..
    సరే అయితే..
    నీకు అర్థం కాలేదు..
    నేను అగాధాన్ని..
    అంతే తెలియని లోతుని..
    మళ్లీ ఇదేమిటి..!
    ఏం నీక్కావలసిందే చెప్పాగా..
    ఏమో నాకదేం తెలీదు.. ఎలా ఉంటుందదీ..
    నాలా ఉంటుంది.
    ఇంతకీ నువ్వెలా ఉంటావ్..!
    నేను నాలాగే ఉంటా..
    అదే.. ఎలా ఉంటావూ.. అని
    నేను నాలాగే ఉంటా..
    అదే అడిగేది..
    నువ్వెలా ఉంటావనే అడుగుతుంటే.. సరిగ్గా చెప్పు..
    నీ కళ్ళ రంగులో ఉంటా..
    నిజమా..
    అవును
    నువ్వైలా చూస్తే
    నేనలా కనపడతా..

    నా కళ్ళలో రెండు రంగులే ఉన్నాయి
    ఒకటి తెలుపు.. మరొకటి నలుపు
    అవునా.. నువ్వు రెండు రంగులూ చూడగలవ్..
    ఒకటి సత్యం.. మరొకటి అసత్యం.
    నాకేమీ కనపడట్లేదు..
    శూన్యం లోకి వెళ్ళావా..!
    అవును..
    నీ వల్లే.. నీ చూపు వల్లే..
    అగాధశూన్యంలోకి..

    Reply
  8. 8

    K Murali Krishna

    ”పాదచారి నవల”. అని ప్రారంభంలో మాన్యులు కస్తూరి మురళీకృష్ణ గారు చెప్పారు. అయితే పాదచారిలో కథ లేదు. పాత్రల్లేవు.సమయాలు సందర్భాలు లేవు…..ఆ వున్నవేవీ పాత్రలనిపించవు. ఎవరితోనూ ఎవరూ భాషించరు…..ఐనా..కానీ,….ఒక దివ్యదార్శనికమైన విషయమేదో వుందని లీలగా అనిపిస్తోంది.విచారణ,విశ్లేషణలతోనే అది కొంచెం కొరుకుడు పడుతుందనుకుంటా…అందలోంచీ మనకేం కావాలో దాన్ని వెతికిపట్టుకోవలసిందే.
    బంగారం కావాలంటే భూమిలోకి తొలుచుకొని వెళ్ళాల్సిందే..అలాగే ముత్యాలకోసం
    సముద్రంలోకి వెళ్ళక తప్పదు…కనుక విషయోన్మీలన తోనే విషయదర్శనం కాగలదని నా నమ్మకం..అదే స్థిరమైన గమ్యమని, రాజీలేని మార్గమని నాకనిపించింది..ఎందుకంటే అంతుచిక్కని పాదచారివ్యూహం పద్మవ్యూహాన్ని
    తలపిస్తోంది..దాన్ని ఛేదించి ఆస్వాదించడానికొకటే మార్గం…ఆత్మవిశ్వాసం!
    అది అభిమన్యు ప్రయత్నం.. సూక్ష్మ పరిశీలన,స్వతంత్ర ఆలోచనే ఆయుధాలు.

    రెండో భాగం చివరిలో రచయిత 5 — 6 — 7 మెట్లదగ్గర కు తీసుకెళ్ళారు.
    పొడుపు కథ లాంటి విషయాన్ని ప్రదర్శించారు. బుర్ర కు పనిపెట్టారు…..ఐదోమెట్టు
    పంచభూతాత్మక మైతే ఏడో మెట్టు సప్తధాతు సమ్మేళనం…ఈ రెండింటికీ మధ్య
    ఆరోమెట్టు అరిషడ్వర్గాలతో అలరారుతోందని, అనిపించి అక్కడే ఆగాను…అప్పుడే
    తెలిసింది, రచయిత ఆరోమెట్టు మీదే మా ఆరోప్రాణాన్ని ఆట్టే నిలబెట్టే వారిని!..మూడోభాగాన్ని చూడగానే అదేమో (ఆరోప్రాణం) ఆరునొక్కరాగాన్నందుకుంది….ఎప్పుడాపుతుందో !!??…….అదండీ సంగతి!.🙏🏻
    ఇది DR. Gaali Rajeswari గారి అభిప్రాయం

    Reply

Leave a Reply to యామినీ దేవి కోడే Cancel Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika™

error: Content is protected !!